BigTV English

Alcohol Distributed at BJP MP’s Party: ఉచితంగా మద్యం పంపిణీ.. ఎక్కడంటే..?

Alcohol Distributed at BJP MP’s Party: ఉచితంగా మద్యం పంపిణీ.. ఎక్కడంటే..?

Alcohol Distributed at Karnataka BJP MP’s Party: కర్ణాటకలో బీజేపీ ఎంపీ మద్దతురాలు ఏర్పాటు చేసిన కార్యక్రమంపై భారీగా విమర్శలు వస్తున్నాయి. వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉచితంగా ‘మద్యం’ పంపిణీ చేయడంతో చర్చనీయాంశమయ్యింది. ఉచితంగా మద్యం పంపిణీ చేయడంతో మందుప్రియులు క్యూ కట్టారు. దీనికి పోలీసులే బందోబస్తు నిర్వహించడం గమనార్హం. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.. బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ వ్యవహారంపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.


అయితే, కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ నేత సుధాకర్ ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో చిక్కబళ్లాపూర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఈ సందర్భంగా స్థానికంగా కృతజ్ఞత కార్యక్రమాన్ని ఆయన మద్దతుదారులు ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో ఉచితంగా మద్యం పంపిణీ చేశారు. దీంతో జనం ఎగబడ్డారు. భారీ క్యూ లైను ఉండగా, ఆ తతంగాన్నంతా స్థానిక పోలీసులే పర్యవేక్షించారు. అయితే, ఈ కార్యక్రమానికి బందోబస్తు నిర్వహించాలని సదరు ఎంపీ సుధాకర్ పోలీసులకు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.

ఈ వ్యవహారంపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ సంస్కృతి ఇదేనంటూ ఆయన ఆరోపించారు. దీనిపై జేపీ నడ్డా స్పష్టత ఇవ్వాలంటూ డీకే డిమాండ్ చేశారు. నిబంధనలను అతిక్రమించినందుకు చర్యలు తీసుకుంటారా..? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ఆ విషయం తరువాత.. తొలుత బీజేపీ పార్టీ నుంచి దీనిపై ఎటువంటి సమాధానం వస్తుందో చూడాలన్నారు.


Also Read: 6 గంటల్లో 30 సెం.మీల వాన.. ముంబైని షేక్ చేసిన వరుణుడు..

అయితే, ఎన్నికల్లో గెలిచాక పార్టీ కార్యకర్తలకు, ఫ్యాన్స్ కు పార్టీలివ్వడం సాధారణమే. కానీ, ఈ విధంగా పార్టీ ఇచ్చి.. ఓపెన్ గా అందరికీ లిక్కర్ బాటిల్స్ సప్లై చేయడంతో విమర్శలు వస్తున్నాయి. జనం క్యూలు కట్టి మరీ ఆ సీసాలు పట్టుకెళ్లారు. ఫ్రీగా ఆల్కహాల్ ఆఫర్ చేయడంతో భారీగా అక్కడికి వచ్చి.. బాటిల్స్ తీసుకుని వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా వివాదాస్పదమవుతోంది.

Tags

Related News

Palghar Building Collapse: మహారాష్ట్రలోని విరార్‌లో కూలిన భవనం.. 15 మంది మృతి

Street Dog Attack: OMG!.. సైకిల్ పై వెళ్తున్న విద్యార్థిపై వీధికుక్క దాడి.. వీడియో చూస్తే..

Begging Ban: భిక్షాటనపై ఉక్కుపాదం.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం, ఎక్కడ?

PM SVANidhi Scheme: ఆ స్కీమ్ పొడిగింపు.. వారిలో ఆనందం, ఇకపై 50 వేలు

Gadchiroli Encounter: 8 గంటలపాటు గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్.. నలుగురు మావోలు మృతి, గాలింపు ముమ్మరం

Himachal floods: ఉత్తరాదిలో వర్ష బీభత్సం.. ఉప్పొంగిన రావి, బియాస్‌ నదులు

Big Stories

×