BigTV English

AP Aarogyasri: పేద ప్రజలకు షాక్.. ఆరోగ్యశ్రీ సేవలు బంద్

AP Aarogyasri: పేద ప్రజలకు షాక్.. ఆరోగ్యశ్రీ సేవలు బంద్

YSR Aarogyasri Scheme update(Latest news in Andhra Pradesh):

ఆరోగ్యశ్రీ సీఈవోతో ప్రయివేట్ నెట్ వర్క్ ఆసుప్రతులు జరిపిన చర్చలు మరోసారి విఫలం అయ్యాయని ఏపీ ఆసుపత్రుల అసోసియేషన్ వెల్లడించింది. బుధవారం సాయంత్రం జూమ్ యాప్ ద్వారా ప్రభుత్వంతో వీరు చర్చలు జరిపారు. పెండింగ్ బిల్లులు చెల్లించే వరకు వైద్య సేవలు అందించమని తెలిపారు.


మార్చి31 వరకు ఉన్న పెండింగ్ బిల్లులను చెల్లిస్తేనే ఆరోగ్య శ్రీ సేవలు అందిస్తామని నెట్ వర్క్ ఆసుపత్రులు ప్రభుత్వానికి తెలిపాయి. కానీ ప్రభుత్వం రూ.203 కోట్లు చెల్లించేందుకు అంగీకరించింది. తక్షణమే రూ. 800 కోట్ల బకాయిలు విడుదల చేయాలని ఆసుప్రతులు కోరాయి. ప్రభుత్వం రూ.1500 కోట్లు పెండింగ్ బకాయిలు పెట్టిందని అందులో కనీసం రూ. 800 కోట్లు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ప్రయివేట్ నెట్ వర్క్ ఆసుప్రతుల్లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయి. దీంతో రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: జగన్ చాప్టర్ క్లోజ్, వాళ్లది మైండ్ గేమ్ అంటూ..


ప్రభుత్వం పెండింగ్ బిల్లులను చెల్లించే వరకూ కొత్త కేసులను చేర్చుకోమని ప్రయివేట్ నెట్ వర్క్ ఆసుప్రతులు తెలిపారు. ఆరోగ్య శ్రీ ట్రస్టు సీఈవో ఇప్పటి వరకు రెండు సార్లు జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. ప్రయివేట్ ఆసుత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోవడంతో ఆసుపత్రులకు వచ్చిన వారు ఇబ్బందులు పడుతున్నారు. నెట్ వర్క్ ఆసుపత్రులకు పెండింగ్ బిల్లులను కొంత చెల్లించి మిగితా చెల్లింపులు వీలైనంత త్వరగా చేపడతామని సీఈవో తెలిపారు. ప్రజలను ఇబ్బంది పెట్టకుండా సహకరించాలరని కోరారు. పేద, మధ్య తరగతి ప్రజలకు ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు.

Tags

Related News

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Big Stories

×