BigTV English

Rain Alert: రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు.. బయటకు వెళ్లారో ముంచేస్తుంది.

Rain Alert: రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు.. బయటకు వెళ్లారో ముంచేస్తుంది.

Rain Alert: తెలంగాణకు మరోసారి వాన గండం పొంచి ఉంది. రాగల నాలుగు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సగటున సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని.. ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి వైపునకు వంగి ఉందని.. దాని ప్రభావంతో రాబోయే 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర ఒడిశా తీర ప్రాంతం, వాయువ్య బంగాళాఖాతంలో సగటున సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల విస్తరించి ఉందని.. మయన్మార్‌ తీరం నుంచి ఉత్తర ఒడిశా వరకు ఉన్న ద్రోణితో కలిసిపోయిందని వాతావరణశాఖ వివరించింది.


తెలంగాణలో బిగ్ రెయిన్ అలర్ట్..
ఈ క్రమంలో తెలంగాణలో మంగళవారం కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, భూపాలపల్లి, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబాబాద్‌, ములుగు, నిర్మల్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్‌ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. జనగాం, ఆదిలాబాద్‌, కామారెడ్డి, జనగాం, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, మెదక్‌, నల్గొండ, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

అ ఒక్క రోజూ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు..
బుధవారం కొత్తగూడెం, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతాయని అంచనా వేసింది. ఆదిలాబాద్‌, హన్మకొండ, కామారెడ్డి, ఖమ్మం, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, మెదక్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి, సంగారెడ్డి, వరంగల్‌ జిల్లాల్లో భారీ వర్షాలుంటాయని హెచ్చరించింది. ఈ నెల 4న రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.


ఏపీకి మరో వానగండం..
ఏపీలో ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ క్రమంలో విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అంతేకాకుండా పార్వతీపురం, శ్రీకాకుళం, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రేపటి వరకు వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని సూచించారు. ప్రజలు బయటకి వెళ్లకూడదనీ..అత్యవసర సమయాల్లో మాత్రమే వెళ్లాలని అధికారులు తెలిపారు. అంతేకాకుండా లోతట్టు ప్రాంత ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Related News

BRS Politics: కవిత మేటర్ కేసీఆర్ చేతుల్లో..మళ్లీ అదే ఫార్ములా

CBI Enquiry: కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వైరీ.. జరగబోయేది ఇదేనా?

Harish Rao: విదేశాలకు ఆరడుగుల బుల్లెట్, టూర్ వెనుక అసలు కథేంటి?

KTR: హరీష్ రావుపై కవిత ఆరోపణలు.. కేటీఆర్ సంచలన ట్వీట్

Bathukamma Festival: గిన్నిస్ బుక్ లోకి బతుకమ్మ..! ఆ ఆలోచన తనకు రాలేదని కవితమ్మ బాధ

Big Stories

×