BigTV English

Mukesh Khanna: ఆ హీరోలా ఉండటం వీళ్లకు చేతకాదు… బాలీవుడ్ హీరోలపై నిర్మాత ఫైర్..!

Mukesh Khanna: ఆ హీరోలా ఉండటం వీళ్లకు చేతకాదు… బాలీవుడ్ హీరోలపై నిర్మాత ఫైర్..!

Mukesh Khanna:..సౌత్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పేరుపొందిన రజనీకాంత్ (Rajinikanth) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. తన అద్భుతమైన నటనతో ఎంతోమంది హృదయాలను దోచుకున్నారు. ముఖ్యంగా సింప్లిసిటీగా కనిపిస్తూ ఆడియన్స్ హృదయాలనే కాదు స్టార్ సెలబ్రిటీల మనసులను కూడా మెప్పించారు. ఇక రజనీకాంత్ వ్యక్తిత్వం విషయానికి వస్తే.. సినిమాల్లో తప్ప ఆయన మేకప్ వేసుకోరు. వందల కోట్ల ఆస్తి ఉన్నా.. ఏ రోజు కూడా డబ్బున్న మనిషిలాగా గర్వం చూపించరు. ఎప్పుడూ .. చాలా సింపుల్గా కనిపిస్తూ సాధారణ మనిషిలా అందరిలో కలగలిసిపోతూ.. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, నటులు ముఖేష్ ఖన్నా (Mukhesh Khanna) కూడా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.


రజినీకాంత్ నిజమైన రియల్ హీరో – ముఖేష్ ఖన్నా

ముఖేష్ ఖన్నా.. రజినీకాంత్ పై ప్రశంసలు కురిపిస్తూ.. ఆయన గొప్పతనాన్ని అందరికీ తెలిసేలా చేశారు. ముఖేష్ ఖన్నా మాట్లాడుతూ..” బాలీవుడ్ లో ఉన్న ఎంతోమంది అగ్ర హీరోల కంటే రజినీకాంత్ చాలా గొప్ప వ్యక్తి. పెద్ద హీరో అయినప్పటికీ కూడా ఎప్పుడు ఒక స్టార్ లా కాకుండా చాలా సింపుల్ గా ఉంటారు బయటకు వెళ్ళినప్పుడు మేకప్ కూడా వేసుకోరు. కనీసం విగ్గు కూడా పెట్టుకోవాలనే ఆలోచన ఆయనకు ఉండదు. అభిమానులను కలవడానికి అయినా సెలబ్రిటీ లా కాకుండా ఒక సామాన్య వ్యక్తిలాగే కనిపిస్తారు. ఇక బాలీవుడ్ స్టార్స్ ఎవరూ కూడా ఈ విషయంలో రజనీకాంత్ లాగా ఉండలేరు. ముఖ్యంగా ముంబైలో మేకప్ లేకుండా తిరగలేరు. ఆయనే రియల్ స్టార్…ఆయనని ఇప్పటివరకు నేను వ్యక్తిగతంగా కలవలేదు. ఖచ్చితంగా కలిసే ఛాన్స్ వస్తే అంతకంటే అదృష్టం ఇంకోటి లేదు” అంటూ ముఖేష్ తెలిపారు.


దాని కారణంగానే ఎన్నో సినిమాలు వదులుకున్నాను – ముఖేష్ ఖన్నా

ఇక ఇదే ఇంటర్వ్యూలో ముఖేష్ తన సినిమా జీవితంపై కూడా కామెంట్లు చేశారు. ఇప్పటివరకు నేను ఎన్నో సినిమాలలో చేశాను. అయితే పెద్ద పెద్ద డైలాగులు చెప్పడమే నాకు ఇష్టం. అలా డైలాగులు లేని కారణంగా నేను చాలా సినిమాలను వదులుకున్నాను. ముఖ్యంగా విలన్ పాత్రలు చేయడం నచ్చదు. అలాగే రొమాంటిక్ సన్నివేశాలుగా చేయడం కూడా చిరాకు వేస్తుంది. ఇక మహాభారతం సీరియల్ లో మొదటి నాకు దుర్యోధనుడి పాత్ర ఇచ్చారు. కానీ నేను తిరస్కరించాను.ఆ తర్వాత భీష్ముడు పాత్ర వచ్చింది. నేను ఎన్నో హాలీవుడ్ సినిమాలకి కూడా నో చెప్పాను. అంతర్జాతీయ సినిమాలు వదులుకున్నప్పుడు కూడా నేను బాధపడలేదు అంటూ ముఖేష్ కన్నా తెలిపారు. ఇక ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ముఖేష్ ఖన్నా కెరియర్..

ముఖేష్ ఖన్నా విషయానికి వస్తే నటుడు మాత్రమే కాదు టాక్ షో హోస్ట్ అలాగే నిర్మాత కూడా.. ఎక్కువగా హిందీ భాషా సినిమాలు, సీరియల్స్ లో నటించారు. ఇక ఈయన స్వయంగా దర్శకత్వం వహించిన టెలివిజన్ సీరియల్ శక్తిమాన్ లో సూపర్ హీరో పాత్రైన శక్తిమాన్ పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్నారు. అలాగే మహాభారతం సీరియల్లో భీష్మ పాత్రను కూడా పోషించారు.అంతేకాదు పలు టెలివిజన్ చిత్రాలలోని పాత్రలకు ప్రసిద్ధిగాంచారు. అలాగే చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ ఇండియా చైర్మన్గా కూడా పనిచేశారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×