Kasthuri Shankar.. అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) నటించిన సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది నటి కస్తూరి శంకర్ (Kasthuri Shankar). తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన కస్తూరి శంకర్ తెలుగులో అవకాశాలు అందుకొని బిజీగా మారింది.ఇప్పుడు తెలుగు సీరియల్స్ లో కూడా నటిస్తూ భారీ పాపులారిటీ అందుకుంది. సినిమాలు, సీరియల్సే కాదు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ.. గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది. అంతేకాదు సమాజంలో జరిగే పలు అంశాలపై కూడా స్పందిస్తూ.. విమర్శలు కూడా ఎదుర్కొంటూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఒక రాజకీయ బహిరంగ సభలో పాల్గొన్న కస్తూరి శంకర్ తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసింది.
తెలుగువారిపై కస్తూరి శంకర్ అనుచిత వ్యాఖ్యలు..
గత 300 సంవత్సరాల క్రితం మహారాణులకు సేవలు చేయడానికి తెలుగువారు తమిళనాడుకి వలస వచ్చారు అంటూ తెలుగు ప్రజలను తక్కువ చేసి మాట్లాడింది కస్తూరి శంకర్. దీంతో తెలుగు ప్రజలు, తెలుగు సంఘాలు కూడా కస్తూరి శంకర్ పై ఆగ్రహం వ్యక్తం చేశాయి. వెంటనే స్పందించిన కస్తూరి శంకర్..” తాను తెలుగు ప్రజలను ఉద్దేశించి ఎటువంటి తప్పుడు మాటలు మాట్లాడలేదు అని అయితే తన మాటలను కొంతమంది తప్పుగా ప్రచారం చేస్తున్నారు” అంటూ తెలిపింది. అయితే ఈమె మాట్లాడిన మాటలు తెలుగువారికి అవమానంగా అనిపించడంతో చర్యలు తీసుకోవాలని కామెంట్లు చేశారు. దీంతో స్పందించిన కస్తూరి శంకర్..” నేను మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకుంటున్నాను. తెలుగువారు నన్ను క్షమిస్తారని భావిస్తున్నాను” అంటూ తెలిపింది.
కస్తూరి శంకర్ పై కేస్ ఫైల్..
ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తమిళనాడులో ఈమెపై కేసు నమోదయింది. దీంతో ఈమెకు సమన్లు జారీ చేసే విషయంపై న్యాయ నిబంధనలతో పోలీసులు చర్చిస్తున్నారు. ఇండియా తెలుగు సమ్మేళనం తరపున కస్తూరిపై చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా.. దీంతో పోలీసులు ఆమెపై 192, 196 (1A) 3 53,353 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా ఆమెను పోలీస్ కార్యాలయానికి రప్పించడానికి సమన్లు కూడా జారీ చేయడానికి ఏర్పాటు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక దీంతో కస్తూరిని అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రస్తుతం ప్రచారం జరుగుతుంది. అయితే కస్తూరి ఇప్పటికైనా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను అంటూ తెలుగు ప్రజల మనోభావాలు గాయపరచినట్లయితే, వారిని క్షమింపని చెబుతున్నానంటూ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఇప్పుడు పోలీసులు కూడా ఈ విషయాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని పోలీసులు ఈమెను అరెస్టు చేసి అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈమెపై కేసు ఫైల్ అయిందని అరెస్టుకి రంగం సిద్ధమవుతుందని సమాచారం.