టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విక్టరీ వెంకటేష్ (Venkatesh) తాజాగా “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక వీడియో రిలీజ్ చేసిన చిత్ర బృందం, ఇక నిన్నటికి నిన్న ఇందులో ఒక యంగ్ స్టార్ హీరో క్యామియో రోల్ పోషిస్తున్నారంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అందులోనూ ఒక యంగ్ హీరో ఇందులో కనిపించబోతున్నారట. ఇక వెంకటేష్ కెరియర్ కాస్తా పక్కన పెడితే ఆయన ఫ్యామిలీ విషయాలు ఎప్పుడు రహస్యంగానే ఉంటాయి.. ఈ క్రమంలోనే ఆయన ముగ్గురు కూతుళ్లు ఎక్కడుంటారో ఏం చేస్తున్నారు అసలు ఏ రంగంలో సెటిల్ అయ్యారు అనే విషయాలు ఎప్పుడూ వైరల్ గా మారుతూనే ఉంటాయి.
వెంకటేష్ ఫ్యామిలీ డీటెయిల్స్..
నీరజారెడ్డి(Neeraja Reddy)ని వివాహం చేసుకున్న వెంకటేష్ కి మొత్తం నలుగురు సంతానం ముగ్గురు కూతుర్లు, ఒక బాబు. అయితే వెంకటేష్ కూతుర్లు మాత్రం చిత్ర పరిశ్రమకు దూరంగానే ఉన్నారు. మరోవైపు ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్లు, దర్శక నిర్మాతల కూతుర్లు, కొడుకులు ఇండస్ట్రీలో రాణిస్తుంటే.. వెంకటేష్ మాత్రం తన పిల్లలను ఇండస్ట్రీకి దూరంగా ఉంచారు. ఫ్యామిలీకి ప్రాధాన్యత ఇచ్చేలా వారిని ప్రోత్సహించారు. అందుకే వెంకటేష్ కూడా ఎప్పుడు ఫ్యామిలీ విషయాలను బయటకి పంచుకోరు. ఫ్యామిలీ కూడా సోషల్ మీడియాకు దూరంగానే ఉంటుంది. ఇకపోతే వీరి పిల్లలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏ రంగంలో సెటిల్ అయ్యారు.? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి.
వెంకటేష్ ముగ్గురు కూతుర్లు ఏం చేస్తున్నారంటే..?
అసలు విషయంలోకి వెళితే.. వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత అందరికీ పరిచయమే. పెళ్లికి ముందు సోషల్ మీడియా కి దూరంగా ఉన్న ఈమె పెళ్లి తర్వాత ఫుడ్ వ్లాగర్ గా మారిపోయింది. రెండవ కూతురు హయవాహిని.. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ పూర్తి చేసిన ఈమె ఇప్పుడు అందులో భాగంగానే ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో దూసుకుపోతోంది. చిన్న కూతురు భావన. డిగ్రీ పూర్తి చేసిన ఈమె ఎక్కువగా క్రీడారంగం వైపు ప్రస్తుతం ఆసక్తి కనుబరుస్తున్నట్లు సమాచారం. ఇక వెంకటేష్ కొడుకు విషయానికి వస్తే.. అర్జున్.. అతనికి సినిమాల పైన ఆసక్తి ఉందని, త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ..
ఇకపోతే వెంకటేష్ కూతుర్లను ఇండస్ట్రీకి తీసుకురాలేదు. కానీ ఆ ముగ్గురిని చూస్తే మాత్రం పద్ధతికి మారుపేరు అనడంలో సందేహం లేదు. అంత పద్ధతిగా పెంచారు వెంకటేష్. ఎంతైనా వెంకీ కూతుర్లు కదా ఆ మాత్రం పద్ధతి ఉండాల్సిందే అంటూ ఆయన అభిమానులు సైతం సంబరపడిపోతున్నారు. ఇక మరోవైపు వెంకటేష్ కొడుకు హీరోగా ఇండస్ట్రీలోకి రాబోతున్నట్లు సమాచారం. మరి ఎప్పుడు ఎలాంటి కథతో ఎవరి దర్శకత్వంలో వస్తారో ఇంకా తెలియదని చెప్పాలి.