BigTV English

ఏపీలో మరో భారీ ప్రమాదం.. నెల్లూరులోని ఫ్యాక్టరీలో పేలిన బాయిలర్

ఏపీలో మరో భారీ ప్రమాదం.. నెల్లూరులోని ఫ్యాక్టరీలో పేలిన బాయిలర్

Fire Accident: ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అనకాపల్లి ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలడంతో సుమారు 15 మంది మరణించిన ఘటన ఒక వైపు రాష్ట్రాన్ని కుదిపేస్తుండగానే.. మరో అగ్ని ప్రమాదం జరిగింది. నెల్లూరు (డీ) పంటపాలెంలోని ఆయిల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆయిల్ ఫ్యాక్టరీలని బాయిలర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ సమాచారం అందుకున్న ఫైర్ సేఫ్టీ సిబ్బంది వెంటనే స్పాట్‌కు చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.


ఇదిలా ఉండగా.. ఈ రోజు ఏపీలోని అనకాపల్లి జిల్లాలో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఎసెన్షియా కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు  ఎగసిపడ్డాయి. ఫైర్ సిబ్బంది వెంటనే స్పాట్‌కు చేరుకున్నారు. మంటలను అర్పేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో సుమారు 15 మంది మరణంచారు. కనీసం 50 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు. పేలుడు ధాటికి గోడ, శ్లాబ్ కూలింది. దీంతో శిథిలాల కింద కూడా కొన్ని మృతదేహాలు ఉండే అవకాశం ఉన్నదని చెబుతున్నారు.

Also Read: Allu Arjun: నా ఫ్రెండ్స్ కోసం నేను వస్తా.. రాజకీయ పర్యటనపై అల్లు అర్జున్ క్లారిటీ


ఈ ఘటన జరిగినప్పుడు ఆ ఫ్యాక్టరీలో సుమారు 350కి పైగా కార్మికులు విధుల్లో ఉన్నట్టు సమాచారం. ప్రమాదం జరిగిన తర్వాత మొదటి అంతస్తులో పైకప్పు కూలింది. దీంతో చాలా మంది అందులో చిక్కుకున్నారు. పేలుడు దాటికి కార్మికుల శరీర భాగాలు ఛిద్రమయ్యాయి. సమీపంలోని చెట్లపైన మరణించిన వారి శరీర భాగాలు వేలాడినట్టు స్థానికులు చెబుతున్నారు.

Related News

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Big Stories

×