E-Paper
Advertisement

VD12: విజయ్ కోసం పవర్ ఫుల్ టైటిల్.. ఏముందిరా మావా..?

VD12: విజయ్ కోసం పవర్ ఫుల్ టైటిల్.. ఏముందిరా మావా..?
Advertisement

VD12: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. లైగర్ పరాజయం తర్వాత ఒక మంచి విజయం కోసం విజయ్ దేవరకొండ ఎంత కష్టపడుతున్నాడు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో విజయ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ, ఈ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది. అయినా విజయ్ వెనక్కి తగ్గకుండా ఎలాగైనా హిట్ కొట్టాలని బాగా కష్టపడుతున్నాడు.

ప్రస్తుతం విజయ్ నటిస్తున్న తాజా చిత్రం వీడి 12. జెర్సీ ఫేమ్ గౌతం తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవరన్నగ వంశీ నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో మొదట శ్రీలీల నటిస్తుంది అని చెప్పుకొచ్చినా.. ఆ తర్వాత ఆమె ప్లేస్ లో భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ మధ్యనే వీడి12 నుంచి విజయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

Advertisement

ఇక ఈ పోస్టర్లో రౌడీ హీరో ఓ రేంజ్ లో కనిపించాడు. గుండుతో రక్తంతో తడిచిన దేహంతో ఎంతో సీరియస్ గా కనిపించాడు. ఇక ఈ సినిమాలో విజయ్ రౌడీ మరియు పోలీస్ గా కనిపించనున్నాడని టాక్ నడుస్తుంది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు మేకర్స్ ఒక పవర్ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.

వీడి 12 కు రుద్ర అనే పవర్ఫుల్ టైటిల్ ను ఖరారు చేసినట్లు టాక్ నడుస్తుంది. త్వరలోనే ఇంకో పోస్టర్ తో ఈ టైటిల్ ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారట. రుద్ర టైటిల్ విజయ్ కు బాగా సెట్ అయిందని, దాన్నే కన్ఫర్మ్ చేయమని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాలంటే మేకర్స్ అధికారికంగా ప్రకటించేంతవరకు ఆగాల్సిందే.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×