BigTV English

Ys Jagan: సినిమా విలన్‌ క్యారెక్టర్లు అన్నీ కలిపితే చంద్రబాబు.. జగన్‌

Ys Jagan: సినిమా విలన్‌ క్యారెక్టర్లు అన్నీ కలిపితే చంద్రబాబు.. జగన్‌

Ys Jaganపలు సినిమాల్లోని విలన్ క్యారెక్టర్లు అన్నీ కలిపితే చంద్రబాబు అని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. మోసం, అబద్దాలు, వెన్నుపోటు కలిపితేనె చంద్రబాబు అని జగన్ విమర్శించారు. మోసగాళ్ల కూటమికి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు.


నెల్లూరు జిల్లా కావలిలో సీఎం జగన్ బస్సు యాత్రను నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన సభలో జగన్ చంద్రబాబు, కూటమిపై మండిపడ్డారు. విపక్షాల కుట్రలు, కుతంత్రాలు చేధించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉండాలన్నారు.

“కావలిలో జన ప్రభంజనం కనిపిస్తోంది. మంచి చేసిన మనకు మద్దతిచ్చేందుకు మీరంతా సిద్ధమా.. ఈ ఎన్నికలు జగన్, చంద్రబాబుకు మధ్య జరిగే ఎన్నికలు కాదు. మోసం చేయడమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు, ప్రజలకు మధ్య యుద్ధం. మోసగాళ్లంతా కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు.పేదల భవిష్యతు నిర్ణయించేది ఈ ఎన్నికలే. ఈ యుద్ధంలో నేను ప్రజల పక్షం.. మోసగాళ్లంతా చంద్రబాబు పక్షం. సినిమా విలన్ క్యారెక్టర్లు అన్నీ కలిపితే చంద్రబాబు.. అబద్దాలు, వెన్నుపోటు, మోసాలు, కుట్రలు కలిపితే చంద్రబాబు.


ప్రజలతో చంద్రబాబుది అతకని బంధం.. మీ ఇంట్లో వున్న చిన్న పిల్లలతో కూడా మాట్లాడండి.. ఎవరి వల్ల మేలు జరిగిందో అని.. చంద్రబాబు మూడుసార్లు రంగు రంగులు మేనిఫెస్టోలు చూపించారు. ఎన్నికల తర్వాత చంద్రబాబు మేనిఫెస్టోను పట్టించుకోరు. మేనిఫెస్టోలో కనీసం 10 శాతం అయినా అమలు చేశారా..?.. పేదలకు చంద్రబాబు చేసిన ఒక్క మంచిపనైనా చేశారా..? చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తొస్తుందా..? నేను నాలుగు నెలలుగా ప్రశ్నిస్తున్నా సరే చంద్రబాబు సమాధానం చెప్పడం లేదు.

Also Read: జగన్ కు మరో షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే

చంద్రబాబు మోసాలు, వెన్నుపోట్లతో 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నారు. తను చేసిన పనులు చెప్పుకునే దైర్యం, దమ్ము చంద్రబాబుకు లేదు. మంచిచేసి ఉంటే చంద్రబాబు 3 పార్టీలతో పొత్తు ఎందుకు పెట్టుకుంటారు” అని చంద్రబాబుపై జగన్ విమర్శలు చేశారు.

Related News

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Big Stories

×