BigTV English

Janasena – TDP : కొలికపూడి మర్డర్ స్కెచ్? జనసేన కంప్లైంట్.. పవన్ ఎంటరైతే..?

Janasena – TDP : కొలికపూడి మర్డర్ స్కెచ్? జనసేన కంప్లైంట్.. పవన్ ఎంటరైతే..?

Janasena – TDP : తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. ఈ టీడీపీ నేత కాంట్రవర్సీకి కేరాఫ్. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొలికపూడిపై వచ్చినన్ని వివాదాలు మరే ఎమ్మెల్యేపై రాలేదనే చెప్పొచ్చు. మహిళకు వేధింపులు, టీడీపీ నేతలపై దౌర్జన్యాలు.. ఇవి చాలవన్నట్టు లేటెస్ట్‌గా.. జనసేన నాయకుడిపై మర్డర్ ప్లాన్ చేశారనే ఆరోపణ. ఇలా కొలికపూడి ఉదంతం తీవ్ర వివాదాస్పదమవుతోంది.


మనబోలు శ్రీనివాసరావు. తిరువూరు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త. తనను కొలికపూడి చంపాలని చూస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యేతో ప్రాణహాని ఉందని అన్నారు. ఆయన అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే.. తనను చంపాలని చూస్తున్నారని.. ఇందుకోసం సుపారీ గ్యాంగ్‌ను సైతం రంగంలోకి దింపారంటూ మరింత కలకలం రేపారు. తన ప్రాణాలు కాపాడాలని.. కొలికపూడి నుంచి రక్షణ కల్పించాలంటూ.. ఏకంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్‌లకు కంప్లైంట్ చేశారు జనసేన లీడర్ మనబోలు శ్రీనివాసరావు. ఈ ఇష్యూ ఇప్పుడు తిరువూరుతో పాటు ఏపీ పాలిటిక్స్‌లోనూ హాట్ టాపిక్‌గా మారింది. కూటమి నేతలంతా కలిసిమెలిసి పని చేయాలని అధినాయకత్వాలు కోరుకుంటుండగా.. ఇలా ఓ టీడీపీ ఎమ్మెల్యే.. జనసేన నాయకుడి హత్యకు కుట్ర చేస్తున్నారనే ఆరోపణ రెండు పార్టీలను ఉలిక్కిపడేలా చేస్తోంది.

కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా కొలికపూడి


అమరావతి ఉద్యమంతో కొలికపూడి శ్రీనివాసరావు స్టేట్ వైడ్ పాపులారిటీ సంపాదించుకున్నారు. బలమైన దళిత బహుజన లీడర్‌గా గుర్తింపు పొందారు. గతంలో ఓ టీవీ డిబేట్‌లో బీజేపీ లీడర్ విష్ణువర్థన్ రెడ్డిని చెప్పుతో కొట్టడం.. దర్శకుడు వర్మ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. లాంటి దూకుడు చర్యలతో వేగంగా ఎదిగారు. టీడీపీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి.. 2024లో అనూహ్యంగా ఎమ్మెల్యే టికెట్ దక్కించుకుని గెలిచారు. గెలిచాక కూడా ఆయన దుందుడుకు చర్యలు ఏమాత్రం తగ్గలేదు. ఓ వైసీపీ ఎంపీపీ ఇంటికి బుల్డోజర్‌తో కూల్చే ప్రయత్నం చేశారు. ఇక, టీడీపీకే చెందిన సర్పంచ్ తుమ్మలపూడి శ్రీనివాసరావు ఉదంతం అప్పట్లో పెను సంచలనమైంది. ఎమ్మెల్యే కొలికపూడి వాట్సాప్ కాల్ చేసి తనను అసభ్య మాటలతో వేధించారంటూ తుమ్మలపూడి భార్య కవిత ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఆరోపణను ఎమ్మెల్యే ఖండించినా.. వివాదం పార్టీ అధినాయకత్వం వద్దకు చేరింది. కొలికపూడి టీడీపీ క్రమశిక్షణ సంఘం ముందు కూడా హాజరు కావాల్సి వచ్చింది. ఆ సమయంలో తీరు మార్చుకోవాలంటూ.. కొలికపూడికి చంద్రబాబు గట్టిగానే మొట్టికాయలు వేశారంటారు.

కొలికపూడి మాకు వద్దు.. టీడీపీలో జగడం

నియోజకవర్గంలో పేకాల క్లబ్లులకు పర్మిషన్లు ఇప్పిస్తానంటూ పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారనే ఆరోపణ కూడా ఉంది. తిరువూరు టీడీపీలో తీవ్ర స్థాయిలో వర్గ విభేదాలు ఉన్నాయి. ఒక సందర్భంలో కొలికపూడి మాకు వద్దు.. అంటూ స్థానిక టీడీపీ శ్రేణులు పెద్ద ఆందోళనలు కూడా చేశాయి. అటు.. ఎమ్మెల్యే తనను అక్రమ కేసులతో వేధిస్తున్నారంటూ.. గత ఫిబ్రవరిలో డేవిడ్ అనే టీడీపీ కార్యకర్త పురుగుల మందు తాగి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. అతని సెల్ఫీ వీడియో వైరల్ అయింది. ఇన్ని వివాదాలు ముసురుతున్నా.. కొలికపూడి శ్రీనివాసరావులో మార్పు వచ్చినట్టు లేదు.

కూటమిలో కొలికపూడి చిచ్చు!

తిరువూరు TDP ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వరుస వివాదాలకు కేరాఫ్‌గా మారుతున్నారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటినుంచి ఏదో పంచాయితీ పెట్టుకుంటున్నారు. తాజాగా.. జనసేన నేత బయటకొచ్చాడు. ఏకంగా హత్యా ప్రయత్నం ఆరోపణ చేశాడు. టీడీపీ లీడర్ల మధ్య గొడవలంటే ఆ పార్టీ అంతర్గత విషయంగా తీసుకున్నా.. మిత్రపక్షమైన జనసేన నాయకుడి చంపేందుకు సుపారీ గ్యాంగ్‌ను నియమించాడనే ఆరోపణ మాత్రం తీవ్రమైనదే. ఇది నిజమని తేలితే.. జనసేనాని ఊరుకుంటారా? ఇన్నాళ్లూ వైసీపీ వేధింపులపై విరుచుకుపడిన పవన్ కల్యాణ్.. ఇలా ఓ టీడీపీ ఎమ్మెల్యే తమ నియోజక వర్గ నేతను చంపాలని చూస్తున్నాడని తెలిస్తే..? సీన్ సితారే. అందుకే, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మేటర్ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో మంట రేపుతోంది.

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×