BigTV English

Brahmaji: వాళ్ల ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నాం.. సెట్ లో కూడా..

Brahmaji: వాళ్ల ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నాం.. సెట్ లో కూడా..

Brahmaji: నటుడు బ్రహ్మాజీ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.   విలక్షణమైన  నటుల్లో బ్రహ్మాజీ కూడా ఒకరు. సింధూరం సినిమాలో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టిన బ్రహ్మాజీ.. విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారాడు.


సాధారణంగా కొంతమంది హీరో హీరోయిన్లను చూసి వీళ్లకు వయస్సు పెరుగుతుందా.. ? తరుగుతుందా..? అని ఆశ్చర్యపోతాం. అలానే బ్రహ్మాజీని చూసినా కూడా  నెటిజన్స్ ఆశ్చర్యపోతూ ఉంటారు. 59 ఏళ్ల వయస్సులో కూడా యంగ్ లుక్ లో కనిపిస్తూ ఔరా అని అనిపిస్తూ ఉంటాడు.

Nayanthara : నయన్ కు లీగల్ నోటీసులు ఇచ్చిన ‘చంద్రముఖి’ నిర్మాతలు… ముదురుతున్న ధనుష్ వివాదం


ఇక ఇవన్నీ పక్కన పెడితే..  సోషల్ మీడియాలో ఆయన నిత్యం యాక్టివ్ గా ఉంటాడు. సోషల్ మీడియాలో ఎంత పెద్ద విషయమైనా చాలా ఈజీగా చెప్పేస్తాడు. అది కూడా మనసులో ఏది అనుకుంటే అది జోక్  అన్నట్లు చెప్పుకొస్తాడు. కొన్నిసార్లు అసలు బ్రహ్మాజీ ఎవరిని అంటున్నాడో అన్న విషయం కూడా తెలియదు.

తాజాగా బ్రహ్మాజీ బౌన్సర్లపై మండిపడ్డాడు. ఈ మధ్యకాలంలో బౌన్సర్ల చేస్తున్న ఆగడాలు అన్ని ఇన్ని కావు. స్టార్ హీరోలకు అండగా ఉండడానికి నియమించుకున్న వారు.. హీరోల కన్నా ఎక్కువ బిల్డప్స్ ఇస్తూ ఉంటారు.  హీరోల దగ్గరకు అభిమానులు వస్తే పక్కకి జరపాల్సింది పోయి నిర్మొహమాటంగా వారిపై దాడికి పాల్పడుతున్నారు.

పుష్ప 2 బెన్ ఫిట్ షో తొక్కిసలాటలో కూడా అభిమానులపై  బన్నీ బౌన్సర్లు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. వీరి హడావిడికి విసిగిపోయిన బ్రహ్మాజీ.. వారి ఓవర్ యాక్షన్ గురించి  ఎక్స్ లో చెప్పుకొచ్చాడు. ” ఎక్కడ చూసిన బౌన్సర్స్ .. బౌన్సర్లు ..వాళ్ళ ఓవర్ యాక్షన్ ముందు మా యాక్షన్ సరిపోవటలేదు.. ఏం చేయాలి.  బయట అయితే ఓకే.. కానీ, సెట్స్ లో కూడా” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట  వైరల్ గా మారింది.

Allu Arjun: సీక్రెట్ గా శ్రీతేజ్ ను కలవనున్న అల్లు అర్జున్.. ఎందుకో తెలుసా.. ?

బ్రహ్మాజీ ఎవరి గురించి ఈ మాట అన్నాడు అనేది మాత్రం నెటిజన్స్ కు అంతుపట్టడం లేదు. ఇక ఈ పోస్ట్ పై అభిమానులు తమకు నచ్చినవిధంగా కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా బౌన్సర్లు పెట్టుకుని…మీకు అడ్డు వచ్చిన బౌన్సర్లని మీ బౌన్సర్లు తో పక్కకి తోసెయమని చెప్పండి అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. దానికి బ్రహ్మాజీ నవ్వేశాడు.

ఇంకొంతమంది అల్లు అర్జున్ ను టార్గెట్ చేస్తున్నాడని, బౌన్సర్ గా.. ఒక సినిమా లో.. ఏదొక బాబుతో రోల్ చేయించండి.. ఎలా ఉండాలో చూపించండి.. 100 కోట్ల బడ్జెట్ తో.. 200 బౌన్సర్లతో..ప్రి రిలీజ్ ఫంక్షన్ చెయ్యండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి బ్రహ్మాజీ ఏ హీరో బౌన్సర్ల గురించి ఈ విధంగా మాట్లాడాడో నెటిజన్స్ ఆరాలు తీయడం మొదలుపెట్టారు.

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×