Betting Apps Case :ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తో పాటు టాలీవుడ్ సినీ సెలబ్రిటీలు, స్టార్ హీరోలు, హీరోయిన్లు స్వలాభం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న విషయం తాజాగా వెలుగు చూసింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ఎంతోమంది ప్రజలను ఆ ఊబిలోకి దింపే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా అభిమాన నటీనటులు ఏం చెబితే అదే వేదం అన్నట్టుగా కొంతమంది ఫ్యాన్స్ ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక అలాంటి వారిని టార్గెట్ గా ఈ సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ.. అభిమానులను చిక్కుల్లో పడేస్తున్నారని చెప్పవచ్చు. ఇకపోతే బెట్టింగ్ యాప్స్ పేరిట ప్రజల జీవితాలతో ఆడుకుంటూ వారిని ఆర్థికంగా మరింత దిగజారుస్తున్న వారిపై పోలీసు శాఖ ఫైర్ అయింది.
పరారీలో యూట్యూబర్స్ హర్ష సాయి, ఇమ్రాన్ ఖాన్..
ఈ క్రమంలోనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తో పాటూ పలువురు సినిమా సెలబ్రిటీలు, స్టార్ హీరోలు, హీరోయిన్లు, యాంకర్లపై ఇప్పుడు కేసు నమోదు అయింది. అయితే అందులో యూట్యూబర్ నాని అరెస్ట్ అవ్వగా.. భయ్యా సన్నీ యాదవ్ ,హర్ష సాయి, ఇమ్రాన్ ఖాన్ లపై కేసు నమోదైంది. ప్రస్తుతం వీరు ఇప్పుడు తప్పించుకొని తిరుగుతున్నారు. ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ వీరి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ క్రమంలోనే సాక్షులను బెదిరిస్తే, కఠిన చర్యలు తప్పవు అంటూ హైదరాబాద్ డీసీపీ పలు ఆశ్చర్యకర కామెంట్లు చేశారు.
సాక్షులను బెదిరిస్తే బొక్కలో వేస్తాం – హైదరాబాద్ డీసీపీ
ఇకపోతే తాజాగా బెట్టింగ్ ఆప్స్ ను ఎక్కువగా ప్రమోట్ చేసిన వారిలో కింగ్ పిన్ గా ఉన్నారు హర్ష సాయి, ఇమ్రాన్ ఖాన్.. ఈ నేపద్యంలోనే ఒక ఇంటర్వ్యూయర్ హైదరాబాద్ డీసీపీనీ ఇదే విషయంపై ప్రశ్నిస్తూ.. ఆ మీడియా రిపోర్టర్ మాట్లాడుతూ.. బెట్టింగ్ యాప్స్ ను ఎక్కువగా ప్రమోట్ చేస్తూ కింగ్ పిన్ గా మారిన హర్ష సాయి, ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.వీరిని అరెస్టు చేసే అవకాశం ఉందా? అని ప్రశ్నించగా.. ఆయన మాట్లాడుతూ.. ” సందర్భానుసారంగా ఎవరిని అరెస్టు చేయాలి అనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఎవరైతే విచారణకు పిలిచినప్పుడు రాకుండా తప్పించుకొని తిరగడం, సాక్షులను బెదిరించడం, సాక్షాలను నాశనం చేయడం, పద్ధతి మార్చుకోకుండా మళ్లీ అదే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం లాంటివి చేస్తే వెతికి మరీ తీసుకొచ్చి అరెస్టు చేస్తాం” అంటూ ఆయన తెలిపారు. మొత్తానికైతే సినీ సెలబ్రిటీలు ఇప్పుడు చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. ఇంకా ఇప్పటివరకు నమోదైన పేర్లలో ఎవరెవరు విచారణకు ఎప్పుడెప్పుడు వెళ్తారు అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.
బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేసి చిక్కుల్లో పడ్డ సెలబ్రిటీస్..
యూట్యూబర్స్ నాని, భయ్యా సన్నీ యాదవ్, హర్ష సాయి, టేస్టీ తేజ, విష్ణు ప్రియ, నయని పావని,రీతు చౌదరి (Rithu Chaudhary), అమృతా చౌదరి,అనన్య నాగళ్ళ, నేహా పతాన్ , పాండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్ తోపాటు రాణా దగ్గుపాటి(Hero Rana Daggubati) ,ప్రకాష్ రాజ్ (Prakash Raj)తోపాటు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) లపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. వీరితోపాటు హీరోయిన్స్ మంచు లక్ష్మి (Manchu Lakshmi), నిధి అగర్వాల్(Nidhhi Agerwal), ప్రణీత (Praneetha), సిరి హనుమంత్ (Siri Hanumanth), వంశీ సౌందర్య రాజన్, శ్రీముఖి(SriMukhi), వసంత కృష్ణ, శోభా శెట్టి(Shobha Shetty), అమృతా చౌదరి, శ్యామల(Anchor Shyamala), బండారు శేష సుకృతి వంటి వారిపై కేసు నమోదయింది.