Keerthy Suresh: మహానటి కీర్తి సురేష్ (Keerthy Suresh) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకప్పుడు సాంప్రదాయానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఈమె.. మహేష్ బాబు (Maheshbabu) ‘సర్కారు వారి పాట’ సినిమాతో తనను తాను మార్చుకుంది. ఇందులో తొలిసారి గ్లామర్ గా కనిపించి, అభిమానులను ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమకు సౌందర్య తర్వాత అంతటి స్థానాన్ని కీర్తి సురేష్ సంపాదించుకుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత కాలంలో ఈమె ట్రెండ్ కి తగ్గట్టు ఫాలో అయిపోయింది.అందులో భాగంగానే గ్లామర్ ఒలకబోస్తూ యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
పెళ్లి తర్వాత రూట్ మార్చిన కీర్తి సురేష్..
ఇకపోతే ఈమధ్య కాస్త రూట్ మార్చింది ఈ ముద్దుగుమ్మ సాధారణంగా చాలామంది హీరోయిన్లు పెళ్లి కాకముందు గ్లామర్ వొలకబోస్తూ.. పలు పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు. ఇక పెళ్లయిన తర్వాత కేవలం పద్ధతిగా ఉండే పాత్రలు చేస్తూ.. అడపా దడపా అలరిస్తూ ఉంటారు. కానీ కీర్తి సురేష్ మాత్రం అలా కాదు.. తన దారి పూర్తిగా సపరేట్ అంటూ చెప్పుకొస్తోంది. గతంలో మునుపేన్నడు లేని విధంగా గ్లామర్ కంటెంట్ ని ఎక్కువ యాడ్ చేసి సినిమాలు చేయడం మొదలుపెట్టేసింది. ఇటీవల బాలీవుడ్ లో వరుణ్ ధావన్ (Varun Dhawan) హీరోగా వచ్చిన ‘బేబీ జాన్’ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ల లాగే ఫుల్ గ్లామర్ గా కనిపించింది. సర్కారు వారి పాట సినిమాలో కేవలం స్లీవ్ లెస్ వరకే పరిమితమైన ఈమె, ఇక్కడ బేబీ జాన్ లో మాత్రం పద్ధతి మర్చిపోయి నటించడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
‘అక్కా’ సీరీస్ లో డోస్ పెంచిన కీర్తి సురేష్..
అయితే ఇప్పుడు ఆ గ్లామర్ డోస్ ను మరింత పెంచేసింది కీర్తి సురేష్. తాజాగా నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేస్తున్న ‘అక్కా’ సీరీస్ లో చాలా సీరియస్ గా మాఫియా రోల్ లోనే కాస్త డోసు ఎక్కువ పెంచి గ్లామర్ గా కనిపించబోతోంది. సౌత్ లో ఉన్నంతవరకు సింపుల్ గా ఉండే రోల్స్ చేసిన ఈమె.. బాలీవుడ్ కి వెళ్ళాక నార్త్ స్టైల్ ని బాగా వంట పట్టించుకోవడంతో అందరూ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు హోమ్లీ క్యారెక్టర్లు చేస్తూ వచ్చిన కీర్తి సురేష్ కి అవకాశాలు రాలేదు. అందుకే ఇప్పటినుంచి ఎక్కువే వస్తాయని జోష్యం కూడా చెబుతూ ఉండడం గమనార్హం. ఇక ఈ సీరీస్ నుంచి విడుదలైన గ్లింప్స్ లో చాలా రఫ్ లుక్ లో కనిపించింది కీర్తి సురేష్ ఒక మార్క్ క్రియేట్ చేస్తుందని ఆడియన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ అక్కా సీరీస్ తర్వాత బాలీవుడ్ లో ఇంకెన్ని గ్లామర్ ఛాన్సులు దక్కించుకుంటుందో చూడాలి. ఏది ఏమైనా పెళ్లి తర్వాత ఎక్కువగా గ్లామర్ పాత్రలకు ఓకే చెబుతూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది కీర్తి సురేష్.ఇక కీర్తి సురేష్ విషయానికి వస్తే.. ప్రముఖ సీనియర్ నటి మేనక కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె, ఇప్పుడు హీరోయిన్గా చలామణి అవుతూ.. అటు బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు అందుకునే దిశగా అడుగులు వేస్తోంది. మరి కీర్తి సురేష్ భవిష్యత్తు ఎలా ఉండనుందో చూడాలి.