OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లో డిఫరెంట్ కాన్సెప్ట్ తో కొన్ని సినిమాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొరియన్ మూవీలో హీరోకి ఒక విచిత్రమైన అలవాటు ఉంటుంది. ఎవరూ లేని ఇంట్లోకి వెళ్లి దొంగతనాలు చేయకుండా, ఆ ఇంటిని శుభ్రం చేసి, హాయిగా తిని నిద్రపోతాడు. ఈ క్రమంలో అతనికి కొన్ని వింత అనుభవాలు ఎదురవుతాయి. ఈ కొరియన్ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? వివరాల్లోకి వెళితే..
అమెజాన్ ప్రైమ్ వీడియో
2004లో విడుదలైన ‘త్రీ ఐరన్‘ (3 Iron) అనే ఈ దక్షిణ కొరియన్ మూవీకి కిమ్ కి డుక్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో వేధింపులకు గురైన గృహిణితో సంబంధాన్ని పెంచుకునే యువకునిగా జేహీ నటించారు. ఈ రొమాంటిక్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళ్తే
హీరో కొన్ని ఇళ్లకు పోస్టర్స్ అంటిస్తూ ఉంటాడు. రాత్రి అంటించిన పోస్టర్ని ఎవరు తీయకుంటే ఆ ఇంట్లో మనుషులు లేరని గ్రహిస్తాడు. ఆరోజు ఆ ఇంట్లోకి వెళ్లి దొంగతనం మాత్రం చేయకుండా, స్నానం చేసి ఇంటిని సర్ది ఫుడ్ వండుకొని తింటాడు. ఇలా ఇతని దినచర్య సాగుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఒకరోజు ఒక ఇంట్లోకి వెళ్తాడు. అక్కడ భర్త కొట్టడంతో, హీరోయిన్ ఏడుస్తూ ఉంటుంది. ఇది గమనించని హీరో ఆ ఇంట్లో రిపేరు ఉన్న వస్తువులను బాగు చేస్తాడు. ఆ తరువాత ఫుడ్ తిని గోల్ఫ్ ఆడుకుంటాడు. హీరోయిన్ అతను దొంగతనానికి రాలేదని అనుకుంటుంది. ఈ లోగా భర్త ఇంట్లోకి వస్తాడు. ఆమెను బలవంతంగా అనుభవించడానికి ట్రై చేస్తాడు. హీరో గోల్ఫ్ బ్యాట్ తీసుకుని బాల్ ని అతనికేసి కొడతాడు. అక్కడినుంచి బైక్ పై వెళ్తుండగా, హీరోయిన్ కూడా అతనితో వెళ్ళిపోతుంది. శాడిస్ట్ భర్తతో విసిగి చెందిన ఆమె ఇంట్లో ఉండలేక పోతుంది. అలా వీళ్ళిద్దరూ రాత్రి పూట ఎవరూ లేని ఇండ్లలోకి వెళుతూ ఉంటారు. ఈ క్రమంలో ఒక ఇంట్లో ముసలి వ్యక్తి చనిపోయి ఉంటాడు. వీళ్ళిద్దరూ అతనికి అంత్యక్రియలు చేస్తారు. ఆ ఇంట్లోకి వచ్చిన అతని కొడుకు, తన తండ్రిని చంపింది వీళ్లే అని పోలీసులకు కంప్లైంట్ ఇస్తాడు.
హీరో హీరోయిన్లను అరెస్ట్ చేస్తారు పోలీసులు. పోస్టుమార్టం రిపోర్ట్ లో అతను అనారోగ్యంతో చనిపోయాడని నివేదిక వస్తుంది. హీరోయిన్ ను ఆమె భర్త దగ్గరికి పంపిస్తారు. హీరోయిన్ భర్త, హీరోని పోలీసులకు డబ్బులు ఇచ్చి కొట్టిస్తాడు. జైలులో హీరో ఒక కళను నేర్చుకుంటాడు. మనిషి వెనకాలే ఉండి ఎవరూ గుర్తించ లేనట్టుగా ప్రాక్టీస్ చేసుకుంటాడు. అలా పోలీస్ వెనకాలే ఉండి జైలు నుంచి తప్పించుకుని, హీరో హీరోయిన్ ఇంటికి వస్తాడు. అప్పుడు హీరోయిన్ భర్త వెనకాలే ఉండి హీరోయిన్ తో సరసాలు ఆడుతాడు హీరో. హీరోయిన్ కూడా హీరో రావడంతో చాలా హ్యాపీగా ఉంటుంది. మంచి మంచి వంటలు చేసి పెడుతుంది. చివరికి హీరోతో హీరోయిన్ రొమాన్స్ చేస్తున్నట్లు ఆమె భర్త గ్రహిస్తాడా? వీళ్లు ముగ్గురు ఒకే ఇంట్లో ఉంటారా? హీరో ఆ వింత అలవాటును పోగొట్టుకుంటాడా? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ కొరియన్ మూవీని చూడాల్సిందే.