E-Paper
Advertisement

Siddharth: అప్పుడే కండోమ్ పట్టుకొని రోడ్ ఎక్కాను.. సీఎం చెప్తే చేయలేదు

Siddharth: అప్పుడే కండోమ్ పట్టుకొని రోడ్ ఎక్కాను.. సీఎం చెప్తే చేయలేదు
Advertisement

Siddharth: హీరో సిద్దార్థ్.. ప్రస్తుతం వరుస ఆసినిమాలతో బిజీగా మారాడు. ఆయన నటిస్తున్న చిత్రాల్లో భారతీయుడు 2 ఒకటి. కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 12 న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా హైప్ ను కూడా క్రియేట్ చేసింది.

ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రబృందం.. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై అంచనాలను మరింత పెంచుతుంది. ఇక తాజాగా తెలుగు జర్నలిస్టులతో భారతీయుడు 2 చిత్రబృందం ముచ్చటించింది. వారు అడిగిన ప్రశ్నలకు చిత్ర బృందం ఎంతో ఓపిగ్గా సమాధానాలు చెప్పుకొచ్చింది. అయితే సిద్దార్థ్ గురించి అందరికి తెల్సిందే. ఏదైనా ముఖం మీదనే చెప్పేస్తాడు. సమాజంలో ఏదైనా సమస్య ఉంటే.. ఎవరికి భయపడకుండా సోషల్ మీడియలో చెప్పుకొస్తాడు. ఈ ప్రెస్ మీట్ లో కూడా సిద్దూ తనదైన రీతిలోనే సమాధానాలు చెప్పడం ఆశ్చర్యం కలిగించింది.

Advertisement

ఇక ఈ మధ్య రేవంత్ రెడ్డి.. టాలీవుడ్ కు వార్నింగ్ ఇచ్చిన విషయం విదితమే. సినిమా టికెట్స్ పెంచమని అడిగే ముందు.. సోషల్ అవేర్నెస్ పెంచే వీడియోలు చేయాలనీ చెప్పారు కదా..మీరేమైనా అలాంటి వీడియోలు చేశారా.. ? సామజిక బాధ్యత కోసం మీరేం చేస్తున్నారు.. ? అన్న ప్రశ్నకు సిద్దార్థ్ మాట్లాడుతూ ముక్కుసూటిగా సమాధానం చెప్పాడు.

” నేను ప్రేక్షకులకు 20 ఏళ్ళ క్రితమే తెలుసు. అప్పుడే నేను సేఫ్ సెక్స్ కోసం అప్పటి ఉమ్మడి ప్రభుత్వంతో కలిసి పనిచేశాను. నా ఫొటోతో ఉన్న హోర్డింగ్స్ కూడా అప్పట్లో వైరల్ గా మారాయి. అది నా బాధ్యత. సీఎం చెప్తేనే నా బాధ్యత రాదు. ఒక నటుడుగా సామజిక బాధ్యత ఉందా.. ? అని అడిగితే ఆ ప్రశ్ననే నాకు అర్ధం కాలేదు. ప్రతి నటుడుకు సామజిక బాధ్యత ఉంటుంది. మేము చేయాల్సింది మేము చేస్తాం. ఇంకా ఏమైనా కావాలి అంటే సీఎం చెప్తే కచ్చితంగా చేస్తాం. అయినా ఏ సీఎం కూడా మాకు ఇది చేస్తేనే మేము మీకు అది చేస్తాం అని చెప్పలేదు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×