BigTV English

Naveen Polishetty : నా స్థాయిని మించి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తా, రాజు గాడి పెళ్లి బానే ప్లాన్ చేసినట్టు ఉన్నారు

Naveen Polishetty : నా స్థాయిని మించి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తా, రాజు గాడి పెళ్లి బానే ప్లాన్ చేసినట్టు ఉన్నారు

Naveen Polishetty : ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో నవీన్ పోలిశెట్టి ఒకరు. ముందుగా చిన్న చిన్న సినిమాల్లో కొన్ని పాత్రలలో కనిపించిన నవీన్. ఆ తర్వాత తెలుగు ఫిలిమ్స్ కి కొన్ని ఏళ్లపాటు గ్యాప్ ఇచ్చి, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయం సాధించింది. ఒక్కసారిగా నవీన్ పోలిశెట్టి ఫేమస్ అయిపోయాడు. ఈ సినిమా తర్వాత నవీన్ చేసిన సినిమా జాతి రత్నాలు. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాను చేశాడు నవీన్. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది.


నవీన్ ఇప్పటివరకు చేసిన మూడు సినిమాలు కూడా వేరే లెవెల్ అని చెప్పొచ్చు. నవీన్ కొంత టైం తీసుకున్న కూడా క్వాలిటీ ఫిలిమ్స్ చేస్తాడు అని అందరికీ ఒక స్థాయి నమ్మకం వచ్చేసింది. నవీన్ పోలిశెట్టి ఒక సినిమాకి సైన్ చేశాడు అని అంటే ఏమీ ఆలోచించకుండా సినిమాకి వెళ్లిపోవచ్చు అని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఇక ప్రస్తుతం అనగనగా ఒక రాజు అనే సినిమాను చేస్తున్నడు నవీన్ పోలిశెట్టి. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ను దాదాపు రెండేళ్ల క్రితం రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. అలానే కొన్ని నెలల క్రితం కొత్త టీజర్ కూడా రిలీజ్ చేసింది. ఈ టీజర్ రిలీజ్ చేసిన తర్వాత అందరికీ తెలిసిన విషయమేంటంటే టెక్నీషియన్స్ చాలా వరకు మారిపోయారు అని.

అనగనగా ఒక రాజు అప్డేట్


ఈ సినిమా టీజర్ విపరీతంగా ఆకట్టుకుంది. నవీన్ తన టైమింగ్ తో ఎంటర్టైన్ చేశాడు. ఇక ప్రస్తుతం ఈ సినిమా గురించి అప్డేట్ ఏమీ రావట్లేదు అనుకుంటున్న తరుణంలో ట్విట్టర్ వేదిక నవీన్ రియాక్ట్ అయ్యాడు. ఒక ప్రముఖ జర్నలిస్టు రాసిన మాటలకు రియాక్ట్ అవుతూ… నా శక్తిని మించి రాజు క్యారెక్టర్ తో మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేస్తాను అంటూ మాటిచ్చాడు. అంతేకాకుండా ఈ సినిమా నుంచి త్వరలో ఒక సర్ప్రైజ్ ఉండబోతున్నట్లు నవీన్ తెలిపాడు. అసలు నవీన్ ఎటువంటి సప్రైజ్ ఇస్తాడని చాలామంది నెటిజెన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక ఇది వరకే ఆ సినిమా నుంచి విడుదలైన టీజర్స్ మాత్రం అంచనాలను విపరీతంగా పెంచేసాయి అని చెప్పొచ్చు.

Also read : Nag Ashwin: ఆ సినిమా వల్ల వారం రోజులు డిప్రెషన్‌లోకి వెళ్లిన నాగ్ అశ్విన్.. ఇంతకీ ఏంటా సినిమా.?

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×