BigTV English

Rahul Gandhi: బీజేపీ అహంకారంతో రాజ్యాంగ వ్యవస్థను దెబ్బతీసింది: రాహుల్ గాంధీ

Rahul Gandhi: బీజేపీ అహంకారంతో రాజ్యాంగ వ్యవస్థను దెబ్బతీసింది: రాహుల్ గాంధీ

Rahul Gandhi Press Meet(Congress party news today): దేశానికి ఇండియా కూటమి కొత్త విజన్ ఇచ్చిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ప్రెస్‌మీట్‌లో రాహుల్ గాంధీ మాట్లాడారు. బీజేపీ నేతలు పార్టీలను విడదీసి సీఎంలను జైలులో పెట్టారని విమర్శించారు. మోదీ, అదానీల మధ్య ఉన్నది అవినీతి బంధం అని ఆరోపించారు.


ఎన్నికల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. ఈడి,సీఐడీలను సొంత ప్రయోజనాలకు బీజేపీ వాడుకుందని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు ప్రతి కార్యకర్త కష్టపడ్డారని అన్నారు. ప్రతీ కార్యకర్త పార్టీ గెలుపుకోసం పనిచేశారన్న రాహుల్ వారందరికీ అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో బీజేపీతో పాటు అనేక సంస్థలతో పోరాడామని అన్నారు. మోదీ, అమిత్ షాలు పలు వ్యవస్థలను తమ గుప్పిట్లో ఉంచుకున్నారని ఆరోపించారు. గెలుపు కోసం ఇండియా కూటమి కలిసి పనిచేసిందని తెలిపారు.

Also Read: బీజేపీ కంచుకోటలో కోలుకోలేని ఎదురుదెబ్బ


కాంగ్రెస్ కార్యకర్తలకు ఖర్గే కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పోరాటం భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని తెలిపారు. భారత్ జోడో న్యాయ యాత్ర పార్టీకి ఎంతో ఉపయోగపడిందని అన్నారు. తమతో కలిసి నడిచిన అన్ని పార్టీలకు అభినందనలు అని అన్నారు. ఐక్యమత్యంతో మంచి ఫలితాలను సాధించామని తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్యం గెలిచిందని అన్నారు. ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదని ..ఇది మోదీ పరాజయం అని విమర్శించారు.

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×