E-Paper
Advertisement

Kalki2898AD: బుజ్జితో భైరవ ఎంట్రీ.. హాలీవుడ్ సినిమా చూసినట్లుంది కదా

Kalki2898AD: బుజ్జితో భైరవ ఎంట్రీ.. హాలీవుడ్ సినిమా చూసినట్లుంది కదా
Advertisement

Kalki2898AD: బుజ్జి.. బుజ్జి.. బుజ్జి అంటూ ఎదురుచూసిన ఫ్యాన్స్ కు బుజ్జి ఎలా ఉంటుందో తెలిసిపోయింది. ప్రభాస్ తన జీవితంలోకి ఆహ్వానించిన బుజ్జి బాడీ బాక్సాఫీస్ ను షేక్ చేసేలా ఉంది. కల్కి సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉంది. టోటల్ గా బుజ్జి అదిరిపోయింది. ఎహే అసలు ఎవరు బుజ్జి అని తెలియని వారున్నారా.. ? అయితే చెప్తా వినండి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతూన్న చిత్రం కల్కి2898 AD.

వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక మూడు రోజుల క్రితం బుజ్జి అనే కీలక పాత్రను పరిచయం చేస్తామని మేకర్స్ చెప్పగానే దీపికా.. దిశానా అని అనుకున్నారు. కానీ, బుజ్జి అంటే ఒక వెహికల్. కారు లాంటిది. కానీ కారు అనలేం. బుజ్జి మాట్లాడుతుంది కూడా. హీరోయిన్ కీర్తి సురేష్ బుజ్జికి ఓవర్ ఇచ్చింది.

Advertisement

ఇప్పటికే బుజ్జి బ్రెయిన్ ను పరిచయం చేసిన మేకర్స్ తాజాగా బుజ్జి బాడీని పరిచయం చేశారు. ఈ కారు మన ఊహలకు అందనిదిగా ఉంది హాలీవుడ్ రేంజ్ లో కారును తయారుచేసిన విధానం నభూతో నభవిష్యత్ అని చెప్పొచ్చు. దీనికి కేవలం మూడు టైర్లు మాత్రమే ఉన్నాయి. ఇక ఈ కారులో ప్రభాస్ రాయల్ ఎంట్రీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. బుజ్జి- భైరవ కాంబో సినిమాలో హైలైట్ అని టీజర్ ను బట్టి తెలుస్తోంది. బుజ్జి ఫన్నీ డైలాగ్స్.. భైరవ దాన్ని ఆపడం చాలా కామెడీగా కనిపిస్తుంది. ఇక ఈ కారులోనే ప్రభాస్ యుద్దాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ బుజ్జి టీజర్ నెట్టింట వైరల్ గా మారింది. జూన్ 27 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి రికార్డులు అందుకుంటాడో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×