Manchu Vishnu: మా ప్రెసిడెంట్ మంచు విష్ణు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మోహన్ బాబు నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన విష్ణు కెరీర్ కొత్తలో బాగానే ఉన్నా ఆ తర్వాత అగమ్య గోచరంగా మారింది. కథ ఎంత బాగున్నా ఆ కుటుంబం మీద వచ్చే ట్రోల్స్ వలన సినిమాలు పరాజయం పాలు అవుతున్నాయి.
ఇక ప్రస్తుతం మంచు విష్ణు కన్నప్ప అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో అన్ని ఇండస్ట్రీలకు సంబంధించిన స్టార్ హీరోలు గెస్ట్ రోల్స్ లో నటిస్తున్నారు. ఇక సినిమాల గురించి పక్కన పెడితే మా ప్రెసిడెంట్ గా మంచు విష్ణు ఎంతో నిజాయితీగా తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు.ఇక ఈ మధ్యనే సినీ ప్రముఖుల గురించి యూట్యూబ్లో అసభ్యకరమైన థంబ్ నెయిల్స్ పెట్టి ట్రోల్స్ చేసే ఛానల్స్ పై మంచు విష్ణు సీరియస్ అయిన విషయం తెలిసిందే.
ఇక తాజాగా మంచు విష్ణు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. నేడు తన కూతురు ఐరా పుట్టినరోజు కావడంతో మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు 10 లక్షల రూపాయలు విరాళంగా అందించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు గా మారాయి. ఇక ఈ డబ్బును మా అసోసియేషన్ లో ఆర్థికంగా వెనుకబడిన నటీనటుల సంక్షేమం కోసం ఉపయోగిస్తామని మా టీం ప్రకటించింది.
ఇకపోతే మంచు విష్ణుకు 2008లో వెరానికా రెడ్డి తో వివాహం జరిగింది వీరికి నలుగురు పిల్లలు ఇద్దరు కవలలు కాగా వారి తర్వాత ఒక బాబు మరో పాప ఉన్నారు. చివరి పాపనే ఐరా విద్య. చిన్నారి పుట్టినరోజున మంచు విష్ణు చేసిన ఈ మంచి పనికి అభిమానులు ఆయనను ప్రశంసిస్తున్నారు.