BigTV English

Jabardast Faima: ఫైమా పెళ్లి ఫిక్స్.. ఆరేళ్ల ప్రేమంటూ వీడియో షేర్.. గుక్కపెట్టి ఏడుస్తున్న ప్రవీణ్..!

Jabardast Faima: ఫైమా పెళ్లి ఫిక్స్.. ఆరేళ్ల ప్రేమంటూ వీడియో షేర్.. గుక్కపెట్టి ఏడుస్తున్న ప్రవీణ్..!

Jabardast Faima: జబర్దస్త్ (Jabardast) షో ద్వారా ఎంతో మంది ఇండస్ట్రీకి వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.అలా ఇప్పటికే జబర్దస్త్ నుండి ఇండస్ట్రీలోకి వచ్చిన బలగం వేణు, ధనాధన్ ధన్ రాజ్,చలాకీ చంటి, హైపర్ ఆది,సుడిగాలి సుధీర్,ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను,షేకింగ్ శేషు, చంద్ర ఇలా ఎంతోమంది ఇండస్ట్రీలో మంచి మంచి పొజిషన్లలో ఉన్నారు. సుడిగాలి సుధీర్,గెటప్ శీను వంటి వాళ్లయితే హీరోలుగా కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అలాగే వేణు ఏకంగా బలగం సినిమాతో డైరెక్టర్ గా మారి ఇండియన్ హిస్టరీనే షేక్ చేశారు. అయితే కేవలం అబ్బాయిలే కాకుండా అమ్మాయిలు కూడా జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయ్యారు. అలాంటి వారిలో శ్రీ సత్య, ఫైమా, రీతూ చౌదరి వంటి వాళ్ళు ఉన్నారు.


అయితే వీరిలో ‘పటాస్ షో’ ద్వారా జబర్దస్త్ లోకి వచ్చిన ఫైమా అందరికీ తెలుసు. పటాస్ ఫైమా (Faima) గా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ, బిగ్ బాస్ లో కూడా సందడి చేసింది. తన గేమ్ తో నాగార్జున (Nagarjuna) ని సైతం మెప్పించింది. అయితే అలాంటి ఫైమాకి ఓ లవ్ స్టోరీ ఉన్న సంగతి మనకు తెలిసిందే. జబర్దస్త్ ప్రవీణ్, పటాస్ ఫైమా లవ్ స్టోరీ గురించి చెప్పనక్కర్లేదు. వీరిద్దరూ చాలా రోజుల నుండి సన్నిహితంగా ఉంటూ ఎన్నో వీడియోలు రిలీజ్ చేసి సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యారు. అయితే సడన్ గా వీరి మధ్య ఏమైందో ఏమో తెలియదు బ్రేకప్ జరిగిపోయింది.ఆ తర్వాత ఫైమా తన బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేస్తూ.. నేను పెళ్లి చేసుకోబోయేది ఇతన్నే అని చెప్పడంతో ఇండస్ట్రీ మొత్తం షాక్ అయింది.

నిన్న మొన్నటి వరకు ప్రవీణ్ తో తిరిగి ఇప్పుడేంటి ఫైమా సడన్ షాక్ ఇచ్చింది అని అందరూ అనుకున్నారు. అయితే పటాస్ ఫైమా ప్రవీణ్ తో వీడియోలు చేయడం, సన్నిహితంగా ఉండడం అది తెర వరకే అని చాలామంది అనుకున్నారు. కానీ అది తెరమీదే కాదు తెర వెనుక కూడా ప్రవీణ్ ఫైమాని ప్రేమించారు అంటూ తాజాగా ఒక వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇక ఆ వీడియో ఏంటంటే.. శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించిన ప్రోమో.. శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించిన ప్రోమో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఆ ప్రోమోలో జబర్దస్త్ ప్రవీణ్ స్టేజ్ మీదే వెక్కివెక్కి ఏడ్చాడు. ప్రవీణ్ మాట్లాడుతూ.. “నేను నా లైఫ్ లో ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాను. కొద్దిరోజులు బాగానే ఉంది.కానీ ఆ తర్వాత నీకు నాకు సెట్ అవ్వదు.. నీ లైఫ్ నువ్వు చూసుకో.. నా లైఫ్ నేను చూసుకుంటానని.. నన్ను వదిలేసింది” అని చెప్పాడు. ఆ తర్వాత ప్రవీణ్ మాట్లాడిన మాటల్ని సస్పెన్స్ లో పెట్టి ఫైమా రియాక్షన్ చూపించారు. అందులో ఫైమా మాట్లాడుతూ.. “నువ్వేం మాట్లాడుతున్నావ్.. నాకు కనీసం అర్థం అవ్వడం లేదు.నన్ను బ్యాడ్ చేయాలని నెగిటివ్ చేయాలనే నువ్వు అలా మాట్లాడుతున్నావ్”.. అంటూ ఫైమా మాట్లాడిన మాటలు చూపించారు.


ఫైమా మాటలకు..” నేను నీ గురించి చెప్పలేదు” అని, నిన్ను అనలేదు అని” ప్రవీణ్ అన్నాడు. దానికి ఫైమా “నాకు పెళ్లి కుదిరింది అని చెప్పాక కూడా.. నువ్వు నా గురించి ఇలా మాట్లాడుతూ నన్ను నెగటివ్ చేస్తున్నావ్. నా జీవితంలో ఇంకోసారి నీతో మాట్లాడను. ఇప్పటినుండి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు” అని ఫైమా అంటుంది.ఇక ఫైమా మాటలకు స్టేజ్ పైనే ప్రవీణ్ వెక్కివెక్కి ఏడ్చాడు. అంతేకాదు ఆమె గురించి నన్ను అడగకండి, నా గురించి ఆమెని అడగకండి అంటూ ప్రవీణ్ ఎమోషనల్ అయిన వీడియోని ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోలో చూపించారు.

అయితే ఇలాంటి ప్రోమోలు ఇప్పటివరకు చాలా ఎపిసోడ్స్ లో చూసాము. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేలా ఇలా కొన్ని ప్రోమోలు వదులుతూ ఉంటారు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు.. ఏం జరిగింది అనే ఆసక్తితో ప్రేక్షకులు చూస్తారు అనే ఉద్దేశంతో ఈ ప్రోమో రిలీజ్ చేసినట్టు అర్థం అవుతుంది. ఏది ఏమైనప్పటికి పెళ్లి చేసుకుంటారు అనుకున్న ఫైమా, ప్రవీణ్ లు విడిపోవడానికి కారణం ఏంటి..? ఫైమా వేరే అబ్బాయిని ఎందుకు పెళ్లి చేసుకుంటుంది..?అనేది తెలియాలంటే శ్రీదేవి డ్రామా కంపెనీ ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Big Stories

×