E-Paper
Advertisement

Bigg Boss Season 8 Telugu: బిగ్ బాస్ సీజన్ – 8 ప్రోమో.. ఎలా ఉందో చూశారా..?

Bigg Boss Season 8 Telugu: బిగ్ బాస్ సీజన్ – 8 ప్రోమో.. ఎలా ఉందో చూశారా..?
Advertisement

Bigg Boss Season 8 Telugu Released: బిగ్ బాస్ షోకు జనాల్లో ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓవైపు ఈ షోపై విమర్శలు వస్తున్నా మరోవైపు ఆడియన్స్ మాత్రం తగ్గడంలేదు. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, హిందీ భాషలలో కూడా ఈ షోకు భారీగా రెస్పాన్స్ వస్తోంది. కాగా, తెలుగులో మాత్రం ఫస్ట్ సీజన్ భారీగా హిట్టయ్యింది. తొలి సీజన్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్టింగ్ చేయగా, ఆ తరువాత న్యేచురల్ స్టార్ నాని హోస్టింగ్ చేశారు. అయితే, మూడో సీజన్ నుంచి బిగ్ బాస్ షోకు హీరో నాగార్జున హోస్టింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఉన్న బిగ్ బాస్ షో రూల్స్, హోస్టింగ్ ప్రాసెస్ మొత్తాన్ని సీజన్ 7 నుంచి మార్చేశారు. ముఖ్యంగా సీజన్ 7లో హోస్టింగ్ అదరగొట్టేశాడంటూ ఆడియన్స్ పొగడ్తలతో ముంచెత్తారు. సీజన్ 7 సూపర్ హిట్ కావడంతో ప్రస్తుతం సీజన్ 8 కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సీజన్ 8 ప్రారంభం కాబోతుంది, కంటెస్టెంట్ లిస్ట్ అంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తున్న క్రమంలో తాజాగా బిగ్ బాస్ సీజన్ 8 గురించి అప్డేట్ ఇచ్చేశారు. వెరైటీ ప్రమోషన్లతో హడావుడిని అప్పుడే ప్రారంభించారు.

Also Released: ఆస్పత్రి నుంచి హీరోయిన్ జాన్వీకపూర్ డిశ్చార్జ్

Advertisement

బిగ్ బాస్ సీజన్ 8 కు సంబంధించి కొత్త లోగోను రివీల్ చేస్తూ అసలు ప్రోమోను హీరో నాగార్జున రిలీజ్ చేశాడు. అయితే, ఈ షో ఎప్పట్నుంచి ప్రారంభమవ్వనున్నది అనేది మాత్రం చెప్పలేదు. ఎంటర్ టైన్మెంట్ తీసుకువచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాం.. అంతులేని వినోదాన్ని ఆనందించేందుకు మీరు రెడీగా ఉన్నారా? అంటూ కొత్త లోగోను నాగార్జున షేర్ చేశాడు. ఈ కొత్త లోగో కలర్ ఫుల్‌గా ఉండి ఎంతగానో ఆకట్టుకుంటుంది. నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఇదిలా ఉంటే.. ఈ షోకు సంబంధించి కంటెస్టెంట్ లిస్ట్ గురించి నెట్టింట అనేక వార్తలు వినిపిస్తున్న విషయం విధితమే. ఈసారి కూడా షోలో ఎక్కువమంది బుల్లితెర సీరియల్స్, యాంకర్సే ఉండనున్నారని అనుకుంటున్నారు. వీరితోపాటు సోషల్ మీడియాలో ఫేమస్ అయినవారిని, యూట్యూబర్స్‌ను కూడా తీసుకువస్తున్నారంటా. ఆగస్టు ఎండింగ్ లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో బిగ్ బాస్ షో స్టార్ట్ చేయనున్నారని సమాచారం.

Advertisement

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×