E-Paper
Advertisement

Kumari Aunty: అనుకున్నదే అయ్యింది.. బిగ్ బాస్ లోకి కుమారి ఆంటీ.. ?

Kumari Aunty: అనుకున్నదే అయ్యింది.. బిగ్ బాస్ లోకి కుమారి ఆంటీ.. ?
Advertisement

Kumari Aunty: ఏదైతే జరగకూడదు అని ప్రేక్షకులు కోరుకున్నారో అది జరగనుందని తెలుస్తోంది. ఈ ఏడాది జరిగిన వింతలు- విశేషాల్లో ఒకటి కుమారి ఆంటీ. ఈ పేరు ఎంత సునామీని సృష్టించిందో ప్రత్యేకంగాచెప్పాల్సిన అవసరం లేదు.. ఏం నాన్న బావున్నారా.. ? అన్న పిలుపుతో హైదరాబాద్‌లోని రోడ్ సైడ్ మీల్స్ బిజినెస్ చేస్తూ ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఆమె దగ్గర ఫుడ్ బావుందని యూట్యూబర్స్ ఒకరి తరువాత ఒకరు ఆమె ఫుడ్ స్టాల్ కు వెళ్లి.. కుమారి ఆంటీకి హైప్ ఇచ్చారు.

ఇంకేముంది ఫుడ్ బావుందని తెలిసిన మరుక్షణం.. ప్రజలు కుమారి ఆంటీ స్టాల్ ను చుట్టుముట్టేశారు. అలా జనాల రద్దీ పెరగడం, వాహనాల రాకపోకలను ఇబ్బంది కలగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి కుమారీ ఆంటీ బిజినెస్ ను క్లోజ్ చేయించిన విషయం కూడా తెల్సిందే.

Advertisement

ఇక సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ వివాదంలో కలుగజేసుకొని ఆమె ఫుడ్ బిజినెస్ ను మళ్లీ ఓపెన్ చేయించారు. ఈ ఇన్సిడెంట్ తరువాత కుమారి ఆంటీ ఇంటర్వ్యూలు, షోస్ లలో ఏంటి.. చివరకు సీరియల్స్, సాంగ్స్ లో కూడా కనిపించింది.

ఇక ఎప్పుడైతే కొద్దిగా పేరు తెచ్చుకుందో.. అప్పుడే ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతుంది అని మాట్లాడుకున్నారు. ఇప్పుడు అనుకున్నదే అయ్యింది. అందుతున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ యాజమాన్యం.. కుమారి ఆంటీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 8 మొదలుకానుంది. ఈ సీజన్ లో కుమారి ఆంటీని కంటెస్టెంట్ గా తీసుకోవడానికి సన్నాహాలు జరుగుతున్నాయట.

Advertisement

ఇక రెమ్యూనిరేషన్ కూడా గట్టిగా ఇవ్వాలని ప్లాన్ చేశారట. అయితే దీనిపై ఆమె ఇంకా తుది నిర్ణయం చెప్పలేదని టాక్ నడుస్తోంది. ఒకవేళ మే హౌస్ కు వెళ్లినా ఫుడ్ వండడం తప్ప గేమ్స్ ఆడలేకపోవచ్చు అని కొందరు అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×