E-Paper
Advertisement

Allu Arjun: సుకుమార్ ను హాగ్ చేసుకున్న బన్నీ.. ఇక ఆ పుకార్లకు చెక్

Allu Arjun: సుకుమార్ ను హాగ్ చేసుకున్న బన్నీ.. ఇక ఆ పుకార్లకు చెక్

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వస్తున్న చిత్రం పుష్ప 2. ఈ సినిమాపై అభిమానులు మాత్రమే కాదు ఇండస్ట్రీ మొత్తం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తుంది. పుష్ప సినిమా ఏ రేంజ్ హైప్ ఇచ్చిందో.. అంతకు మించి పుష్ప 2 ను చెక్కుతున్నాడు సుకుమార్.   ఈ ఒక్క సినిమా కోసమే బన్నీ దాదాపు మూడేళ్లుగా కష్టపడుతున్నాడు. ఇక గత కొన్ని రోజులుగా  ఈ సినిమా గురించి రకరకాల వార్తలు వినిపిస్తూ వచ్చాయి.

అల్లు అర్జున్ గడ్డం లేకుండా కనిపించడం, సుకుమార్ షూటింగ్ వదిలి వెకేషన్ కు వెళ్లడం, పుష్ప 2 వాయిదా పడడం.. ఇలా ఇవన్నీ  వీరి మధ్య విబేధాలు తలెత్తాయని చెప్పకనే చెప్పుకొచ్చాయి. దీంతో ఒకానొక సమయంలో పుష్ప 2 షూటింగ్ ఆగిపోయిందని కూడా చెప్పుకొచ్చారు. సుక్కుకు, బన్నీకి ఎక్కడ చెడింది అన్నదాని మీద సోషల్ మీడియాలో పెద్ద పెద్ద చర్చలు కూడా జరిగాయి. ఇక వీటన్నింటికి  మైత్రీ మూవీ మేకర్స్ ముందుగానే చెక్ పెట్టింది.

పుష్ప 2 షూటింగ్ మళ్లీ మొదలయ్యిందని, అనుకున్న సమయానికే ఈ సినిమా రిలీజ్ అవుతుందని చెప్పుకొచ్చింది. దీంతో ఫ్యాన్స్ కాస్త కోలుకున్నారు. ఇక ఇప్పుడు ఈ ఒక్క పిక్ తో అందరి అనుమానాలు పటాపంచలు చేశాడు బన్నీ. రావు రమేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం.

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్, సుకుమార్ ముఖ్య అతిధులుగా విచ్చేశారు. రావడం రావడమే.. బన్నీ, సుకుమార్ ను హాగ్ చేసుకొని విష్ చేశాడు.  ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలను చూసిన అభిమానులు.. హమ్మయ్య వీరు కలిసిపోయారు. పుష్ప 2 కు ఎలాంటి ఢోకా లేదు  అని కామెంట్స్ పెడుతున్నారు. పుష్ప 2.. డిసెంబర్ 6 న రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో ఈ కాంబో ఎలాంటి రికార్డులు సృష్టిస్తారో చూడాలి.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×