BigTV English

Sivakarthikeyan: అలాంటి సీన్స్ నేను చేయను.. ఒకవేళ చేయాల్సి వస్తే..

Sivakarthikeyan: అలాంటి సీన్స్ నేను చేయను.. ఒకవేళ చేయాల్సి వస్తే..

Sivakarthikeyan: సినిమా అంటే మూడుగంటలు ఎంటర్టైన్మెంట్ అని మాత్రమే అందరికి తెలుసు. కానీ, ఆ సినిమాను నిర్మించడానికి   చిత్ర బృందం పడే కష్టం చాలా అతక్కువ మందికి తెలుసు. ముఖ్యంగా హీరోలు కోట్లు కోట్లు  రెమ్యూనరేషన్స్ తీసుకుంటారనే విమర్శలు వస్తూఉంటాయి. కానీ, పాత్ర కోసం వారిని వారు మలుచుకొనే విధానం ఎవరికి తెలియదు.


ఒక సినిమాలో హీరో పాత్ర కోసం ఏ అలవాటు అయినా చేసుకోవాలి.. ఆ పాత్రకు తగ్గట్టు బరువు తగ్గాలి.. ఒక్కోసారి పెరగాలి. జుట్టు పెంచాలి. బాడీని బిల్డ్ చేయాలి. మందు తాగాలి.. సిగరెట్ తాగాలి. ఇలా ఒకటి అని చెప్పలేం. పాత్ర డిమాండ్ చేస్తే ఏది చేయడానికి అయినా సిద్ధంగా ఉండాలి. అంత కష్టపడితేనే థియేటర్ లో హీరోల ఫ్యాన్స్ ను మెప్పించగలరు.

అయితే ఇండస్ట్రీలో ఉన్నవారందరూ.. మందు తాగుతారు.. సిగరెట్స్ తాగుతారు అనే అపోహ ఉంది. కానీ, చాలామంది  హీరోలకు బయట మందు, సిగరెట్ అలవాటు లేదు. ఇంకా చెప్పాలంటే.. ఒక స్టార్ హీరో.. ఇప్పటివరకు ఒక్క స్మోకింగ్ సీన్  లో కూడా కనిపించలేదు అంటే అతిశయోక్తి కాదు. ఆ స్టార్ హీరో ఎవరో కాదు శివకార్తికేయన్. యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి.. చిన్న పాత్రలతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చి హీరోగా మారాడు శివకార్తికేయన్.  ఆయన నటించిన రెమో సినిమా తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా  భారీ విజయాన్ని అందుకుంది.


ఇక ఈ సినిమా తరువాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. గతేడాది అమరన్ సినిమాతో ప్రేక్షకుల హృదయాలతో పాటు రికార్డులను కూడా కొల్లగొట్టిన శివకార్తికేయన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఈ నేపథ్యంలోనే శివకార్తికేయన్ ఒక ఇంటర్వ్యూలో స్మోకింగ్ సీన్స్ గురించి మాట్లాడాడు.

సొంత ప్రొడక్షన్ హౌస్ పెట్టి నిర్మాతలుగా మారిన హీరోలు వీరే..

” నేను ఇప్పటివరకు ఆన్ స్క్రీన్ కానీ, ఆఫ్ స్క్రీన్ కానీ  స్మోక్ చేయలేదు. సినిమాలో కూడా చేయాలనీ అనుకోవడం లేదు. ఒకవేళ దర్శకుడు స్మోక్ చేయాలి అని అంటే కనుక.. ఆ పాత్రకు ఉన్న  ప్రాధాన్యత బట్టి నేను స్మోక్ చేస్తాను. ఆ సీన్ లో నేను స్మోక్ చేయడం వలన సినిమాకు బలం  చేకూరుతుంది అంటే అప్పుడు చేస్తాను.  నా సినిమా చూడడానికి కుటుంబాలు వస్తారు.. పిల్లలు వస్తారు.  అలా నేను నటించే సీన్ వలన వారికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు.

స్మోకింగ్ సీన్ కు ప్రాధాన్యత లేకుండా అనవసరంగా ఇరికించినట్లు ఉంటే కనుక నిర్మొహమాటంగా చేయను అని డైరెక్టర్స్ కు చెప్పేస్తాను. అలా అని వారి కథల్లో వేలు పెట్టను. వారికి ఇవ్వాల్సిన ఫ్రీడమ్ వారికి ఇస్తాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ వ్యాఖ్యలు విన్న నెటిజన్స్.. మీరు సూపర్  సార్ ఫ్యాన్స్ ఇబ్బందిపడుతున్నారని స్మోకింగ్ సీన్స్ వద్దు అంటున్నారు. కొందరు స్టార్స్ అయితే ఏకంగా సిగరెట్స్, మందు, పాన్ మసాలాలకు యాడ్స్ చేసి మరీ ఎంకరేజ్ చేస్తున్నారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×