BigTV English

Ravi Teja : ర‌వితేజ గాడిలో ప‌డ్డ‌ట్టేనా?

Ravi Teja : ర‌వితేజ గాడిలో ప‌డ్డ‌ట్టేనా?

Ravi Teja : 2023 మిగిలిన హీరోల‌తో పోలిస్తే ర‌వితేజ చూపిస్తున్న జోరు కాస్త ఎక్కువ‌గానే క‌నిపిస్తోంది. 2022 స్టార్టింగ్ పెద్ద‌గా క‌లిసి రాలేదు ర‌వితేజ‌కు. ఆఖ‌రిన వ‌చ్చిన ధ‌మాకా త‌ప్ప‌, అంత‌కు ముందు వ‌చ్చిన రెండు సినిమాలూ అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యాయి. 2021లో క్రాక్‌తో వ‌చ్చిన జోరును ఖిలాడీగానీ, రామారావు ఆన్ డ్యూటీగానీ కంటిన్యూ చేయ‌లేక‌పోయాయి. ఇయ‌ర్ ఎండింగ్‌లో వ‌చ్చిన ధ‌మాకా కూడా ముందు ఫుల్ నెగ‌టివ్ టాక్ తెచ్చుకుంది. కానీ స‌రైన సినిమా ఇంకోటి లేక‌పోవ‌డం, శ్రీలీల‌లాంటి గ్లామ‌ర్ యాడ్ కావ‌డంతో కాస్త గ‌ట్టున ప‌డింది. ఇప్పుడు అదే స్పీడు 2023లోనూ కంటిన్యూ అవుతుంద‌ని ఫ్యాన్స్ కి హింట్ ఇచ్చారు మాస్ మ‌హ‌రాజ్ . మెగాస్టార్ చిరంజీవితో పాటు ర‌వితేజ క‌లిసి న‌టిస్తున్న సినిమా వాల్తేరు వీర‌య్య‌. ఈ చిత్రం సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 13న విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే పాట‌ల‌కు పూన‌కాలు వ‌స్తున్నాయి జ‌నాల‌కు. రావ‌ణాసుర సినిమా సెట్స్ మీద ఉంది. షూటింగ్ పూర్తి చేసుకుంది. డ‌బ్బింగ్ ప‌నులు కూడా మొద‌లుపెట్టింది యూనిట్‌.


ఇది కాకుండా టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు అని ఓ క్రేజీ ప్రాజెక్టు చేస్తున్నారు ర‌వితేజ‌. తెలుగు రాష్ట్రాల్లో టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు హిస్ట‌రీ మీద మంచి ఇంట్ర‌స్ట్ ఉంది. ఆయ‌న ఎలా ఉంటారో ఇప్ప‌టికీ స‌రిగ్గా చెప్పేవాళ్లు మెండుగా లేరు. కానీ ఆయ‌న గురించి క‌థ‌లు క‌థ‌లుగా చెప్పేవారు ఎక్కువ‌గా క‌నిపిస్తారు. అందుకే ఆ స‌బ్జెక్టుకు అంతక్రేజ్ ఉంటుంది. దీంతో పాటు మ‌రో సినిమా కూడా చేస్తున్నారు ర‌వితేజ‌. అన్నీ క‌లిసొస్తే, ఈ ఏడాది మ‌ళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతాన‌ని నియ‌ర్ అండ్ డియ‌ర్స్ తో చెబుతున్నార‌ట మాస్ మ‌హ‌రాజ్‌.

మ‌రి మాస్ మ‌హ‌రాజ్ కోరుకున్న విజ‌యాన్ని మెగాస్టార్ మూవీతో బోణీకొడ‌తారా? వెయిట్ చేసి చూడాల్సిందే.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×