E-Paper
Advertisement

Aswini Dutt: ఇప్పుడు మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే.. అది కల్కి నిర్మాతనే.. ఎందుకో తెలుసా.. ?

Aswini Dutt: ఇప్పుడు మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే.. అది కల్కి నిర్మాతనే.. ఎందుకో తెలుసా.. ?
Advertisement

Aswini Dutt: ఏపీ ఎన్నికల ఫలితాల వేళ.. పార్టీలు.. రాజకీయ నేతలు.. గెలిచినవారు.. ఓడినవారు.. ఇలా వీరి పేర్లు వినిపించాలి కానీ, నిర్మాత అశ్విని దత్ పేరు వినిపిస్తుందేంటబ్బా. అసలు ఇంతకు ఆయన ఏం చేశారు.. ? ఎందుకు ఆయనను ఇంతలా పొగిడేస్తున్నారు. అంతగా ఆయన మాట్లాడిన మాటలు ఏంటి.. ? అనేదాని గురించి ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఆరా తీస్తున్నారు.

అశ్విని దత్ మొదటి నుంచి టీడీపీ కి సపోర్ట్ గా నిలబడిన నేత. ఎన్టీఆర్ హయాం నుంచి ఆయన టీడీపీ కి సపోర్ట్ గా నిలబడుతూ వస్తున్నాడు. కేవలం గెలిచినప్పుడు మాత్రమే కాదు.. చంద్రబాబు కష్టకాలంలో ఉన్నప్పుడు కానీ, టీడీపీ అస్సలు పోయింది అన్నప్పుడు కానీ.. ఆయన తొణకలేదు.. బెణకలేదు. ఎప్పుడు బాబుకు సపోర్ట్ గానే నిలిచాడు.

Advertisement

ముఖ్యంగా చంద్రబాబు జైలుకు వెళ్ళినప్పుడు ఏ ఒక్క నిర్మాత కానీ, హీరో కానీ, డైరెక్టర్ కానీ నోరు మెదిపింది లేదు. చివరికి ఒక్క ట్వీట్ వేసిన పాపాన పోలేదు. అదే సమయంలో అశ్విని దత్ జైలుకు వెళ్లి.. చంద్రబాబును పరామర్శించాడు. ఇక ఆ సమయంలో అశ్విని దత్ చెప్పిన మాటలు ఇప్పుడు అక్షరాలా నిజం అయ్యాయి. వచ్చే ఎన్నికల్లో చంద్రసేన..ఆ అంటే చంద్రబాబు, జనసేన కలిపి 160 సీట్లను కైవసం చేసుకుంటాయని చెప్పుకొచ్చాడు.

ఒక బడా నిర్మాత అంత దైర్యంగా మీడియా ముందు అలా చెప్పినప్పుడు ఎవరు పట్టించుకోలేదు. ఏదో పెద్దాయన చెప్తున్నాడు అనుకున్నారు. కానీ, అప్పుడు అశ్విన్ దత్ చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజం కావడంతో అందరూ మరోసారి ఆయన వీడియోను ట్రెండ్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే.. ఏ నిర్మాత అయినా అశ్విని దత్ ప్లేస్ లో ఉంటే అలా మాట్లాడడు.

Advertisement

దాదాపు రూ. 500 కోట్లతో నిర్మిస్తున్న కల్కి సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. అలా మాట్లాడితే.. ఏపీలో టికెట్స్ రేట్స్ ఇవ్వరు అని తెలుసు.. కానీ, నమ్మిన సిద్ధాంతం కోసం అశ్విని దత్ నిలబడ్డాడు. ఏది జరిగినా టీడీపీ వైపే ఉన్నాడు. ఇప్పుడు ఆయన మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ అయ్యాడు.

ఇక కల్కి విషయంలో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. టికెట్ రేట్స్ పెరుగుతాయి.. కల్కి ఈవెంట్స్ కు ఏపీలో పర్మిషన్స్ ఉంటాయి.. ఇలా ఎన్నో బెన్ ఫిట్స్ అశ్విని దత్ పొందుతాడు. అందుకే ఇప్పుడు మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే.. అది కల్కి నిర్మాతనే అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి కల్కికి ఏపీలో టికెట్ రేట్స్ ఎంత పెంచుతారో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×