Johnny Master : టాలీవుడ్ క్రేజీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పేరు గత కొన్ని రోజులుగా వార్తల్లో వినిపిస్తుంది. మహిళా కొరియోగ్రాఫర్ శ్రేష్ఠి అనే యువతి తనను లైంగిక వేధింపులకు గురి చేసినట్లు నార్సింగ్ పోలీసులకు యువతి కంప్లైంట్ చేసిన సంగతి తెలిసిందే.. ఈ వార్త ఇండస్ట్రీలో పెను దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. జానీ మాస్టర్ కేవలం టాలీవుడ్ లోనే కాదు, పాన్ ఇండియా లెవెల్ లో టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్స్ లో ఒకరు. రెండు సార్లు నేషనల్ అవార్డు దక్కించుకున్న నేటి తరం ఏకైక కొరియోగ్రాఫర్ ఆయన. కెరీర్ పీక్ రేంజ్ లో వెళ్తున్న సమయంలో మాస్టర్ పై ఇలాంటి రూమర్స్ రావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది. తాజాగా మాస్టర్ పై ఇన్నేళ్ల తర్వాత ఇలాంటి ఆరోపణలు రావడం తో ఆ హీరో హస్తం ఉందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
జానీ మాస్టర్ అసిస్టెంట్ పై లైంగిక వేధింపులకు గురి చేసినట్లు ఆమె ఫిర్యాదు పేర్కొంది. ఆ వివరాల ప్రకారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు జానీ మాస్టర్ కోసం గాలిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ కేసులో భాగంగా పోలీసులు యువతి స్టేట్మెంట్ ను కూడా తీసుకున్నారు. దీనిపై జానీ మాస్టర్, ఆయన భార్య అయేషా కూడా స్పందించారు. తన పై కావాలనే ఎవరో రుమార్స్ క్రియేట్ చేస్తున్నారు. నా కేరీర్ ను దెబ్బ తియ్యాలనే డబ్బులిచ్చి కేసు పెట్టించారు అని సోషల్ మీడియా ద్వారా వీడియోను రిలీజ్ చేశాడు.. ఇక ఈ కేసు ఆరోపణలు మాస్టర్ పై రావడంతో జనసేన పార్టీ షాక్ ఇచ్చింది. జానీ మాస్టర్ ఇక పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని నోట్ ద్వారా పేర్కొన్నారు.
డ్యాన్సర్స్ అస్సోసియేషన్ నుంచి తొలగింపు..
లైంగిక వేధింపుల కేసు ఆరోపణలు జానీ మాస్టర్ ను వివాదాల ఉచ్చు లోకి నెట్టేశాయి.. కొరియోగ్రాఫర్ గానే కాదు.. డ్యాన్సర్స్ అస్సోసియేషన్ కి ఆయన ప్రెసిడెంట్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యం లో ఆయనను తాత్కాలికంగా ఆ పదవి నుంచి తొలగిస్తున్నట్లు ఫిలిం ఛాంబర్ నిర్ణయం తీసుకుంది. విచారణ పూర్తి అయ్యేవరకు ఆయనను తొలించినట్లు ఓ నోట్ లో పేర్కొంది.
జానీ మాస్టర్ పై కేసు పెట్టడం పై హీరో హస్తం..
శ్రేష్ఠి వర్మ లాంటి చిన్న అసిస్టెంట్ డ్యాన్సర్ కి జానీ మాస్టర్ లాంటి కొరియోగ్రాఫర్ పై పోలీస్ కేసు పెట్టేంత ధైర్యం ఉండదు. అయితే మాస్టర్ చెప్పినట్లు చూస్తే ఆమెకు పెళ్ళైంది. కానీ ఇప్పుడు ఈ కేసు తెరమీదకు రావడం పై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కేసు వెనుక ఓ స్టార్ హీరో హస్తం ఉందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. కొన్ని గొడవల్లో ఆయనకు వ్యతిరేకంగా మాస్టర్ ఉండటంతోనే కావాలనే ఇరికించినట్లు వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఆ వార్తల్లో నిజమేంత ఉందో తెలియాలంటే.. కేసు విచారణ అయ్యేవరకు వెయిట్ చెయ్యాల్సిందే. ప్రస్తుతం పోలీసులు మాస్టర్ ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని టాక్.. ఇంకా ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి..