E-Paper
Advertisement

Aishwarya Rajesh: ఆ హీరోతో నటించడమే నా కల.. పెద్ద కోరికేనండోయ్..!

Aishwarya Rajesh: ఆ హీరోతో నటించడమే నా కల.. పెద్ద కోరికేనండోయ్..!
Advertisement

Aishwarya Rajesh:ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh).. ప్రముఖ దివంగత నటుడు రాజేష్ (Rajesh) కుమార్తెగా, ప్రముఖ సీనియర్ లేడీ కమెడియన్ శ్రీలక్ష్మి (Sri Lakshmi) మేనకోడలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. నిజానికి ఐశ్వర్య రాజేష్ తెలుగు అమ్మాయి అయినప్పటికీ.. తెలుగులో ఈమెకు అవకాశాలు ఇవ్వలేదు. దాంతో తమిళ్ ఇండస్ట్రీలోకి వెళ్లిపోయిన ఈమె.. అక్కడే వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసి, నేడు భారీ పాపులారిటీ అందుకుంది. అంతేకాదు ఆ సినిమాలతో వచ్చిన క్రేజ్ కారణంగా ఇప్పుడిప్పుడే తెలుగులో మళ్లీ ఈమె టాలెంట్ ను గుర్తించి అవకాశాలు ఇస్తున్నారు. అందులో భాగంగానే ఈ ఏడాది సంక్రాంతికి అనిల్ రావిపూడి(Anil ravipudi) దర్శకత్వంలో వెంకటేష్ (Venkatesh) హీరోగా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో నటించింది. ఇందులో వెంకటేష్ భార్యగా ‘భాగ్యం’ పాత్రలో అదరగొట్టేసింది ఐశ్వర్య రాజేష్.

అదే నా చిరకాల కోరిక అంటున్న ఐశ్వర్య రాజేష్..

Advertisement

ఇకపోతే ఈమె సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, చాలా ఏళ్లు అవుతున్నా ఇప్పటివరకు ఇంత మంచి పాత్ర ఈమెకు దక్కలేదు. ఈ స్థాయి హిట్టు కూడా పడలేదు. కానీ ఈ సినిమాతో రెండూ ఒకే సినిమాతో లభించడంతో ఐశ్వర్య రాజేష్ ఫుల్ ఖుషి అయిపోతోంది. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ.. “నాకు ఎన్టీఆర్ (Jr.NTR) అంటే ఎంతో అభిమానం. ఆయనను ‘స్టూడెంట్ నెంబర్-1’ సినిమా నుంచి చూస్తూ వస్తున్నాను. ఆయన డాన్స్ అంటే ఇంకా ఇష్టం. ఆయనతో నటించే అవకాశం వస్తే మాత్రం కచ్చితంగా వదులుకోను. అంతేకాదు నా కోరిక కూడా అదే. ఆయన డైలాగ్ డెలివరీ, డాన్స్, యాక్టింగ్ అంటే మరింత ఇష్టం. ముఖ్యంగా ఎమోషన్ సన్నివేశాలలో ఆయన నటించే తీరు నాకు మరింత నచ్చుతుంది. కనీసం భవిష్యత్తులోనైనా ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే ఏ మాత్రం వదులుకోకుండా చేస్తాను” అంటూ ఐశ్వర్య రాజేష్ చెప్పుకొచ్చింది. మొత్తానికైతే ఎన్టీఆర్ వంటి గ్లోబల్ స్టార్ తో నటించాలని కోరుకుంటున్న ఐశ్వర్య రాజేష్ కోరిక చాలా పెద్దదే. మరి ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి అని అటు నెటిజెన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.

ఐశ్వర్య రాజేష్ కెరియర్..

Advertisement

ఐశ్వర్య రాజేష్ తన నటనతో అందరి దృష్టిని తన వైపు ఆకట్టుకున్న ఈమె.. ప్రస్తుతం తమిళ్లో పలు సినిమాలు చేస్తోంది. తెలుగులో మాత్రం ఇప్పటివరకు ఇంకా కొత్త సినిమాకు కమిటీ కాలేదు. ఈ సినిమా హిట్ అయిన నేపథ్యంలో ఇకపై వరుసగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ పాత్రలే ఈమెకు లభించే అవకాశం ఉందని కూడా కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరి ఈమెకు యంగ్ స్టార్ హీరోలకు జోడిగా నటించే అవకాశం వస్తుందా? లేదా అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతూ ఉండడం గమనార్హం. అంతేకాదు ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోతో నటించే అవకాశం వస్తే మాత్రం ఈమె అదృష్టం తో పాటు ఈమె కల కూడా పండినట్టే అని అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. మరి ఎన్టీఆర్ సినిమాల్లో నటించే అవకాశం వస్తుందో లేదో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×