BigTV English

Nag Ashwin: ఆ సినిమా వల్ల వారం రోజులు డిప్రెషన్‌లోకి వెళ్లిన నాగ్ అశ్విన్.. ఇంతకీ ఏంటా సినిమా.?

Nag Ashwin: ఆ సినిమా వల్ల వారం రోజులు డిప్రెషన్‌లోకి వెళ్లిన నాగ్ అశ్విన్.. ఇంతకీ ఏంటా సినిమా.?

Nag Ashwin: ఈరోజుల్లో యంగ్ డైరెక్టర్లే పాన్ ఇండియా రేంజ్‌లో హిట్లు ఇస్తూ వారి టాలెంట్ ఏ మాత్రం తక్కువ కాదని నిరూపిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఒకప్పుడు స్టార్లుగా వెలిగిపోయిన చాలామంది సీనియర్ డైరెక్టర్లు చాలావరకు ఔట్‌డేటెడ్ ఐడియాలతో ప్రేక్షకులకు బోర్ కొట్టేలా చేస్తుంటే యంగ్ డైరెక్టర్లపైనే ప్రేక్షకులు చాలా నమ్మకం పెట్టుకున్నారు. అలాంటి దర్శకుల్లో నాగ్ అశ్విన్ ఒకడు. ప్రభాస్ లాంటి స్టార్ హీరోను హ్యాండిల్ చేస్తూ ‘కల్కి 2898 ఏడీ’ అనే హిట్ మూవీని తెరకెక్కించాడు నాగ్ అశ్విన్. ఆ తర్వాత డైరెక్టర్‌గా తన డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. తాజాగా తను ఒక సినిమాను చూసి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఈ దర్శకుడు.


ఎప్పుడో రాసుకున్న కథ

తాజాగా కొందరు సినిమా స్టూడెంట్స్‌తో ఇంటరాక్ట్ అయ్యి వారితో సినీ విశేషాలు పంచుకున్నాడు నాగ్ అశ్విన్. వారికి ఫిల్మ్ మేకింగ్ గురించి వివరించాడు. ఆ క్రమంలో తనను బాగా డిస్టర్బ్ చేసిన సినిమా ఏంటో కూడా బయటపెట్టాడు. క్రిస్టోఫర్ నోలాన్ తెరకెక్కించిన ‘ఇన్సెప్షన్’ చూసిన తర్వాత తను చాలా మానసికంగా కృంగిపోయానని చెప్పుకొచ్చాడు నాగ్ అశ్విన్. ‘‘నాకు కూడా ఇన్సెప్షన్ లాంటి ఒక ఐడియా ఉండేది. కానీ ఆ సినిమా కలల గురించి అయితే నేను అనుకున్న కథ ఆలోచనల గురించి. 2008లోనే నేను ఆ కథ అనుకున్నాను. కానీ ఒక్కసారి ఇన్సెప్షన్ ట్రైలర్ చూసిన తర్వాత నేను నా ఐడియాను పక్కన పెట్టేశాను’’ అని ‘ఇన్సెప్షన్’ సినిమా గురించి మాట్లాడాడు నాగ్ అశ్విన్.


సీక్వెల్‌పై అంచనాలు

‘‘ఇన్సెప్షన్ (Inception) సినిమా నన్ను చాలా డీప్‌గా ఎఫెక్ట్ చేసింది. దానివల్ల నేను వారం రోజులు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను’’ అని గుర్తుచేసుకున్నాడు నాగ్ అశ్విన్ (Nag Ashwin). ‘ఇన్సెప్షన్’ లాగా కాకపోయినా ‘కల్కి 2898 ఏడీ’తో ఏదో ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయడానికే ట్రై చేశాడు. తను క్రియేట్ చేసిన ఆ కొత్త ప్రపంచానికే మూవీ లవర్స్ అంతా ఫిదా అయ్యారు. ఇందులో ప్రభాస్ లాంటి స్టార్ హీరో ఉన్నా కూడా కథకే ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ మూవీకి సంబంధించిన సెకండ్ పార్ట్ గురించి ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) క్లైమాక్స్‌లో ప్రభాస్‌ను కర్ణుడిగా చూపించి సీక్వెల్‌పై మరిన్ని అంచనాలు పెంచేశాడు నాగ్ అశ్విన్.

Also Read: ఆ స్టార్ హీరోను తప్పించి.. రామ్ చరణ్ చేతిలోకి మెగా ప్రాజెక్ట్.. పక్కా పూనకాలు లోడింగ్

క్రియేటివ్‌గా ఆలోచించాలి

‘కల్కి 2898 ఏడీ’లో ప్రభాస్‌ (Prabhas)తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె లాంటి స్టార్లు నటించారు. దాదాపు అందరి పాత్రలకు సమానంగా ప్రాధాన్యత ఇస్తూ అందరినీ సమానంగా బ్యాలెన్స్ చేయగలిగాడు నాగ్ అశ్విన్. అందుకే తన టేకింగ్‌కు ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. తాజాగా ఈ మూవీ సీక్వెల్ గురించి మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలోని ప్రతీ సీన్ కోసం ఎంతో కష్టపడాలి. రైటింగ్ బాగున్నందుకే సినిమా అందరినీ ఇంప్రెస్ చేయగలిగింది. మేము దీనికోసం ఎన్నో ఏఐ టూల్స్ ఉపయోగించాం. ఇప్పుడు ఈ ఏఐ టూల్స్ గురించి అందరికీ తెలిసిపోయింది. అందుకే మేము మరింత క్రియేటివ్‌గా ఆలోచించాల్సి ఉంటుంది’’ అని చెప్పుకొచ్చాడు నాగ్ అశ్విన్.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×