Jaan say: క్రైమ్ థ్రిల్లర్ ‘జాన్ సే…’ నుండి ప్రణయ్ గా అంకిత్ ఫస్ట్ లుక్

Jaan say: క్రైమ్ థ్రిల్లర్ ‘జాన్ సే…’ నుండి ప్రణయ్ గా అంకిత్ ఫస్ట్ లుక్

Jaan say: క్రైమ్ థ్రిల్లర్ ‘జాన్ సే…’ నుండి ప్రణయ్ గా అంకిత్ ఫస్ట్ లుక్
Share this post with your friends

Jaan say: క్రితి ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1 గా ఎస్. కిరణ్ కుమార్ స్వీయ దర్శకత్వంలో ‘జాన్ సే’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కథ, స్క్రీన్ ప్లే కూడా కిరణ్ కుమార్ అందిస్తున్న ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. యాస్ వైష్ణవి సమర్పిస్తున్న ఈ చిత్రం లో థ్రిల్లింగ్ అంశాలతో పాటు లవ్ స్టొరీ కూడా కీ రోల్ ప్లే చేస్తోంది. యువ జంట అంకిత్, తన్వి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో హీరోగా నటిస్తున్న అంకిత్ ఇంతకముందు జోహార్, తిమ్మరుసు వంటి చిత్రాల్లో నటించగా, హీరోయిన్ తన్వి ఐరావతం సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది.

‘జాన్ సే…’ టైటిల్ లో ఉన్న మూడు డాట్స్ సినిమాలో కీలకమైన ముగ్గురి పాత్రలను ప్రతిబింబిస్తున్నాయి. అందులో మొదటి డాట్, పాత్రను క్రిస్మస్ పర్వదినాన టీం పరిచయం చేశారు. హీరో అంకిత్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ప్రణయ్ పాత్రలో కనిపించే అంకిత్ ఈ చిత్రంలో లవర్ బాయ్ పాత్రలో కనిపిస్తారు. ఉత్కంఠ రేపే థ్రిల్లింగ్ అంశాలతో జాన్ సే… ఆద్యంతం ప్రేక్షకులను అలరించేలా సాగుతుంది. ఈ చిత్రం తప్పకుండా థియేటర్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని దర్శకుడు కిరణ్ కుమార్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు.

ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. భారీ బడ్జెట్‌తో ప్రముఖ సీనియర్ యాక్ట‌ర్స్‌తో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా చిత్రాన్ని లావిష్‌గా తెరకెక్కిస్తున్నారు. జాన్ సే చిత్రానికి సచిన్ కమల్ సంగీతాన్ని అందిస్తున్నారు. జనవరి మొదటి వారంలో ఫస్ట్ సాంగ్‌ను విడుదల చేయనున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేసి సమ్మర్ స్పెషల్‌గా అయిదు భాషల్లో విడుదల చేయనున్నారు.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Prabhas new record : ప్ర‌భాస్ మాత్ర‌మే ఎలా చేయ‌గ‌లిగాడు!

Bigtv Digital

 Sound Party Movie Review : సాలిడ్ ఫన్ రైడ్.. మోత మోగిస్తున్న సౌండ్ పార్టీ..

Bigtv Digital

India Vs West Indies : చివరి టీ20లో టీమిండియా ఓటమి.. సిరీస్ విండీస్ కైవసం..

Bigtv Digital

Japan Movie Review : జపాన్ రివ్యూ.. దీపావళి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందా ?

Bigtv Digital

Telangana: బోగత గలగల.. తెలంగాణలో జలకళ..

Bigtv Digital

Rajamouli SSMB 29 : మ‌హేష్ సినిమా గురించి రాజమౌళి అప్‌డేట్‌

BigTv Desk

Leave a Comment