BigTV English
Advertisement

Today OTT Movies And Series: మీర్జాపూర్ సీజన్ 3తో సహా ఇవాళ ఎన్ని సినిమాలు, సిరీస్‌లు రిలీజ్ అయ్యాయంటే..?

Today OTT Movies And Series: మీర్జాపూర్ సీజన్ 3తో సహా ఇవాళ ఎన్ని సినిమాలు, సిరీస్‌లు రిలీజ్ అయ్యాయంటే..?

New OTT Releases Friday: ప్రతి వారం పలు సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయి ప్రేక్షకుల్ని అలరిస్తూ ఉంటాయి. ఒకప్పుడు థియేటర్లలో పెద్ద హీరోల సినిమాలు మాత్రమే రిలీజ్ అయ్యేవి. కానీ ఈ మధ్య కొత్త కొత్త కంటెంట్‌లతో చిన్న హీరోలు కూడా సినిమాలు తీసి భారీ హిట్లు కొడుతున్నారు. అయితే ఈ వారం థియేటర్లలో ఎలాంటి సినిమా రిలీజ్‌కు నోచుకోలేదు. ఎందుకంటే ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ మూవీ థియేటర్లలో సెన్సేషనల్ టాక్‌తో దూసుకుపోతోంది.


అందువల్లనే ఈ సినిమాకి పోటీగా ఏ కొత్త మూవీ రిలీజ్‌ కాలేదు. కొన్ని చిన్న సినిమాలు ఉన్నా అవి నేరుగా ఓటీటీలో రిలీజ్‌ అయ్యాయి. దీంతో థియేటర్లలో ఒక్క సినిమా మాత్రమే హవా చూపిస్తుండటంతో సినీ ప్రియులు ఓటీటీపై ఫోకస్ పెట్టారు. ఈ వారం ఓటీటీలో ఏ ఏ సినిమాలు, ఏ ఏ సిరీస్‌లు రిలీజ్ అవుతున్నాయో అని తెగ సెర్చ్ చేసేస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా సినిమాలు, సిరీస్‌లు రిలీజ్ కాగా ఇవాళ ఒక్కరోజే 10 స్ట్రీమింగ్‌కు వచ్చాయి. కానీ అందులో చెప్పుకోదగ్గ సినిమాలేవి ఓటీటీలో రిలీజ్‌కు నోచుకోలేదనే చెప్పాలి.

కానీ వెబ్ సిరీస్‌ల విషయానికొస్తే మాత్రం చెప్పుకోదగ్గ సిరీస్ ఒకటుంది. అదే మీర్జాపూర్ సీజన్ 3. యూత్‌లో బాగా క్రేజ్ సంపాదించుకున్న ఈ సిరీస్ ఇప్పుడు మరో సీజన్‌తో వచ్చేసింది. ఈ సిరీస్‌కు సంబంధించిన రెండు పార్టులు బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోయాయి. ముఖ్యంగా ఈ సిరీస్ తెలుగు ఆడియన్స్‌లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది.


Also Read: కళ్యాణ్ రామ్ ‘బింబిసార 2’ నుంచి వశిష్ట అవుట్.. ఆ డైరెక్టర్ చేతికి బాధ్యతలు!

అలాంటి ఈ సిరీస్‌ నుంచి ఇప్పుడు సీజన్ 3 స్ట్రీమింగ్ కావడంతో ఓటీటీ ప్రియులు ఫుల్ హ్యాపీగా ఫిలౌతున్నారు. ఈ సీజన్ 3 సిరీస్‌ ఇవాల అంటే జూలై 5 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. 50 నిమిషాల రన్‌టైమ్‌తో 10 ఎపిసోడ్స్‌తో అందుబాటులోకి వచ్చింది. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సీజన్ 3 సిరీస్ ఆడియన్స్‌ను ఎంతమేర మెప్పిస్తుందో చూడాలి.

ఇవాళ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు, సిరీస్‌లు

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

జూలై 5 – డెస్పరేట్ లైస్ (పోర్చుగీస్ సిరీస్)

జూలై 5 – గోయో (స్పానిష్ సినిమా)

బుక్ మై షో ఓటీటీ

జూలై 5 – ది సీడింగ్ (ఇంగ్లీష్ మూవీ)

జూలై 5 – విజన్స్ (ఫ్రెంచ్ సినిమా)

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

జూలై 5 – మీర్జాపూర్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్)

జియో సినిమా ఓటీటీ

జూలై 5 – హీ వెంట్ దట్ వే(ఇంగ్లీష్ చిత్రం)

Also Read: అదేంటి నాగీ మావా అంత మాట అన్నావ్.. ఎంత ఊహించుకున్నామో తెలుసా..?

ఆహా ఓటీటీ

జూలై 5 – హరా (తమిళ సినిమా)
జూలై 5 – మార్కెట్ మహాలక్ష్మి

సోనీ లివ్ ఓటీటీ

జూలై 5 – మలయాళీ ఫ్రమ్ ఇండియా(మలయాళ మూవీ)

జూలై 5 – మందాకిని (మలయాళ సినిమా)

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×