BigTV English

Trisha Krishnan: స్టార్ హీరోతో ఎఫైర్.. పొలిటికల్ ఎంట్రీ కోసమా.. ఎంత పెద్ద స్కెచ్.. ?

Trisha Krishnan: స్టార్ హీరోతో ఎఫైర్.. పొలిటికల్ ఎంట్రీ కోసమా.. ఎంత పెద్ద స్కెచ్.. ?

Trisha Krishnan:  స్టార్ హీరోయిన్ త్రిష గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోయిన్ కు ఫ్రెండ్ గా  కెరీర్ ను మొదలుపెట్టిన ఆమె సోలో హీరోయిన్ గా తెలుగులో వర్షం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాహాతోనే భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తరువాత త్రిష పేరు టాలీవుడ్ లో మారుమ్రోగిపోయింది. సీనియర్, జూనియర్ అని లేకుండా స్టార్ హీరోలందరితో కలిసి నటించింది.


చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్.. ఇలా అందరి సరసన నటించి మెప్పించింది. కొత్త హీరోయిన్ల రాకతో  ఈ చిన్నది కోలీవుడ్ కు వెళ్ళిపోయింది. అక్కడ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ.. అడపాదడపా తెలుగులో కూడా వాటిని రిలీజ్ చేస్తూ వచ్చింది. ఇక  96 సినిమాతో మరోసారి త్రిష ట్రాక్ ఎక్కింది. వయస్సు పెరిగేకొద్దీ ఆమె అందం ఇంకా పెరుగుతూ రావడంతో అమ్మడి బ్యూటీ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అలా కోలీవుడ్ లో మరోసారి త్రిష బిజీ హీరోయిన్ గా మారింది.

ఇక తెలుగులో త్రిష విశ్వంభర సినిమాతో రీఎంట్రీ ఇవ్వనుంది. సినిమాల విషయం పక్కన పెడితే.. వివాదాల్లో త్రిష ఎప్పుడు ముందే ఉంటుంది. ఎంగేజ్ మెంట్ చేసుకొని పెళ్లి క్యాన్సిల్ చేయడం.. స్టార్ హీరోలతో ఎఫైర్స్.. ఇలా ఒకదాని తరువాత ఒకటి వస్తూనే ఉన్నాయి. గత కొన్ని నెలలుగా త్రిష, స్టార్ హీరో విజయ్ తో రిలేషన్ లో ఉందని  టాక్ నడుస్తోంది. విజయ్ ఎక్కడ ఉంటే త్రిష అక్కడ కనిపిస్తుంది. అతను నటించిన ది గోట్ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో మెరిసింది.


Sivakarthikeyan: అలాంటి సీన్స్ నేను చేయను.. ఒకవేళ చేయాల్సి వస్తే..

షూటింగ్ సమయంలో ఓకే కానీ.. షూటింగ్ లేనప్పుడు కూడా ఈ జంట చెట్టాపట్టాలేసుకొని కనిపిస్తున్నడడంతో  వీరి మధ్య ఏదో నడుస్తుందని కోలీవుడ్ మీడియా కోడి కూస్తోంది. ఇక సినిమా కెరీర్ కు ముగింపు పెట్టి విజయ్ రాజకీయాల్లోకి వస్తున్న విషయం విదితమే. తమిళగ వెట్రి కళగం అనే పార్టీని స్థాపించిన విజయ్.. 2026 ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఈ నేపథ్యంలోనే  ఈ పార్టీతోనే త్రిష  కూడా పొలిటికల్ ఎంట్రీ ఇస్తుందని టాక్ నడుస్తోంది. కొన్నేళ్ల నుంచి త్రిష పొలిటికల్ ఎంట్రీ అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. వాటిని ఆమె కొట్టిపారేస్తూనే ఉంది. కానీ, ఈసారి మాత్రం త్రిష.. తనకు సీఎం అవ్వాలని ఉందని చెప్పి షాక్ ఇచ్చింది.

ఇక అమ్మడు మాటలకు అర్ధం త్వరలోనే రాజకీయ ఎంట్రీ ఉండబోతోందనే అని అనుకుంటున్నారు నెటిజన్స్.  సినిమాలకు గుడ్ బై చెప్పి  పూర్తిగా రాజకీయాలకే అంకితం కానున్నదట.అంతేకాకుండా  దీనికోసమే విజయ్ తో రిలేషన్ లో ఉంటుందనే మాట వినిపిస్తుంది. విజయ్ తో ఎఫైర్ గురించి ఆమె ఇప్పటివరకు స్పందించిందిలేదు. విజయ్ సైతం త్రిష గురించి మాట్లాడింది లేదు.  అయితే విజయ్ తన భార్యతో విడిగా ఉంటున్నాడని, దానికి కారణం త్రిషనే అని కోలీవుడ్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. విజయ్ తో త్రిష ఉండడానికి కారణం కేవలం పొలిటికల్ ఎంట్రీ కోసమే అనే మాట నిజమే అని చెప్పుకొస్తున్నారు.

ఇక ఈ వార్త విన్న అభిమానులు త్రిష  నటించిన ధర్మయోగి సినిమాను గుర్తుచేసుకుంటున్నారు. అందులో కూడా ధనుష్  పార్టీలో చేరడానికి ప్రేమ నాటకమాడి.. అతడిని మోసం చేసి సీఎం అవ్వాలని ప్రయత్నిస్తుంటుంది. చివరికి ధనుష్ ను సైతం చంపేసి రాజకీయంగా ఎదుగుతుంది. ఆ సినిమాలానే బయట కూడా రాజకీయ ఎంట్రీ కోసమే విజయ్ తో ఎఫైర్ పెట్టుకొని ఉంటుందని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×