Thandel.. ప్రముఖ యంగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అక్కినేని వారసుడు నాగచైతన్య (Naga Chaitanya) తాజాగా చందు మొండేటి (Chandu Mondeti) దర్శకత్వంలో చేసిన చిత్రం తండేల్ (Thandel). భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే ఈ సినిమా ఫలితం తెలియాలి అంటే ఇంకొన్ని గంటలు ఎదురు చూడక తప్పదు. ఇకపోతే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సందర్భంగా నాగచైతన్య సతీమణి శోభిత ధూళిపాళ్ల ఆసక్తికర పోస్టు పంచుకుంది. ఇన్ స్టా స్టోరీస్ లో తండేల్ పోస్టర్ షేర్ చేసిన ఈమె.. సినిమా విడుదలపై ఆనందం వ్యక్తం చేస్తూ.. తాను కూడా సంతోషంగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది.
నిజ దర్శనం కోసం ఎదురుచూస్తున్నా – శోభిత
ఇక శోభిత షేర్ చేసిన ఇన్స్టా స్టోరీలో ఏముంది అనే విషయానికి వస్తే..” ఈ సినిమా మేకింగ్ సమయంలో మీరు ఎంతో ఫోకస్ పెట్టారు .పాజిటివ్గా ఉన్నారు. ఆ విషయాలన్నింటిని నేను దగ్గరుండి మరీ గమనించాను. ఈ అద్భుతమైన ప్రేమకథా చిత్రాన్ని అందరితో పాటు నేను కూడా చూడడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఇక ఫైనల్ గా మీరు గడ్డం షేవ్ చేసుకుంటారు. మొదటిసారి మీ ముఖ దర్శనం అవుతుంది స్వామి.. మీ నిజ దర్శనం కోసం పెళ్లి అయిన రోజు నుంచి ఎదురు చూస్తున్నాను” అంటూ తెలిపింది శోభిత. ఇక దీనిపై స్పందించిన నాగచైతన్య “థాంక్యూ బుజ్జి తల్లి” అంటూ కామెంట్ చేశారు. ఇక ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.
తండేల్ సినిమా స్టోరీ..
ఇక తండేల్ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. శ్రీకాకుళం జిల్లా.. డి. మత్స్యలేశం గ్రామానికి చెందిన మత్స్యకారులు గుజరాత్ కి ఎక్కువ డబ్బులు వస్తాయని వేటకు వెళ్లగా.. అనుకోని కారణంగా పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ కి చిక్కి 17 నెలలు జైలు జీవితం అనుభవించిన ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో నాగచైతన్య తండేల్ రాజుగా, సాయి పల్లవి బుజ్జి తల్లి అలియాస్ సత్య పాత్ర పోషించారు. ఇక ఇందులో నాగచైతన్య పొడవాటి జుట్టు, గడ్డంతో కనిపించారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్, ట్రైలర్ లో మనం ఆయన గెటప్ ను చూడవచ్చు. 2023లో ఈ సినిమా పట్టాలెక్కిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ఓకే చేసిన దగ్గర్నుంచి ఆయన గడ్డంలోనే ఉన్నారు. ఇటీవల ఆ గడ్డంతోనే ప్రమోషన్స్ లో కూడా పాల్గొన్నారు. ఈ గడ్డాన్ని ఇప్పుడు తీయబోతున్నారని చాలా ఎక్సైటింగ్ గా చెబుతూ పోస్ట్ పెట్టింది శోభిత. మొత్తానికి అయితే నాగచైతన్య ముఖాన్ని చూడడానికి అటు శోభిత మాత్రమే కాదు ఇటు అక్కినేని అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.