Bollywood Heros: బాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోలు ఉన్నారు. ఎన్నో అవార్డులను కూడా అందుకున్నారు. ఎన్ని వందల కోట్లు పెట్టి ఎక్కడా హడావిడి చెయ్యరు. రోజుల తరబడి ప్రమోషన్ కార్యక్రమాలు చెయ్యరు. భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమాలు అయిన రిజల్ట్ జనాలకే వదిలేస్తారు. మహా అయితే సినిమా గురించి ఒకటి లేదా రెండు ప్రెస్ మీట్ లు పెట్టి సినిమా గురించి ఏదో కొంచెం చెప్తారు. ఇక ఇటీవల కాలంలో పాన్ ఇండియా రిలీజ్ లు అవ్వడంతో, హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లాంటి సిటీలకు వెళ్తున్నారు. అక్కడ ప్రచారం చేసినా, ఎలాంటి హడావుడి లేకుండా సింపుల్ గా ఉంటుంది. లోకల్ ఛానల్స్ ప్రొగ్రామ్స్ లో పాల్గొని సినిమా ప్రచారం చేసుకోవడం తప్ప. జనాల్లోకి వెళ్లి ప్రచారాలు చెయ్యరు. ఎందుకో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఏరియాకు వెళ్లి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు, టీజర్, ట్రైలర్ ఈవెంట్లు అంటూ ప్రత్యేకంగా చేయరు. ఆరకంగా చూసుకుంటే హిందీ సినిమా ప్రచారానికి పెద్దగా ఖర్చు కూడా ఉండదు.. ఈ మధ్య బాలీవుడ్ లో పుష్ప 2 రిలీజ్ అయ్యింది. నార్త్ లో రిలీజ్ అయ్యి భారీ ప్రభంజనం సృష్టించింది. వరుస బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది. బాలీవుడ్ హీరోలు కూడా జనాల్లోకి వెళ్తారా.. అన్న వార్తలు వినిపించడం మొదలు అయ్యాయి. వాళ్లు కూడా ఇక మీదట ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేస్తారా? అని ఆనోటా ఈనోటా పాకి వైరల్ గా మారింది.. అదే కనుక నిజమైతే మాత్రం పోలీసులు పెద్ద తలనొప్పి అవుతుంది.
ఇక ఈ నేపథ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయట పడింది. బాలీవుడ్ హీరోలు జనాల్లోకి వెళ్లకపోవడానికి ఓ ప్రత్యేక మైన కారణం వినిపిస్తుంది. తమ కారణంగా పబ్లిక్ ఇబ్బంది పడకూడదు. సెలబ్రిటీ అంటే కేవలం తెరపై కనిపించి ప్రేక్షకుల్ని అలరించడం వరకే.. అంతేకాని హీరోలు జనాలను ఎప్పుడు ఇబ్బంది పెట్టరు. స్టార్ హీరో కనిపిస్తే జనాలు ఎగబడతారు. అందుకే జనాలకు ఎప్పుడు ఇబ్బంది పెట్టేలా చెయ్యరు అని గతంలో చాలా సార్లు వార్తలు వినిపించాయి. సినిమా నటుడు-సామాన్య ప్రేక్షకుడి మాధ్య దూరం దగ్గరైతే అది మరింత సమస్యగానే మారు తుందన్నారు. ఆ మాత్రం వ్యత్యాసం లేకపోతే? తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్నటు వంటి పరిస్థితుల్లో తమ వద్ద జరగడానికి అవకాశం ఉటుందన్నారు.. అందుకే జనాల్లోకి కానీ, బయట ఈవెంట్స్ చెయ్యడం చెయ్యరని బాడా హీరోలు సోషల్ మీడియా ద్వారా తెలుపుతున్నారు.. ఇక మీదట వాళ్ళు ప్రమోషన్స్ చేస్తారా? ఇదే కంటిన్యూ చేస్తారా చూడాలి..