E-Paper
Advertisement

Indian 2: ఎట్టకేలకు రిలీజ్ డేట్ ప్రకటించిన భారతీయుడు..

Indian 2: ఎట్టకేలకు రిలీజ్ డేట్ ప్రకటించిన భారతీయుడు..
Advertisement

Indian 2: విక్రమ్ సినిమా తర్వాత కమల్ హాసన్ జోరు పెంచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన చేతిలో వరస సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి ఇండియన్ 2. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారతీయుడు సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక దాదాపు 37 ఏళ్ల తర్వాత భారతీయుడు సీక్వెల్ ను కమల్- శంకర్ ప్రకటించారు. అయితే ఈ సినిమా మొదలైనప్పటినుంచి వివాదాలతోనే కొనసాగుతుంది. కొన్నిరోజులు లైకా ప్రొడక్షన్స్ కు, శంకర్ కు మధ్య వివాదాల వలన సినిమాషూటింగ్ ఆగింది. ఇంకొన్ని రోజులు సెట్ లో జరిగిన ఒక పెను ప్రమాదం వలన షూటింగ్ ఆగింది.

Advertisement

ప్రస్తుతం ఈ వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టిన శంకర్ ఎట్టకేలకు మళ్లీ సినిమాను సెట్స్ పైకి తీసుకు వెళ్లాడు. గేమ్ ఛేంజర్ సినిమాను పక్కనపెట్టి మరీ శంకర్.. ఇండియన్ 2 ను ఫినిష్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. లైకా ప్రొడక్షన్స్ కొన్ని వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక ఎప్పుడు ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ ఒక గుడ్ న్యూస్ తెలిపారు. ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ డేట్ ను చిత్రబృందం అధికారికంగా ప్రకటించారు.

జూన్ నెలలో భారతీయుడు రాబోతున్నాడని చెప్పుకొస్తూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో సేనాపతి తెల్లటి ధోతీ, కుర్తా ధరించి, చేతులకు సంకెళ్ళతో అదిరిపోయే లుక్ లో కనిపించాడు. అంతేకాకుండా ఇండియన్ 2 కింద జీరో టోలరెన్స్ అనే క్యాప్షన్ ఇచ్చి మరింత హైప్ క్రియేట్ చేశారు. ” సేనాపతి మళ్లీ వస్తున్నాడు. ఇండియన్ 2 ఈ జూన్ లో థియేటర్లో దూసుకుపోవడానికి సిద్ధంగా ఉంది. ఎపిక్ సాగా కోసం మీ క్యాలెండర్‌ను రెడీ చేసుకోండి” అంటూ మేకర్స్ రాసుకోచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే.. జూన్ నెల అని ప్రకటించారు కానీ డేట్ ను రిలీజ్ చేయలేదు. దీంతో ఇంకా కన్ఫ్యూజన్ ఏంటి అనేది అభిమానులకు తెలియట్లేద. మరి భారతీయుడు జూన్ లో మరోసారి ఇండస్ట్రీని షేక్ చేస్తాడేమో చూడాలి.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×