Google Pixel 9 Pro Fold first look: గూగుల్ ఫోన్లకు మార్కెట్‌లో ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. కొత్త కొత్త ఫోన్లు మార్కెట్‌లో రిలీజ్ అయి బాగా పాపులారిటీ తెచ్చుకుంటున్నాయి. ఇప్పటికే గూగుల్ నుండి విడుదలైన ఫోల్డబుల్ ఫోన్లు మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతున్నాయి. కంపెనీ ఇప్పుడు తన తదుపరి లైనప్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. Google ఆగష్టు 13న ‘మేడ్ బై గూగుల్’ ఈవెంట్‌ను హోస్ట్ చేయడానికి రెడీ అయింది. ఈ ఈవెంట్ సందర్భంగా టెక్ దిగ్గజం గూగుల్ తన నెక్స్ట్ జెన్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లు అయిన పిక్సెల్ 9 సిరీస్, పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్‌లను విడుదల చేస్తుంది.
అయితే లాంచ్ చేయడానికి ముందు కంపెనీ దాని కొత్త స్మార్ట్‌ఫోన్ డిజైన్‌ను వెల్లడిస్తూ కొత్త టీజర్ వీడియోను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్లోకి కూడా రాబోతుందని తెలిపింది. రాబోయే Google Pixel 9 Pro ఫోల్డ్ గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. టీజర్ వీడియోలో పిక్సెల్ 9 ప్రోని పరిచయం చేసిన తర్వాత.. గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్‌ను ఆవిష్కరించింది. దాని డిజైన్, పేరును తెలిపింది.
వీడియోలో ఫోల్డబుల్ ఫోన్‌ను ‘జెమినీ ఎరా కోసం రూపొందించిన ఫోల్డబుల్ ఫోన్’ అనే ట్యాగ్‌లైన్‌తో ప్రదర్శించింది. అలాగే ఇది AI చాట్‌బాట్‌ను కలిగి ఉందని తెలిపింది. టీజర్ వీడియో పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్‌కి సంబంధించిన లుక్, డిజైన్‌ను వెల్లడించింది. కవర్ డిస్‌ప్లే హోల్ పంచ్ కటౌట్‌ను కలిగి ఉంది. ఇది అధికారిక లాంచ్‌లో మరింత శక్తివంతమైన కలర్ ఆప్షన్లతో వచ్చే అవకాశం ఉంది.
ఇకపోతే పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ దాని ముందున్న గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ మాదిరి కాకుండా.. ఇంతవరకు దేశంలో లాంచ్ చేయని ఫోన్ మాదిరి భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉంటుందని గూగుల్ వెల్లడించింది. గ్లోబల్ లాంచ్ ఈవెంట్ తర్వాత ఆగస్టు 14న భారతదేశంలో పిక్సెల్ 9 ప్రోతో పాటుగా బుక్-స్టైల్ ఫోల్డబుల్ విడుదల చేయబడుతుందని తెలిపింది. పోస్ట్ ప్రకారం.. ఫోన్ కోసం బ్లాక్ కలర్ ఎంపికను వెల్లడించింది. ఆసక్తి ఉన్న వినియోగదారులు Google ఆన్‌లైన్ స్టోర్ నుండి పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్, పిక్సెల్ 9 ప్రో ఫోన్ల గురించి మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చని తెలిపింది.
Out with the old. In with the fold. Google Pixel 9 Pro Fold, for the first time in India. ✨
Learn more at: https://t.co/72BVe5FKyB pic.twitter.com/5b0cAFs0qd
— Google India (@GoogleIndia) July 19, 2024
A phone built for the Gemini era. It can do a lot—even let your old phone down easy.
Learn more at: https://t.co/72BVe5FKyB pic.twitter.com/CgvrAXuLVe
— Google India (@GoogleIndia) July 18, 2024