BigTV English

Mitchell Starc Retirement: ఆస్ట్రేలియాకు ఎదురు దెబ్బ… డేంజర్ బౌలర్ మిచెల్ స్టార్క్ రిటైర్మెంట్

Mitchell Starc Retirement: ఆస్ట్రేలియాకు ఎదురు దెబ్బ… డేంజర్ బౌలర్ మిచెల్ స్టార్క్ రిటైర్మెంట్
Advertisement

Mitchell Starc Retirement: ఆస్ట్రేలియా జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టుకు సంబంధించిన స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ కు షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తాజాగా వెల్లడించాడు మిచెల్ స్టార్క్. అయితే కేవలం అంతర్జాతీయ టి20 లకు మాత్రమే రిటైర్మెంట్ ఇస్తున్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన చేశాడు మిచెల్ స్టార్క్. టెస్టులు అలాగే వన్డేలపై ఫోకస్ చేసేందుకు t20 లకు గుడ్ బై చెబుతున్నట్లు ఈ సందర్భంగా స్పష్టం చేశాడు. టీమిండియాతో టెస్ట్ టూర్, యాషెస్ సిరీస్, 2027 వన్డే వరల్డ్ కప్ తనకు ముఖ్యమని.. వాటి పైన ఫోకస్ పెట్టేందుకు రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించాడు.


Also Read: David Warner : మహేష్ బాబు-రాజమౌళి సినిమాలో విలన్ గా ఆస్ట్రేలియా క్రికెటర్ వార్నర్?

టెస్ట్ క్రికెట్ కే నా మొదటి ప్రాధాన్యత


అంతర్జాతీయ టి20 క్రికెట్కు గుడ్ బై చెప్పిన ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు మిచెల్ స్టార్క్ (Mitchell Starc ) కు ఆసక్తికర పోస్ట్ పెట్టారు. టెస్ట్ క్రికెట్ కే తన మొదటి ప్రాధాన్యత ఉంటుందని.. ఇందులో ఏ మాత్రం డౌట్ లేదని వెల్లడించారు. వన్డే అలాగే టెస్టుల్లో ఫోకస్ పెట్టేందుకు మాత్రమే టి20 లకు రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు వెల్లడించారు. తాను ఆడిన ప్రతి టి20 మ్యాచ్ ను ఎంతో ఆస్వాదించినట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. ముఖ్యంగా 2021 వరల్డ్ కప్ మ్యాచ్లు అంటే తనకు చాలా ఇష్టమని ఈ సందర్భంగా వెల్లడించారు మిచెల్ స్టార్క్.

టీమిండియాతో టెస్ట్ మ్యాచ్ లు అలాగే ఇంగ్లాండ్ తో యాషెస్, 2027 వన్డే వరల్డ్ కప్ కోసం.. ఇప్పటి నుంచి కసరత్తులు ప్రారంభించినట్లు ఈ సందర్భంగా ప్రకటన చేశారు మిచెల్ స్టార్క్ (Mitchell Starc ). ఇప్పటి నుంచే సిద్ధం కావాలన్న నేపథ్యంలో టి20 మ్యాచ్లకు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు వివరించాడు. 2026 t20 వరల్డ్ కప్ త్వరలోనే…… జరగనుంది. కాబట్టి తన స్థానంలో యంగ్ స్టార్లకు ఛాన్స్ ఇవ్వాలి.. తన స్థానంలో వేరే ప్లేయర్ ఆడాలి అని.. మిచెల్ స్టార్క్.

టి20 లో అరుదైన రికార్డు సాధించిన మిచెల్ స్టార్క్ (Mitchell Starc )

ఇప్పటి వరకు మిచెల్ స్టార్క్ కు మొత్తం 65 t20 మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. 2021 t20 వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో కూడా సభ్యుడిగా ఇతడు ఉన్నాడు. మొన్న 2024 t20 వరల్డ్ కప్ లో కూడా మెరిశాడు. ఇప్పటివరకు 65 t20 మ్యాచ్లలో 23.85 తో మొత్తం 79 వికెట్లు పడగొట్టగలిగాడు. అదే సమయంలో వన్డేల్లో 127 మ్యాచులు ఆడి 244 వికెట్లు తీయగలిగాడు. 100 టెస్టులు ఆడి మొత్తం 42 వికెట్లు పడగొట్టాడు. ఇక అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఇప్పటి వరకు 65 వికెట్లు పడగొట్టాడు మిచెల్ స్టార్క్.

Also Read: IND Vs PAK : ఆసియా కప్ లో పాక్ vs ఇండియా మ్యాచ్ షెడ్యూల్ లో మార్పు.. కొత్త టైమింగ్ ఇదే

 

Related News

IND VS AUS: టీమిండియా కొంప‌ముంచిన వ‌రుణుడు..పెర్త్ లో ఆసీస్ విక్ట‌రీ

Smriti Mandhana Wedding: పెళ్లి చేసుకోబోతున్న లేడీ కోహ్లీ…వ‌రుడు ఎవ‌రో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

IND VS AUS: 26 ఓవ‌ర్ల‌కు మ్యాచ్ కుదింపు..చెమ‌టోడ్చిన టీమిండియా..ఆసీస్ టార్గెట్ ఎంతంటే

IND VS AUS: భారీ వ‌ర్షం, 35 ఓవ‌ర్ల‌కు మ్యాచ్ కుదింపు..Popcorn తింటూ రోహిత్‌, గిల్ రిలాక్స్‌

IND vs AUS: RO-KO అంటూ జాకీలు పెట్టి లేపారు..కంగారుల ముందు మాత్రం తోక ముడిచారు !

IND VS AUS 1st ODI: టాస్ గెలిచిన ఆసీస్..ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..జ‌ట్ల వివ‌రాలు ఇవే

INDW vs ENGW: ఇవాళ ఇంగ్లండ్ తో డూ ఆర్ డై.. ఓడితే టీమిండియా ఇంటికేనా ?

IND VS AUS 1st ODI: నేడే ఆస్ట్రేలియాతో తొలి వన్డే..వ‌ర్షం ప‌డే ఛాన్స్‌.. టైమింగ్స్‌,ఉచితంగా చూడాలంటే

Big Stories

×