BigTV English

Tollywood Heroine: మళ్లీ తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. బేబీ బంప్ ఫోటోలు వైరల్..!

Tollywood Heroine: మళ్లీ తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. బేబీ బంప్ ఫోటోలు వైరల్..!

Tollywood Heroine:ఈ మధ్యకాలంలో హీరోయిన్లు అలా పెళ్లి చేసుకుంటున్నారో లేదో అప్పుడే తల్లిదండ్రులవుతున్నారు. ఇంకొంతమంది రెండో బిడ్డకి కూడా జన్మనిస్తూ అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తున్నారు. ఈ క్రమంలోనే మరో టాలీవుడ్ హీరోయిన్ తల్లి కాబోతున్నాను అని చెప్పి బేబీ బంప్ ఫోటోలను కూడా షేర్ చేసి అభిమానులతో శుభవార్తను పంచుకుంది. ఇక ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఈ బేబీ పంపు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈమెకు అభిమానులు సినీ సెలబ్రిటీలు సైతం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు


Mukesh Khanna: ఆ హీరోలా ఉండటం వీళ్లకు చేతకాదు… బాలీవుడ్ హీరోలపై నిర్మాత ఫైర్..!

మళ్లీ తల్లి కాబోతున్న ప్రభాస్ బ్యూటీ..


ఇక ఈమె ఎవరో కాదు సంజనా గల్రాని.. ఈమె కన్నడ ఇండస్ట్రీకి చెందిన నటి అయినప్పటికీ తెలుగు సినిమాలలో బాగా నటించింది ముఖ్యంగా స్టార్ హీరో ప్రభాస్, పవన్ కళ్యాణ్ రాజశేఖర్ తరుణ్ శ్రీకాంత్ సాయిరాం శంకర్ వంటి హీరోల సినిమాలలో నటించింది ముఖ్యంగా కొన్ని సినిమాలలో మెయిన్ హీరోయిన్ గా నటించగా మరికొన్ని సినిమాలలో సెకండ్ హీరోయిన్గా నటించింది అంతేకాదు నెగిటివ్ రోల్స్ లో కూడా మెప్పించింది. కరోనా సమయంలో వివాహం చేసుకున్న ఈమె అప్పుడే మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు మరోసారి తల్లిగా ప్రమోషన్ పొందనుంది. ఈ నేపథ్యంలోనే ఉగాది సందర్భంగా సోషల్ మీడియాలో తన బేబీ బంప్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు శుభవార్త తెలిపింది. సంజనాకు మంచి గుర్తింపు తెచ్చిన సినిమా ఏదన్నా ఉంది అంటే అది ప్రభాస్ (Prabhas ) హీరోగా నటించిన ‘బుజ్జిగాడు’ సినిమా అనే చెప్పాలి. ఈ సినిమాలో తన నటనతో అందరిని అబ్బురపరిచింది.

సంజనా కెరియర్..

ఒక సంజనా సినిమాల విషయానికి వస్తే.. 2005లో తరుణ్(Tarun )హీరోగా నటించిన ‘సోగ్గాడు’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. ప్రభాస్ బుజ్జిగాడు సినిమాతో మరింత పాపులారిటీ అందుకుంది.ఆ తర్వాత శ్రీకాంత్ (Srikanth )తో దుశ్శాసన, పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తో సర్దార్ గబ్బర్ సింగ్, అవును 2 వంటి చిత్రాలను నటించి మెప్పించింది. ఇక కన్నడ తోపాటు వివిధ భాషలలో కూడా సంచలన విజయం సాధించిన దండుపాళ్యం సినిమాలో నెగిటివ్ పాత్రలో నటించి ఆకట్టుకుంది. ఇక సంజనా విషయానికి వస్తే, 2005లోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె, 2020 లాక్ డౌన్ సమయంలో సంజనా బెంగళూరుకి చెందిన అజీజ్ పాషా అనే వైద్యుడిని వివాహం చేసుకుంది. ఇక 2022లో మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇక ఈమె చెల్లెలు ఎవరో కాదు నిక్కీ గల్రానీ.. ఈమె కూడా హీరోయిన్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈమె కూడా మరకతమణి తోపాటు పలు చిత్రాలలో నటించి, తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈమె మరో సినీ నటుడు ఆది పినిశెట్టిని ప్రేమించి మరీ వివాహం చేసుకుంది. వీరు వివాహానికి పలువురు సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. అంతేకాదు వీరి పెళ్లికి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా వీరిద్దరూ అక్క చెల్లెలు అని తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక ఇద్దరూ కూడా స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×