BigTV English

TG Assembly: సీఎం రేవంత్‌కు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి మధ్య బంధుత్వం ఉంది

TG Assembly: సీఎం రేవంత్‌కు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి మధ్య బంధుత్వం ఉంది

CPI MLA kunamneni latest comments(Telangana news today): సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఈ రోజు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్న వివాదాన్ని రాజకీయం చేయడాన్ని ఆయన ఖండించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అన్ని పార్టీలూ కలిశాయని, ఇప్పుడు ఈ చిన్ని అంశంపై అంత రాద్ధాంతం అక్కర్లేదని తెలిపారు. తమకు ఆ ఇద్దరి సోదరీమణుల పట్ల సానుభూతి ఉన్నదని, ఇందులో ఎటువంటి భిన్నాభిప్రాయాలు లేవని ఆయన స్పష్టం చేశారు. మాట్లాడే ఒరవడిలో ఉద్దేశపూర్వకంగా అవమానపరిచారా? లేదా? అనే అంశాలను కూడా ఒక సారి పరిశీలించాలని వివరించారు.


ఎందుకంటే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి మధ్య అక్కా తమ్ముళ్ల అనుబంధం ఉన్నదని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని వివరించారు. వారి మధ్య బంధుత్వం కూడా ఉన్నదని తెలిపారు. కాబట్టి, ఈ వివాదాన్ని మరింత పొడిగించకుండా సమస్యను పరిష్కరించుకోవాలని సూచన చేశారు.

Also Read: శనివారం రోజు రక్తపాతమే.. పోస్టర్లతోనే పిచ్చెక్కిస్తున్నాడే


నిరసన వ్యక్తం చేస్తున్నందున ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో తాను మాట్లాడే అవకాశాన్ని కోల్పోయామని కూనంనేని తెలిపారు. ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ బిల్లు పైనా మాట్లాడనివ్వలేదని ఆగ్రహించారు. తాము మహిళలను గౌరవించేవారిలో ముందుంటామని, అటువంటి తమను కూడా మాట్లాడనివ్వకుండా చేయడం సరికాదని పేర్కొన్నారు.

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి మధ్య వాడి వేడి కామెంట్లు చోటుచేసుకున్నాయి. సద్దుమణిగే అవకాశం ఉన్నప్పటికీ వీటిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక వివాదంగా రాజేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.

Related News

Hyderabad Rains Today: కుమ్మేస్తున్న వరుణుడు.. ఇళ్లల్లో ఉండటమే బెటర్, ఈ ఏరియాలు జలమయం

Telangana politics: కారులో భారీ కుదుపు.. కమలం గూటికి మాజీలు, బీఆర్ఎస్ తర్వాత ప్లానేంటి?

Shamshabad Airport: శంషాబాద్ విమానాశ్రయంలో హైఅలర్ట్! బాంబ్ స్క్వాడ్ ప్రత్యేక తనిఖీలు.. ఎందుకంటే..

Telangana Rains: వర్షాల ఎఫెక్ట్.. ఈ ఐదు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు

Telangana Government: రాష్ట్ర అభివృద్ధిపై సీఎం రేవంత్ ఫోకస్.. నలుగురు మంత్రులతో కమిటీ

Heavy rains: కుండపోత వర్షం.. వారికి వర్క్ ఫ్రం హోం ఇవ్వండి.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..

Big Stories

×