Khushi Kapoor: అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా ఇప్పటికే జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో హీరోయిన్‌గా అడుగుపెట్టి మంచి గుర్తింపు సాధించింది. ఇప్పుడు తన చెల్లెలు ఖుషి కపూర్ వంతు వచ్చేసింది. జాన్వీ హీరోయిన్‌గా పరిచయమయ్యి చాలాకాలం అయినా ఖుషి మాత్రం తన డెబ్యూ చేయడానికి కాస్త సమయం తీసుకుంది. కొన్నిరోజుల క్రితం నెట్‌ఫ్లిక్స్‌లో నేరుగా విడుదలయిన ‘ది ఆర్చీస్’ అనే వెబ్ మూవీతో మొదటిసారి తనలోని నటిని బయటపెట్టింది ఖుషి. కానీ ఆ మూవీ, అందులో ఖుషి యాక్టింగ్‌పై విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. దీంతో తన డెబ్యూ మూవీ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటోంది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తన పర్సనల్ లైఫ్ గురించి కూడా బయటపెట్టింది.
ప్రపోజల్ జరగలేదు
జునైద్ ఖాన్ (Junaid Khan), ఖుషి కపూర్ (Khushi Kapoor).. ఈ ఇద్దరు స్టార్ కిడ్స్ ఇంతకు ముందు వెబ్ ఫిల్మ్స్‌లో కనిపించినా.. వెండితెరపై కనిపించడానికి మొదటిసారి సిద్ధమవుతున్నారు. ఈ ఇద్దరు జంటగా తెరకెక్కిన ‘లవ్‌యాపా’ మూవీ త్వరలోనే విడుదలకు సిద్ధమవుతుండగా.. దాని ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఖుషి కపూర్.. తన రిలేషన్‌షిప్‌లోని సీక్రెట్‌ను బయటపెట్టేసింది. ఇప్పటికే ‘జిగ్రా’ యాక్టర్ వేదాంగ్ రైనాతో ఖుషి కపూర్ ప్రేమలో ఉందని బాలీవుడ్‌లో రూమర్స్ వినిపిస్తుండగా.. అసలు తన జీవితంలో ప్రపోజల్ అనేదే జరగలేదని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది ఖుషి కపూర్.
రిలేషన్‌లో ఉన్నారా లేదా
తన లైఫ్‌లోని ఎలాంటి రొమాంటిక్ మూమెంట్‌ను ఫోటో తీసి పెట్టుకోవాలని ఉందంటూ ఖుషి కపూర్‌కు ప్రశ్న ఎదురయ్యింది. ‘‘అలాంటి అవసరం ఏమీ లేదు. కానీ ఒక విషయం ఎంచుకోవాలని అంటే ప్రపోజల్ అని చెప్తా. నాకు ఇంకెవ్వరూ ప్రపోజ్ చేయలేదు’’ అని చెప్పుకొచ్చింది ఖుషి. అయితే ప్రపోజ్ చేయకుండానే వేదాంగ్ రైనా (Vedanga Raina)తో రిలేషన్ మొదలుపెట్టిందా అంటూ ప్రేక్షకుల్లో అనుమానాలు మొదలయ్యాయి. అంతే కాకుండా అసలు వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నది కేవలం రూమార్సేనా లేక నిజమా అనేది అర్థం కాక అయోమయంలో పడ్డారు. కానీ వీరి సోషల్ మీడియాను గమనిస్తే మాత్రం ఖుషి, వేదాంగ్ రిలేషన్‌లో ఉన్నారనే అనిపిస్తుంది.
Also Read: ఆ దర్శకుల వల్లే ఇలా జరిగింది, అందుకే సినిమాలు చేయట్లేదు.. సమంత షాకింగ్ స్టేట్‌మెంట్
ట్రోలింగ్ మొదలు
శ్రీదేవి వారసురాళ్లు కాబట్టి జాన్వీ, ఖుషిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కానీ జాన్వీ కపూర్ మొదట్లో తనపై ఉన్న అంచనాలను అందుకోలేక ఎంతో నెగిటివిటీ ఎదుర్కుంది. తన చెల్లెలు ఖుషికి కూడా అదే సలహా ఇచ్చింది. ఇక ఖుషి కూడా తన వెబ్ ఫిల్మ్ ‘ది ఆర్చీస్’తో చాలా ట్రోల్ అయ్యింది. తాజాగా తన మొదటి మూవీ ‘లవ్‌యాపా’ (Loveyapa) ట్రైలర్ విడుదలయిన తర్వాత కూడా ఖుషి యాక్టింగ్ చాలామందికి నచ్చలేదు. ఇక ‘లవ్ టుడే’ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాకు రీమేక్ కాబట్టి అందులో యాక్టర్స్ యాక్టింగ్‌ను ఇందులో యాక్టర్స్ యాక్టింగ్‌తో పోల్చుకుంటారు. ఫిబ్రవరి 7న ‘లవ్‌యాపా’ మూవీ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమయ్యింది.