BigTV English

Masthan Sai Case: మస్తాన్ సాయి కేస్ వివాదం.. దర్గాను స్వాధీనం చేసుకోవాలంటూ ఉత్తర్వులు..!

Masthan Sai Case: మస్తాన్ సాయి కేస్ వివాదం.. దర్గాను స్వాధీనం చేసుకోవాలంటూ ఉత్తర్వులు..!

Masthan Sai Case: మస్తాన్ సాయి (Mastan Sai).. లావణ్య (Lavanya), రాజ్ తరుణ్ (Raj Tarun) కేసులో అత్యంత కీలకంగా మారిన మస్తాన్ సాయి.. ఈ ఏడాది మొదట్లో డ్రగ్స్ వివాదంతో పాటు హార్డ్ డిస్క్ లో పలువురు అమ్మాయిల నగ్న వీడియోలను స్టోర్ చేసిన కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.మస్తాన్ సాయి తనను బ్లాక్ మెయిల్ చేసి తన ప్రైవేట్ వీడియోను ఒక హార్డ్ డిస్క్లో స్టోర్ చేశాడు అంటూ లావణ్య పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు సాక్షాలు ఉండడంతో మస్తాన్ సాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇప్పుడు మస్తాన్ సాయి కేస్ కాస్త ఇప్పుడు ఆయన తండ్రికి ఉద్యోగ గండంలా మారిందని చెప్పాలి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.


మస్తాన్ సాయి వివాదం.. తండ్రికి ఉద్యోగ గండం..

మస్తాన్ సాయి వివాదం కాస్త ఇప్పుడు ఆయన తండ్రికి పదవి గండంలా మారిపోయింది. ముఖ్యంగా మస్తాన్ సాయి వివాదం కారణంగా గుంటూరులో ఉండే మస్తాన్ దర్గాకి ధర్మకర్తగా వ్యవహరిస్తున్న మస్తాన్ సాయి తండ్రి రామ్మోహన్ కి ఇప్పుడు పదవి ఊడే లాగా కనిపిస్తోంది. అటు రామ్మోహన్ ని కూడా దర్గా ధర్మకర్తగా తప్పించడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కానీ రామ్మోహన్ తప్పించుకు తిరుగుతున్నాడని బోర్డు సభ్యులు కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు మస్తాన్ సాయి డ్రగ్స్ మాఫియా కేసులో కీలకమైన వ్యక్తిగా మారగా.. ఇతడు ఇంత విలాసమైన జీవితాన్ని గడపడానికి కారణం దర్గా నుండి వచ్చే డబ్బులే అంటూ ప్రచారం చేపట్టారు.


రామ్మోహన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ..

ఇలాంటి సమయంలోనే గుంటూరు మస్తాన్ దర్గాను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అడ్వకేట్ నాగూర్ బాబు గవర్నర్ కి రాసిన లేఖతో ప్రభుత్వ యంత్రాంగం కదిలిందని, ఈ దర్గా వివాదంపై ఏకంగా గుంటూరు జిల్లా కలెక్టర్ విచారణ చేపట్టినట్లు సమాచారం. విచారణలో దర్గా పవిత్రతకు, ప్రతిష్టకు, భక్తుల భద్రతకు భంగం వాటిల్లిందని కలెక్టర్ కి సమర్పించిన నివేదికలో వెల్లడించారు. ఈ మేరకు మస్తాన్ సాయి కుటుంబ ఆధిపత్యం నుంచి దర్గానుస్వాధీనం చేసుకున్నట్లు సమాచారం..అయితే ఇలా దర్గాను స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు రాగా.. బిగ్ టీవీ కి.. మస్తాన్ దర్గా వివాదం పై ధర్మకర్త రామ్మోహన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. వక్ఫ్ బోర్డు నుంచి మాకు ఎటువంటి నోటీసులు రాలేదు. మస్తాన్ దర్గాని తమకు అప్పగించాలని వక్ఫ్ బోర్డు సభ్యులు చెప్పడంతో నేను ఎమ్మెల్యే నజీర్ ను కలిశాను. దర్గాలో కూడా హిందూ సంప్రదాయం ప్రకారం హారతి ఇవ్వడం, పూజలు చేయడం లాంటివి చేస్తున్నాను. అయితే మా అబ్బాయి మస్తాన్ సాయి వివాదాన్ని ఇప్పుడు దర్గాకి ముడి పెట్టడం బాధగా ఉంది అంటూ రామ్మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇప్పుడు మస్తాన్ దర్గాను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Related News

Viral News: రోజుకు 24 గంటలు కాదు.. 18 గంటలే.. అథోస్ సన్యాసులు చెప్పింది వింటే మైండ్ బ్లాకే!

OnlyFans: ఇండియాలో ‘ఓన్లీ ఫ్యాన్స్’ లీగలా? ఇందులో ఎలా సంపాదించవచ్చు?

Viral Video: మూడో అంతస్తు మీద నుంచి పడిపోయాడు.. ఆ తర్వాత మీరు నమ్మలేనిది జరిగింది!

Viral Video: హాలీవుడ్ మూవీని తలపించేలా కారు ప్రమాదం.. వెంట్రుకవాసిలో బయటపడ్డాడు, వైరల్ వీడియో

Viral Video: దాహమేస్తే ఇంజిన్ ఆయిల్ తాగేస్తాడు.. రోజూ ఏకంగా 8 లీటర్లు!

Viral Video: ఫ్లష్ కొట్టగానే.. బుస్సు అంటూ పైకిలేచిన తాచు పాము, పాపం.. గుండె జారింది!

Rare Meteor: ఆకాశంలో అరుదైన మెరుపులు.. నిజంగా ఉల్కాపాతమేనా?

Viral Video: రోడ్డు మధ్యలో కారు ఆపి.. హస్త ప్రయోగం.. ఇంత కరువులో ఉన్నావ్ ఏంట్రా?

Big Stories

×