BigTV English

Tiruchendur Subramanya Swamy : తిరుచెందూర్ సుబ్రహ్మణ్యస్వామి విభూతికి అంత ప్రాధాన్యం ఎలా వచ్చింది

Tiruchendur Subramanya Swamy : తిరుచెందూర్ సుబ్రహ్మణ్యస్వామి విభూతికి అంత ప్రాధాన్యం ఎలా వచ్చింది
Advertisement

Tiruchendur Subramanya Swamy:తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఇచ్చే విభూతికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇది చాలా శక్తివంతమైన క్షేత్రం. ఎటువంటి వారికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే, ఇక్కడ స్వామి విభూతి ప్రసాదంగా తీసుకుంటే అవి తొలగిపోతాయి. సముద్ర తీరంలో కొలువైన సుందరన దివ్య క్షేత్రం మరెక్కడా లేదు. తమిళనాడులో ‎తిరునెల్వేలి నుండి 60 కిలోమీటర్ల దూరంలో సముద్ర తీరాన ఉన్న అద్భుతమైన ఆలయం. సాధారణంగా సుబ్రహ్మణ్య ఆలయాలు అన్నీ కొండ శిఖరాలైప ఉంటాయి. కాని ఈ తిరుచెందూర్లో ఒక్కచోటే స్వామియం సముద్ర తీరంలో కొండ మీద కొలువై ఉన్నాడు.


సుబ్రహ్మణ్య స్వామి వారికీ అభిషేకం చేసినా సుబ్రహ్మణ్య స్తోత్రము సమయంలో ప్రసాదంగా ఇచ్చిన విభూథి ఇంటికి తెచ్చి ఏ మూల పెట్టినా సరే ఇంట్లో నెగిటివ్ శక్తి పోతుంది. ఇంటికి కాంపౌండ్ గోడ ఎంత వరకు ఉన్నదో అంత వరకు భూత ప్రేతములు చూడడానికి కూడా భయ పడిపోయి వెళ్ళిపోతాయి. ఆ విభూథి కి అంతటి శక్తి వుంటుంది. పంచామృతాలతో పాటుగా సుబ్రహ్మణ్యునికి విభూతితో అభిషేకం చేస్తారు. విభూతి జ్ఞానానికి ప్రతీక. స్వామి వారికి అభిషేకం చేసిన విభూతిని, ఒక పన్నీరు చెట్టు ఆకులో మాత్రమే భక్తులకు ప్రసాదంగా ఇస్తారు.

ఈ విషయము ను శ్రీ ఆది శంకరాచార్యుల వారు శ్రీ సుబ్రహ్మణ్య భుజంగంలో ప్రస్తావించారు. విభూథి ఇంట్లోనే ఉంటే పిల్లలకి అనారోగ్యం వస్తే రక్షగా కాపాడుతుంది.. పిల్లల నుదిటి పై మూడు విభూది రేఖలు పెట్టడం అలవాటు చేస్తే, వారికి మంచి ఆలోచనలు వచ్చి శ్రీ సుబ్రహ్మణ్య భక్తులై, వంశమునకు కీర్తి తీసుకు వస్తారని నమ్మకం. ఈ ఆలయం గురించి స్కాంద పురాణములో ఉంది. మనల్ని పట్టి పీడించే కొన్ని దోషాలు ఉంటాయి. మనం తప్పు చేయకోపోయినా నాగ దోషం , కాల సర్ప దోషం వెంటాడుతుంటాయి. ఎక్కడో వంశంలో తప్పు జరుగుతుంది, దాని ఫలితము అనేక విధాలుగా అనుభవిస్తూ ఉండొచ్చు. సంతానం కలుగక పోవడం, కుష్ఠ రోగం మొదలైనవి ఈకోవలోకే వస్తాయని చెబుతున్నారు. అలాంటి దోషాలను కూడా పోగొట్టే సుబ్రహ్మణ్యస్వామి శక్తి ఎంత గొప్పదో సుబ్రహ్మణ్య భుజంగము ద్వారా తెలిపారు.


Related News

Wakeup at Night: రాత్రి ఆ సమయంలో నిద్రలేస్తున్నారా.. దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం మీకు తెలుసా?

Diwali 2025: దీపావళి రోజు ఎన్ని దీపాలు వెలిగించాలి ? ఏ నూనెతో వెలిగిస్తే మంచిది ?

Diwali: భార్య చేసే ఈ ఒక్క ట్రిక్ తో భర్త సుడి తిరగడం ఖాయం.. ఏంటీ ఆ రహస్యం

Diwali 2025: దీపావళి పండగను ఏ రోజు జరుపుకోవాలి ? అక్టోబర్ 20 లేదా 21 నా?

Lord Hanuman: పూరిలో బేడి హనుమాన్‌.. భగవంతునికి ఎందుకు బేడీలు వేశారు?

Eye Twitching: ఏ కన్ను అదిరితే మంచిది ? పురాణాల్లో ఏముంది ?

Vastu Tips: కర్పూరంతో ఈ పరిహారాలు చేస్తే.. ఎలాంటి వాస్తు దోషాలైనా మటుమాయం !

Samantha: సమంత పూజిస్తున్న ఈ అమ్మవారు ఎవరో తెలుసా? ఈ దేవత ఎంత శక్తిమంతురాలంటే ?

Big Stories

×