BigTV English

OTT Movie : అద్దాల ఇంట్లో అనాథ పిల్లలు… అడుగడుగునా ఆరాచకమే… అబ్బాయిని కట్టేసి అలాంటి పనులా భయ్యా

OTT Movie : అద్దాల ఇంట్లో అనాథ పిల్లలు… అడుగడుగునా ఆరాచకమే… అబ్బాయిని కట్టేసి అలాంటి పనులా భయ్యా
Advertisement

OTT Movie : సస్పెన్స్‌తో నిండిన ఒక థ్రిల్లర్‌ సినిమాని చూడాలనుకుంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా బెస్ట్ సజెషన్ గా చెప్పుకోవచ్చు. ఈ సినిమా చివరి వరకు సీట్ ఎడ్జ్ థ్రిల్ ని ఇస్తుంది. ఈ స్టోరీ తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు అనాధ పిల్లల చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …


ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే

‘ది గ్లాస్ హౌస్ (The glass house) 2001లో విడుదలైన అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం. డేనియల్ సాక్‌హీమ్ దర్శకత్వంలో రూపొందింది. ఇందులో లీలీ సోబియస్కీ (రూబీ బేకర్), డయాన్ లేన్ (ఎరిన్ గ్లాస్), స్టెల్లన్ స్కార్స్‌గార్డ్ (టెర్రీ గ్లాస్), ట్రెవర్ మోర్గాన్ (రెట్ బేకర్), బ్రూస్ డెర్న్ (ఆల్విన్ బెగ్లీటర్), కాథీ బేకర్ (నాన్సీ ర్యాన్) నటించారు. ఇది 2001సెప్టెంబర్ 14న సోనీ పిక్చర్స్ ద్వారా థియేటర్లలో విడుదలై, 106 నిమిషాల రన్‌టైమ్‌తో IMDbలో 5.8/10 రేటింగ్ పొందింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ, యూట్యూబ్, ఫండాంగో ఎట్ హోమ్, గూగుల్ ప్లే లో అందుబాటులో ఉంది.


స్టోరీలోకి వెళ్తే

16 ఏళ్ల రూబీ బేకర్, ఆమె 11 ఏళ్ల సోదరుడు రెట్ తల్లిదండ్రులు ఒక కారు యాక్సిడెంట్‌లో చనిపోవడంతో అనాథలవుతారు. వారి తల్లిదండ్రుల స్నేహితులు, డాక్టర్ ఎరిన్ గ్లాస్, హై-ఎండ్ కార్ డీలర్ టెర్రీ వీళ్ళిద్దరికీ గార్డియన్స్‌గా నియమించబడతారు. వీళ్ళు మాలిబులోని ఆధునిక గ్లాస్ హౌస్‌లోకి మారతారు. అక్కడ రూబీకి లగ్జరీ జీవితం, రెట్‌కు వీడియో గేమ్స్, బొమ్మలు ఆఫర్ చేయబడతాయి. కానీ రూబీకి త్వరలోనే అనుమానాలు మొదలవుతాయి. టెర్రీ ఆమెతో అసౌకర్యంగా సన్నిహితంగా ప్రవర్తిస్తాడు. ఎరిన్ డ్రగ్ యాడిక్ట్‌లా కనిపిస్తుంది. ఆ ఇంట్లో వింత పరిస్థితులు గమనిస్తుంది. రూబీ తమ కుటుంబానికి చెందిన $4 మిలియన్ ట్రస్ట్ ఫండ్ గురించి తెలుసుకుంటుంది. టెర్రీ దానిని దుర్వినియోగం చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు, వారి తల్లిదండ్రుల యాక్సిడెంట్ వెనుక అతని పాత్ర కూడా ఉందని అనుమానిస్తుంది. రూబీ తన సోదరుడితో కలిసి గ్లాస్ దంపతుల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ వారి ప్రయత్నాలు విఫలమవుతాయి.

రూబీ ఫ్యామిలీ లాయర్ ఆల్విన్, సోషల్ వర్కర్ నాన్సీకి చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కానీ టెర్రీ కుట్రలు ఆమెను మరింత ప్రమాదంలో పడేస్తాయి. ఈ సమయంలో టెర్రీకి భారీగా అప్పులు ఉన్నాయని, ఎరిన్ ఆసుపత్రి నుండి డ్రగ్స్ దొంగిలిస్తున్నదని తెలుసుకుంటుంది. ఇప్పుడు ఎరిన్ డ్రగ్ ఓవర్‌డోస్‌తో ఆత్మహత్య చేసుకుంటుంది. ఆతరువాత టెర్రీ వీళ్ళను ఒక బేస్‌మెంట్‌లో బంధిస్తాడు. చివరికి రూబీ, టెర్రీని ఎదిరించి, తన సోదరుడితో కలిసి తప్పించుకునేందుకు తెలివిగా ప్లాన్ చేస్తుంది. మరి వీళ్ళు అక్కడి నుంచి సేఫ్ గా తప్పించుకుంటారా ? టెర్రీ కుట్రలు బయటపడతాయా ? అనే విషయాలను ఈ సినిమాని చూసి తెలుసుకోండి.

Read Also : రాత్రయితే క్రూరంగా మారే ముసలి భర్త… మొగుడి కళ్లు గప్పి పెయింటర్ తో యవ్వారం… ఈ మూవీ పెద్దలకు మాత్రమే

Related News

OTT Movie : 8 ఏళ్ల తరువాత థియేటర్లలోకి… నెలలోపే ఓటీటీలోకి 170 కోట్ల హిలేరియస్ కోర్ట్ రూమ్ డ్రామా

OTT Movie : జంప్ అవ్వడానికి ట్రై చేసి అడ్డంగా బుక్… ఇష్టం లేకుండానే ఆ పని… తెలుగు మూవీనే మావా

OTT Movie : అనుకున్న దానికంటే ముందుగానే ఓటీటీలోకి ‘కాంతారా చాఫ్టర్ 1’… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

OTT Movie : ధృవ్ విక్రమ్ ‘బైసన్’కు ఓటీటీ ఫిక్స్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

OTT Movie : దీపావళికి ఓటీటీలో టపాసుల్లాంటి మూవీస్… వీకెండ్లో ఈ సినిమాలు, సిరీస్ లు డోంట్ మిస్

OG OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న ఓజీ… ఎప్పుడంటే!

K-Ramp: ఓటీటీ హక్కులు వారికే.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

OTT Movie : సీరియల్ కిల్లర్ ను పరుగులు పెట్టించే క్రైమ్ నావలిస్ట్ కొడుకు… శాటిస్ఫైయింగ్ క్లైమాక్స్ ఉన్న క్రైమ్ థ్రిల్లర్

Big Stories

×