BigTV English

Tips: ఒక్క చిట్కాతో జుట్టు సమస్యకి చెక్‌….

Tips: ఒక్క చిట్కాతో జుట్టు సమస్యకి చెక్‌….

Amla Milk Hair Pack Recipe For Shiny Strong Hair: మారుతున్న కాలానుగుణంగా మానవజీవన విధానంలో అన్ని సమస్యలు కామన్‌ అయిపోయాయి. ఎందుకంటే సరైన ఆహారం, సరైనా టైమ్‌లో నిద్రలేకపోవడం ఇందుకు ప్రధానకారణంగా చెప్పుకోవచ్చు. అంతేకాదు దీని కారణంగా అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. అందులో ముఖ్యంగా స్థూలకాయం, హెయిర్‌ఫాల్‌ అవడం, కంటికింద నల్లని మచ్చలు రావడంతో పాటుగా బీపీ, షుగర్, థైరాయిడ్, కంటి సమస్యలు వంటివి ఎదుర్కొంటున్నారు. అంతేకాదు సరైనా పోషకాలు అందక మహిళలు సైతం అనేక జుట్టు సమస్యలను ఎదుర్కొంటున్నారు.


ఇక ఆడవారికి విషయానికి వస్తే..వారికి జుట్టు ఉండటం ఎంతో ముఖ్యం.ఎందుకంటే వారి కురుల మూలంగా వారికి అందం రెట్టింపు అవుతుంది.దీంతో వారి ముఖం మరింత అందంగా, కాంతివంతంగా కనిపిస్తుంది.కానీ నేటికాలంలో జుట్టు సమస్య అనేది కామన్‌గా మారింది. ఎందుకంటే గాలి కాలుష్యం మూలంగా వాహనాల నుంచి వెలువడే పొగ కారణంగా ఈ సమస్య ఉత్ఫన్నమవుతుంది.అంతేకాకుండా జుట్టులోని సహజత్వాన్ని కోల్పోయి చుండ్రు సమస్య, జుట్టు తెల్లబడటం, డ్రై హెయిర్‌ రావడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. వీటికి చెక్ పెట్టేందుకు ఆయుర్వేద ప్యాక్స్ ఎంతగానో సహాయపడుతాయి.

జుట్టు సమస్యలకి చాలా కారణాలున్నాయి. ఇందులో మనం తీసుకునే డైట్‌ కూడా మెయిన్‌ కారణమనే చెప్పాలి. దీంతో పాటుగా థైరాయిడ్ వంటి కొన్ని హార్మోన్ల సమస్యలు కూడా ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయి. జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉన్నాయి. వీటిని వెతికే ముందు జుట్టు రాలే సమస్య నివారణకు తగిన జాగ్రత్తలు పాటిస్తే చాలు.అదేవిధంగా మన ఇంట్లోనే తయారుచేసే హెర్భల్‌ ప్యాక్‌ కూడా జుట్టు సమస్యలని తగ్గించి జుట్టు రాలకుండా పొడుగ్గా, ఒత్తుగా ఉండేందుకు ఎంతగానో దోహదపడుతుంది.ఇందులో ఏఏ పదార్థాలు వాడితే దీనిని కంట్రోల్ చేయొచ్చో చూద్దాం.


పాలు

Amla Milk Hair Pack Recipe For Shiny Strong Hair

పాలు వీటిని తాగితే ఎముకలు ధృఢంగా ఉంటాయి. అంతేకాకుండా జుట్టుని కాపాడేందుకు ఉపయోగిస్తారని మీకు తెలుసా..? పాలు జుట్టుకి నేచురల్‌ కలర్ మాయిశ్చరైజ్‌లా పనిచేస్తాయి. పాలలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. పాలను జుట్టుకు మర్ధన చేయడం వల్ల జుట్టు ఎంతగానో మెరుస్తూ మృదువుగా మారుతుంది. కేవలం ప్యాక్‌లా రాయడమే కాదు. తాగడం కూడా మంచిది. ఇందులోని ప్రోటీన్స్, లిపిడ్స్ జుట్టుని బలపరుస్తాయి. కాల్షియం జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. విటమిన్‌ ఎ, బయోటిన్, విటమిన్‌ బి6, పొటాషియం లాంటి పదార్థాలు జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

ఉసిరి

Amla Milk Hair Pack Recipe For Shiny Strong Hair

ఈ హెయిర్‌ప్యాక్‌ కోసం ఉసిరి, పాలు చాలా అవసరం.ఈ రెండు కూడా జుట్టు ఆరోగ్యానికి, అందానికి హెల్ప్ చేస్తాయి.ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఇ,సిలు పుష్కలంగా ఉంటాయి. వీటిని వాడడం వల్ల జుట్టు తెల్లబడడం తగ్గుతుంది.ఉసిరిలో విటమిన్స్, ఖనిజాలు, అమైనో యాసిడ్స్, ఫైటో న్యూట్రియెంట్స్ ఉన్నాయి.ఇవి తలలో రక్త ప్రసరణని పెంచుతుంది. దీంతో జుట్టు ఆరోగ్యంగా,నల్లగా మారి పెరుగుతుంది.దీనిని మీరు డైట్‌లో కూడా యాడ్ చేసుకోవచ్చు.

ప్యాక్ తయారీ విధానం

Amla Milk Hair Pack Recipe For Shiny Strong Hair

ముందుగా ఉసిరికాయ ముక్కలను కట్ చేయాలి. తరువాత ఆరబెట్టాలి. అలా కుదరకపోతే మార్కెట్‌లో దొరికే పొడిని కూడా తీసుకోవచ్చు. దీనిని పాలలో నానబెట్టాలి. లేదంటే ఉసిరి ముక్కల్ని పాలలో నానబెట్టి డైరెక్ట్‌గా అప్లై చేయాలి. అప్లై చేసిన అనంతరం ఓ గంట పాటు ఉంచి క్లీన్ చేయాలి. వారానికి ఓ సారి ఇలా చేస్తే జుట్టు నల్లగా, పొడుగ్గా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు జుట్టు ఎంతో ఒత్తుగా సహజంగా ఉంటుంది.

(గమనిక: ఈ చిట్కా కేవలం నిఫుణుల సూచనల మేరకు మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ చిట్కా వాడే ముందు డాక్టర్‌ని సంప్రదించండి.)

Related News

Spirulina Powder for Hair: డైలీ ఒక్క స్పూన్ ఇది తింటే చాలు.. ఊడిన చోటే కొత్త జుట్టు. 100 % రిజల్ట్ !

Navratri Special Recipes: నవరాత్రి స్పెషల్ వంటకాలు.. నైవేద్యంలో తప్పకుండా ఇవి ఉండాల్సిందే !

Poor Kidney Function: కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని తెలిపే.. సంకేతాలు ఇవే !

Type 5 Diabetes: టైప్-5 డయాబెటిస్ బారిన పడుతున్న యువత .. లక్షణాలు ఎలా ఉంటాయంటే ?

Heart Disease: గుండె సంబంధిత సమస్యలకు చెక్ పెట్టే.. 5 సూపర్ ఫుడ్స్ ఇవే !

Ghost In Dreams: నిద్రకు ముందు ఇలాంటి పనులు చేస్తే.. దెయ్యాలు కలలోకి వస్తాయ్, జర భద్రం!

Sleep on Side: గుండె సేఫ్ గా ఉండాలంటే ఏ సైడ్ పడుకోవాలి? డాక్టర్లు ఏం చెప్తున్నారంటే?

Diet tips: రాగి ముద్ద తినడం వల్ల కలిగే ఆరోగ్య రహస్యాలు.. శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు

Big Stories

×