Thriller Movie OTT : మలయాళ ఇండస్ట్రీ నుంచి వస్తున్న ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ ని సొంతం చేసుకోవడంతో పాటు.. కలెక్షన్స్ ని కూడా అదిరిపోయే రీతిలో వసూలు చేస్తున్నాయి.. థియేటర్లలోకి వచ్చిన ప్రతి సినిమా వరుసగా రికార్డులను బ్రేక్ చేస్తున్నాయి. ముఖ్యంగా థ్రిల్లర్ మూవీస్ కి మలయాళీ ఇండస్ట్రీలో డిమాండ్ ఎక్కువగా ఉంది.. గత ఏడాది రిలీజ్ అయిన సినిమాలు సైతం ఇప్పటికి ఓటీటీ లోకి రాలేదు. అలాంటి సినిమాలు ఈ మధ్య వరుసగా డిజిటల్ ప్లాట్ ఫామ్లలోకి వచేస్తున్నాయి. ఇప్పుడు ఓటీటీ లోకి రాబోతున్న సినిమా పేరేంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో? ఒకసారి తెలుసుకుందాం..
మూవీ & ఓటీటీ..
మలయాళం ఇండస్ట్రీ నుంచి గతేడాది రిలీజ్ అయిన సినిమా జైలర్.. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా రిలీజ్ అయిన టైంలో ఈ సినిమా రిలీజ్ అయింది. అయితే ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. బాక్సాఫీస్ వద్ద మూవీ బోల్తా కొట్టింది. మలయాళం నటుడు ధ్యాన్ శ్రీనివాసన్ నటించిన మూవీ జైలర్.. ఇది ఒక హిస్టారికల్ మూవీ.. ఈ సినిమా ఆగస్ట్, 2023 లో థియేటర్ల లో రిలీజైంది. మొత్తానికి ఇప్పుడు అంటే ఏప్రిల్ 4 నుంచి మనోరమ మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుంది. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన ఈ మూవీ ఏడాదిన్నర తర్వాత మనోరమ మ్యాక్స్ ఈ మూవీ హక్కులను సొంతం చేసుకొని స్ట్రీమింగ్ తేదీని నేడు అనౌన్స్ చేసింది. సక్కిర మడతిల్ ఈ సినిమాను దర్శకత్వం వహించారు..
స్టోరీ విషయానికొస్తే..
మలయాళ ఇండస్ట్రీ నుంచి వస్తున్నా సినిమాలు థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. నిజజీవితం ఆధారంగా మలయాళంలో తెరకెక్కిన సినిమా జైలర్.. 1950ల లోని కేరళలో ఓ జైలర్ జీవితం ఆధారంగా రూపొందించారు. హత్య కేసుల్లో దోషులుగా తేలి శిక్ష అనుభవించే ఖైదీలకు పునరావాసం కల్పించే జైలర్ కథ ఇది. ఈ క్రమంలో ఆ జైలర్ ఎదుర్కొన్న సవాళ్లు ఎలాంటివో ఈ సినిమా చూపించే ప్రయత్నం చేసింది.. హీరో నటనకి ప్రశంసలు దక్కాయి కానీ, స్టోరీ లైన్ అంతగా నచ్చకపోవడంతో థియేటర్లలో ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. ఈ సినిమా యావరేజ్ టాక్ ని అందుకోవాల్సి వచ్చింది.. అప్పటికే రజనీకాంత్ జైలర్ బ్లాక్‌బస్టర్ టాక్ రావడంతో ఈ జైలర్ కు థియేటర్లు కరవయ్యాయి. ఉన్న కాసిన్ని థియేటర్లు కూడా ఈ మూవీ ప్రేక్షకులు మెచ్చకపోవడం తో తీసేశాయి. దీంతో బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఆగస్ట్ 18, 2023న థియేటర్లలో రిలీజైన ఈ జైలర్ మూవీకి యావరేజ్ రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకుని ఈ సినిమా ఓటీటీ లో అయినా కనీసం ఆకట్టుకుంటుందేమో చూడాలి.. రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా ఏ రేంజ్ లో రికార్డులను బ్రేక్ చేసిందో అందరికీ తెలుసు.. ఈ సినిమాకు సీక్వెల్ గా మరో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే…