BigTV English

Heroine Laya: శివాజీ తో కలిసి లయ కొత్త ప్రయాణం.. ఇక్కడైనా సక్సెస్ అవుతుందా..?

Heroine Laya: శివాజీ తో కలిసి లయ కొత్త ప్రయాణం.. ఇక్కడైనా సక్సెస్ అవుతుందా..?

Heroine Laya.. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న హీరోయిన్ లయ (Laya ) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అంద చందాలతో, నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే వివాహం చేసుకొని ఇండస్ట్రీకి దూరమైంది. ఇక భర్త పిల్లలతో కలిసి అమెరికాలో సెటిల్ అయిన లయ అక్కడే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తూ ఇటీవలే ఇండియాకి తిరిగి వచ్చింది.


జడ్జీ గా మారిన లయ..

ఇక ఈ మధ్య రీఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది లయ. అందులో భాగంగానే ఇప్పుడు కొత్త అవతారం ఎత్తింది. ఇప్పటివరకు హీరోయిన్ గా ప్రేక్షకులను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ, తాజాగా జడ్జ్ అవతారం ఎత్తడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.


జబర్దస్త్ లోకి కొత్త యాంకర్..

బుల్లితెర ఎంటర్టైన్మెంట్ షో గా గుర్తింపు తెచ్చుకున్న జబర్దస్త్ ఎన్నో ఏళ్లుగా కామెడీ స్కిట్స్ తో ప్రేక్షకులను మెప్పిస్తోంది. ముఖ్యంగా జబర్దస్త్ లో ఈమధ్య కాలంలో అందరూ మారిపోతున్నారు ఎంతోమంది కమెడియన్స్, జడ్జీలు, యాంకర్లు కూడా వచ్చి వెళ్తున్నారు. రోజా – నాగబాబు జడ్జీ లుగా తొలుత ఈ షో ప్రారంభమైంది. దాదాపు 9 సంవత్సరాల పాటు నిర్విరామంగా వారే జడ్జీ లుగా కొనసాగారు. అయితే ఆ తర్వాత కాలంలో మల్లెమాల యూనిట్ తో విభేదాలు వచ్చి నాగబాబు, రాజకీయాలలో మంత్రి పదవి వచ్చే రోజా ఇద్దరూ వెళ్లిపోయారు. కాలక్రమేనా యాంకర్లు , జడ్జీలు కూడా మారుతూ వచ్చారు..

శివాజీ తో కలసి జడ్జీగా మారిన లయ..

ప్రస్తుతం జబర్దస్త్ వారానికి రెండు ఎపిసోడ్స్ ప్రసారమవుతుండగా.. కొన్నాళ్లు కృష్ణ భగవాన్, ఖుష్బూ జడ్జీ లుగా చేశారు. అయితే ఇటీవల కృష్ణ భగవాన్ స్థానంలో శివాజీ రావడం అటు ఖుష్బూ స్థానంలో ఒకప్పటి హీరోయిన్ లయ కూడా వచ్చి చేరారు. ప్రస్తుతం రీయంట్రీ లో సినిమాలు చేస్తూ జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి జడ్జిగా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇకపోతే ప్రముఖ హీరోగా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇప్పుడు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ గా కూడా మంచి పేరు సొంతం చేసుకున్న శివాజీతో కలిసి జడ్జ్ అనే ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది లయ. మరి ఇక్కడైనా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.

18 ఏళ్ల తర్వాత మళ్లీ జంటగా కొత్త ప్రయాణం..

ఇక ఈ జంట విషయానికి వస్తే..గతంలో శివాజీ – లయ టాటా బిర్లా మధ్యలో లైలా అనే సినిమాలో నటించారు. అంతేకాదు మిస్సమ్మ, అదిరిందయ్యా చంద్రం, బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం ఇలా చాలా చిత్రాలలో వీరిద్దరూ జంటగా నటించారు. వీరిద్దరిది వెండితెరపై మంచి పెయిర్ కూడా. అలాంటి ఈ జంట ఇప్పుడు జబర్దస్త్ లో జడ్జీలుగా రావడంతో ప్రేక్షకులలో ఈ షో పై మరింత ఆసక్తి నెలకొంది. లయ జడ్జిగా వచ్చిన ఎపిసోడ్ ప్రోమోని కూడా నిర్వాహకులు విడుదల చేశారు. మొత్తానికైతే 18 ఏళ్ల తర్వాత వెండితెర నుంచి బుల్లితెరపై అలరించడానికి సిద్ధమైన ఈ జంట ఏ విధంగా సక్సెస్ అవుతారో చూడాలి. అలాగే జబర్దస్త్ షోకి ఎలాంటి రేటింగ్ తీసుకొస్తారో చూడాలి..

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×