Horoscope Today December 29th: వేద జ్యోతిష్యశాస్త్రంలో మొత్తం 12 రాశుల గురించి వివరించబడింది. ప్రతి రాశి ఒక గ్రహంచే పాలించబడుతుంది. గ్రహాలు, నక్షత్రాల కదలిక ఆధారంగా జాతకాన్ని అంచనా వేస్తారు. డిసెంబర్ 29 ఆదివారం. హిందూ మతంలో ఆదివారం సూర్య భగవానుడి ఆరాధనకు అంకితమైనదిగా పరిగణించబడుతుంది. సూర్య భగవానుని ఆరాధించడం ద్వారా ప్రతి పని విజయవంతం అవుతుందని మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని నమ్ముతారు. 29 డిసెంబర్ 2024 న ఏ రాశుల వారికి ప్రయోజనం చేకూరుతుంది, ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి:
కుటుంబ సమేతంగా ఏదైనా ధార్మిక ప్రదేశాన్ని సందర్శించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఖర్చులు అధికంగా ఉంటాయి. విద్యా పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. వ్యాపారంలో లాభదాయకమైన అవకాశాలు ఉంటాయి. ఆదాయం కూడా పెరుగుతుంది.
వృషభ రాశి:
మీరు ఉద్యోగంలో ఇబ్బందులను ఎదుర్కునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆఫీసుల్లో మార్పులకు అవకాశం ఉంది. విద్యా పనుల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఆటంకాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపార పరిస్థితులు మెరుగుపడతాయి.
మిథున రాశి:
కళ లేదా సంగీతం పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలపై ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారంలో మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు స్నేహితుడి నుండి వ్యాపార ప్రతిపాదనను పొందుతారు. మీ ఆదాయం పెరుగుతుంది.
కర్కాటక రాశి:
మీరు మీ ఉద్యోగంలో భాగంగా విదేశాలకు వెళ్లే అవకాశాలను పొందుతారు. మీరు అధికారుల నుండి మద్దతు పొందుతారు. దుస్తులు, వాహన నిర్వహణపై ఖర్చులు పెరగుతాయి. విద్యా పనులు సంతోషకరమైన ఫలితాలను ఇస్తాయి. మీ ఆదాయం పెరుగుతుంది.
సింహ రాశి:
ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పనిలో పెరుగుదల ఉంటుంది. మీ ఆదాయం పెరుగుతుంది. మీరు స్నేహితుల నుండి మద్దతు పొందుతారు. వైవాహిక జీవితం చాలా బాగుంటుంది.
కన్య రాశి:
వ్యాపారం మెరుగుపడుతుంది. లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. ఆఫీసుల్లో మార్పులకు అవకాశం ఉంది. కొన్ని ఇబ్బందులు కూడా రావచ్చు. విహారయాత్రకు కూడా వెళ్లవచ్చు.
తులా రాశి :
దాంపత్య జీవితం బాగుంటుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. వ్యాపార పరిస్థితులు మెరుగుపడతాయి. మీరు సోదరులు, సోదరీమణుల నుండి ఆర్థిక సహాయం పొందుతాయి. మీరు మీ పనిలో అధికారుల నుండి మద్దతు పొందుతారు.
వృశ్చిక రాశి:
ఉద్యోగంలో మార్పుతో ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. విద్యా పనిలో విజయం సాధిస్తారు. వ్యాపార పరిస్థితులు మెరుగుపడతాయి. ఆదాయం కూడా పెరుగుతుంది.
ధనస్సు రాశి :
మీరు వ్యాపారంలో సానుకూల ఫలితాలను పొందుతారు. కాస్త ఓపిక పట్టండి. అనవసరమైన కోపం ,చర్చలకు దూరంగా ఉండండి. శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి. మీరు మీ ఉద్యోగంలో అధికారుల నుండి మద్దతు పొందుతారు, కానీ కార్యాలయంలో ఇబ్బందులు ఉంటాయి.
మకర రాశి :
వ్యాపారంలో మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వేరే ప్రదేశానికి వెళ్తారు. మీరు కొన్ని ప్రారంభ ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు. మీరు స్నేహితుల నుండి మద్దతు పొందుతారు. కుటుంబ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
కుంభ రాశి:
ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు కుటుంబానికి దూరంగా వేరే ప్రదేశానికి వెళ్లవలసి వస్తుంది. తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
Also Read: 2025 లో 30 ఏళ్ల తర్వాత శని, రాహువుల కలయిక.. ఈ 3 రాశుల వారి జీవితాలు తలక్రిందులు
మీన రాశి:
ఉద్యోగంలో ప్రమోషన్‌కు అవకాశం ఉంది. మీరు గౌరవం పొందుతారు. కానీ మీరు కుటుంబానికి దూరంగా వేరే ప్రదేశానికి వెళ్లవచ్చు. విద్యా పనులు సంతోషకరమైన ఫలితాలను ఇస్తాయి.