E-Paper
Advertisement

Kannappa : మరో వివాదంలో కన్నప్ప.. పార్వతి దేవీ లుక్ పై హిందువులు ఆగ్రహం..

Kannappa : మరో వివాదంలో కన్నప్ప.. పార్వతి దేవీ లుక్ పై హిందువులు ఆగ్రహం..
Advertisement

Kannappa : టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప మూవీ గురించి అందరికి తెలుసు.. ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.. మంచు విష్ణు చాలేంజింగ్ గా తీసుకొని మావీని చేస్తున్నారు. ఏవిఏ ఎంటర్‌టైన్‌మెంట్స్ , 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నటులు, బాలీవుడ్ ప్రముఖులు కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ బాబు, శరత్ కుమార్, మధుబాల, ముఖేష్ రిషి, కరుణాస్, యోగి బాబు, రఘు బాబు, ఐశ్వర్య రాజేష్ తదితరులు నటిస్తున్నారు. ఈ మూవీ స్టోరీ ఏమో గాని ఇప్పటివరకు రిలీజ్ అయిన పోస్టర్స్ ట్రోల్స్ అందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా కన్నప్పకు మరో వివాదం చుట్టుకుంది. కన్నప్ప మూవీ విడుదలను అడ్డుకుంటాము అని హిందూ సంఘాలు నిరసనలు చేస్తున్నట్లు సోషల్ మీడియా లో ఓ వార్తచక్కర్లు కొడుతుంది..

కన్నప్ప మూవీ వివాదాలు..? 

Advertisement

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న కన్నప్ప మూవీ నుంచి ఇప్పటి వరకు విడుదలై అన్ని పోస్టర్స్ ట్రోల్స్ కు గురయ్యాయి. వాటిని టీమ్ సరిచేసిందో లేదో గాని ఇప్పుడు మరో వివాదం ఎదురైంది. ఈ చిత్రం నుంచి పార్వతి దేవిగా ఉన్న కాజల్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.. తెల్లటి పట్టు చీరలో, హిమాలయ పర్వతాల అడుగున.. ఒక బండరాయి మీద కాజల్ అగర్వాల్ కూర్చున్నట్లు కనిపిస్తోంది. ఆమె వెనుక మహా కాళి అవతారం పొగమంచుతో డిజైన్ చేయబడింది.. ఈ పోస్టర్ బాగానే ఉంది. కానీ హిందు ధర్మాలను తప్పుగా చూపిస్తున్నారని హిందూ సంఘాలు ఆగ్రహన్ని వ్యక్తం చేస్తున్నారు..

పార్వతి దేవీ లుక్ పై హిందువులు ఆగ్రహం.. 

Advertisement

కన్నప్ప మూవీ నుంచి పార్వతి దేవీ లుక్ రిలీజై విమర్శలు అందుకుంటుంది. పోస్టర్ లో బండరాయి మీద కాజల్ అగర్వాల్ కూర్చున్నట్లు కన్పిస్తుంది.. ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు ఆ ఫోటోని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తూన్నారు. ఎందుకంటే ఆ పోస్టర్ లో కాజల్ కు బొట్టు లేదు. పార్వతి దేవిని మోడ్రన్ లుక్ లో కనిపించేలా చేశారని కన్నప్ప టీమ్ పై తీవ్రంగా మండిపడుతున్నారు. హిందు ధర్మాన్ని తప్పుగా చూపిస్తున్నారని సోషల్ మీడియా వేదికగా ఆరోపిస్తున్నారు. ఆ పోస్టర్ ను వెంటనే డిలీట్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.. మరి దీనిపై కన్నప్ప టీమ్ ఎలా స్పందిస్తారో చూడాలి..

ఇకపోతే ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ 25న విడుదల కానుంది. ఇప్పటికే విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు మూవీ మేకర్స్. ఏప్రిల్ 25 న విడుదల చేయాలని చిత్ర బృందం గట్టిగానే ప్రయత్నిస్తోంది. మంచు విష్ణు కలల ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ సినిమా నుంచి ఒక్కొక్క అప్డేట్ ను విడుదల చేస్తూ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు మంచు విష్ణు..

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×