OTT Movie : మలయాళం సినిమాలకి మంచి గిరాకీ ఉంది. ఈ సినిమాలను ఓటీటీ సంస్థలు పోటీపడి దక్కించుకుంటున్నాయి. ప్రేక్షకుల ఆదరణ పెరుగుతుండటంతో ఈ సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా 4.5 గ్యాంగ్ గా పిలువబడే స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. కామెడీతో కడుపుబ్బ నవ్వించే ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకివెళ్తే ..
సోనీ లివ్ లో స్ట్రీమింగ్
‘ది క్రానికల్స్ ఆఫ్ ది 4.5 గ్యాంగ్’ (The Chronicles of the 4.5 Gang) 2025లో విడుదలైన మలయాళ క్రైమ్ కామెడీ వెబ్ సిరీస్. ఇది కృషాండ్ దర్శకత్వంలో రూపొందింది. ఇందులో సంజు శివరామ్ (అరికుట్టన్), జగదీష్ (మైత్రేయన్), స్రీనాథ్ బాబు (కంజి), శంభు (మణియన్), నిరంజ్ మణియన్‌పిళ్ల రాజు (అల్తాఫ్), సచిన్ జోసెఫ్ (మూంగ), దర్శన రాజేంద్రన్ నటించారు. ఈ సిరీస్ 6 ఎపిసోడ్‌లతో 2025 ఆగస్టు 29న సోనీ లివ్, OTTప్లేలో విడుదలై IMDbలో 7.8/10 రేటింగ్ పొందింది.
స్టోరీలోకి వెళ్తే
అరికుట్టన్, కంజి, మణియన్, అల్తాఫ్, మూంగ అనే ఐదుగురు స్నేహితులు, తిరువంచిపురంలోని థడిప్పలం అనే గుడిసెల ప్రాంతంలో పెరుగుతారు. వీళ్ళంతా స్థానిక ఆలయ ఉత్సవాన్ని నిర్వహించి గౌరవం సంపాదించాలని కలలు కంటారు. వీళ్ళను అందరూ “4.5 గ్యాంగ్”గా పిలుస్తుంటారు. మూంగ శారీరక లోపం (డ్వార్ఫిజం) కారణంగా ఈ పేరు వస్తుంది. వీళ్ళు పాలు, పూల మాఫియాలోకి దిగుతారు. అయితే వీరి అమాయక కలలు వాళ్ళని చిన్న చిన్న నేరాల వైపు నడిపిస్తాయి. కొన్ని సంవత్సరాల తరువాత 2018లో ఒక పరిణతి చెందిన అరికుట్టన్ తన గతాన్ని తిరిగి రాయడానికి మైత్రేయన్ అనే రచయితను కలుస్తాడు. ఈ కథ రెండు కాలపరిమితులలో నడుస్తుంది. 2000 ప్రారంభంలో గ్యాంగ్ టీనేజ్ డేస్, 2018లో అరికుట్టన్ వివరణతో ఈ సిరీస్ ఆసక్తికరంగా సాగుతుంది.
ఈ సిరీస్ అరికుట్టన్ అతని గ్యాంగ్ జీవితాలను, చిన్న చిన్న విజయాలు, నేర జీవితంలోని గందరగోళ పరిస్థితిని చూపిస్తుంది. మణియన్ సంగీతంపై ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తిగా, కంజి మోహమాటస్తుడిగా , మూంగ తెలివైన వ్యక్తిగా, అల్తాఫ్ సంయమనంతో కూడిన వ్యక్తిగా తమ పాత్రల్లో లీనమవుతారు. ఈ కథలో రమణి (దర్శనా రాజేంద్రన్) వంటి పాత్రలు ప్రతీకారం కోసం ప్రవేశిస్తాయి, ఇది ఈ గ్యాంగ్ జీవితాలను మరింత ప్రమాదంలో పడేస్తుంది. చివరికి ఈ గ్యాంగ్ ఎలాంటి లైఫ్ ని గడుపుతారు ? అరికుట్టన్ ఈ కథని ముగిస్తాడా ? ఈ సినిమా క్లైమాక్స్ ఎలా వుంటుంది ? అనే విషయాలను, ఈ మలయాళ క్రైమ్ కామెడీ వెబ్ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : ఈమె అమ్మాయా ఆడ పిశాచా? ఇంత కరువులో ఉందేంటి భయ్యా… సింగిల్స్ కు ఎంజాయ్ పండగో