Teenmaar Mallanna: షోకాజ్ నోటీసులపై తీన్మార్ మల్లన్న స్పందించారు. కాంగ్రెస్ తీరు బీసీలకు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు ఉందన్నారు. రాహుల్ గాంధీ బాటలో పయనిస్తూ బీసీల గురించి మాట్లాడితే.. షోకాజ్ నోటీసులు ఇస్తారా అని ప్రశ్నించారు. కొందరు నేతలు బీసీలను పార్టీకి దూరం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. బీసీ సమాజంతో మాట్లాడి.. నోటీసులకు సమాధానం ఇవ్వాలా? లేదా? అనే దానిపై డిసైడ్ అవుతానన్నారు.
కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. బీసీల మనోభావాలు దెబ్బతినేలా కులగణన నివేదికను తగలబెట్టినందుకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి అనేక ఫిర్యాదులు అందాయి. అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా పరుష పదజాలం తీన్మార్ మల్లన్న మీడియాలో ముందు మాట్లాడారు.
పార్టీ ప్రయోజనాలను పక్కనబెట్టి వ్యక్తిగత ఎజెండా నెరవేర్చేందుకు ప్రయత్నిస్తున్నారని పలువురు నేతలు మల్లన్నపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అయ్యేందుకు సహకరించిన విషయాన్ని మర్చిపోయారన్నారు. వారం రోజుల వ్యవధిలో.. ఫిబ్రవరి 12లోగా షోకాజ్ నోటీసులకు వివరణ ఇవ్వాలని తెలిపారు. కాంగ్రెస్ రాజ్యాంగం నిబంధనల మేరకు వివరణ రాకపోతే కఠిన చర్యలుంటాయని హెచ్చరికలు జారీ చేశారు.
టీవీ వ్యాఖ్యాతగా కెరీర్ ప్రారంభించి కాంగ్రెస్ చొలవతో ఎమ్మెల్సీగా ఎన్నికైన తీన్మార్ మల్లన్న.. సొంత పార్టీనేతలపైనే విమర్శలు గుప్పించడం. పదేపదే వాటిని రిపీట్ చేస్తుండటంపై కాంగ్రెస్ వర్గాలు ఆశ్చర్యపోయాయి. బీసీల రాజకీయ యుద్దభేరి అంటూ హడావుడి చేసిన ఆయన రేవంత్ రెడ్డే తెలంగాణకు ఆఖరి ఓసీ సీఎం అని వ్యాఖ్యానించడం.. మల్లన్న తనను తాను సీఎం క్యాండెట్‌గా ఎలివేట్ చేసుకునే ప్రయత్నం చేయడం మరింత వివాదాస్పదంగా మారింది.
ఈ నేపథ్యంలోనే తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. మల్లన్న వ్యవహారంపై పలువురు నేతలు టీపీసీసీకి ఫిర్యాదు చేశారు. కులగణను తప్పుపడుతూ మాట్లాడటంపై చర్యలు తీసుకోవాలని కోరిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. వరంగల్ బీసీ సభలో తీన్మార్ మల్లన్న తీవ్ర పదజాలంతో రెడ్డి కులాన్ని దూషించడంపై తీవ్ర స్థాయిలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
ఇదిలా ఉంటే.. మల్లన్న మరో పని చేశారు. కులగణన సర్వే రిపోర్టుకు నిప్పు పెట్టారు. దీంతో తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని పోలీస్టేషన్లలో మల్లన్నపై ఫిర్యాదులు పోటెత్తుతున్నాయి. తాజాగా ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్టేషన్లో.. రెడ్డిసంక్షేమ సంఘం.. మల్లన్నపై కేసు నమోదు చేయాలని వినతి పత్రం సమర్పించింది.
Also Read: కేబినెట్లో వారికే చోటు.. క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ సీఎం, ఏఐసీసీ పెద్దలతో మంతనాలు
రెడ్డికులంపై మలన్న అర్ధంపర్ధం లేని మాటలు మాట్లాడుతున్నారనీ. దీని ద్వారా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయనీ.. దీంతో మల్లన్నపై కేసు నమోదు చేయాలని కోరారు ఆదిలాబాద్ రెడ్డి సంఘం నాయకులు. గతంలోనూ పలు మార్లు రెడ్డి కులంపై మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారనీ. రాజకీయాలు ఒక హుందాతనంతో చేయాలి కానీ, ప్రజల మధ్య కులాల కార్చిచ్చు రగిల్చి.. పబ్బం గడుపుకోవడం కరెక్టు కాదని హితవు పలికారు. ఇలాంటి వారున్న పార్టీలకు కూడా చెడ్డ పేరు వస్తుందని. రెడ్ల చరిత్ర చెప్పుకుంటే ఒక జీవితం కూడా సరిపోదని.. తమ వినతి పత్రంలో రాసుకొచ్చారు ఆదిలాబాద్ రెడ్డి సంఘం నేతలు.
ఆదిలాబాద్ లోనే కాదు.. కరీంనగర్ రెడ్డి సంఘం నేతలు కూడా సరిగ్గా ఇలాగే మల్లన్నపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తమ సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా.. మల్లన్న మాట్లాడారని. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా.. రాష్ట్ర రెడ్డి సంఘం నేతలు ఇది వరకే డీజీపీకి కంప్లయింట్ చేశారు. ఆ సమయంలోనే టీపీసీసీ చీఫ్ మల్లన్నపై చర్యలు తీస్కోవల్సిందిగా కోరారు రాష్ట్ర రెడ్డి సంఘం నాయకులు.